డుకాటి మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ విడుదల: ధర రూ. 21.42 లక్షలు

డుకాటి విపణిలోకి మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ బైకును లాంచ్ చేసింది. సరికొత్త డుకాటి మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ ధర రూ. 21.42 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

By Anil Kumar

డుకాటి విపణిలోకి మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ బైకును లాంచ్ చేసింది. సరికొత్త డుకాటి మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ ధర రూ. 21.42 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది. డుకాటి ఇండియా గతంలో మల్టీస్ట్రాడా 1260 మరియు 1260 ఎస్ స్టాండర్డ్ వేరియంట్లను లాంచ్ చేసింది, వీటికి తోడుగా పైక్స్ పీక్ వేరియంట్ పరిచయం చేసింది.

డుకాటి మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ విడుదల

కొత్తగా విడుదలైన డుకాటి మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ ఎడిషన్ ఇండియన్ మార్కెట్లో కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే లభ్యమవుతుంది. కానీ, డుకాటి ఇండియాకు ఎన్ని యూనిట్లను కేటాయించిందో తెలియరాలేదు.

డుకాటి మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ విడుదల

మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ డెలివరీలను జూలై మధ్యలో నుండి ప్రారంభం కానున్నాయి. అయితే మల్టీస్ట్రాడా 1260 మరియు 1260 ఎస్ వేరియంట్ల డెలివరీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

డుకాటి మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ విడుదల

సాంకేతికంగా డుకాటి మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ బైకులో అదే 1,262సీసీ కెపాసిటి గల ఎల్-ట్విన్ ఇంజన్ 158బిహెచ్‌పి పవర్ మరియు 129.5ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డివిటి టెస్టాస్ట్రెట్టా ఇంజన్ కలదు. డెస్మొడ్రోమిక్ వేరిబుల్ టైమింగ్(డివిటి) మెరుగైన లో-ఎండ్ టార్క్ అందివ్వడంలో సహకరిస్తుంది.

డుకాటి మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ విడుదల

మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ బైకులో ఉన్న అత్యంత కీలకమైన ఫీచర్లలో, ఓహ్లిన్స్ కంపెనీ నుండి సేకరించిన సస్పెన్షన్, టెర్మిగ్నోని ఎగ్జాస్ట్ సిస్టమ్, కార్నరింగ్ ఏబిఎస్, బై-డైరక్షనల్ క్విక్-షిఫ్టర్ మరియు విండ్ స్క్రీన్, ఫ్రంట్ మడ్‌గార్డ్ మరియు ఎయిర్ ఇంటేక్ కవర్స్ వంటి కార్బన్ ఫైబర్ పార్ట్స్ ఉన్నాయి.

డుకాటి మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ విడుదల

మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ బైకును నూతన ఫ్రంట్ ఎండ్ మరియు పొడవాటి స్వింగ్ ఆర్మ్‌వలతో విభిన్నమైన కొలతల్లో ఉన్న ఛాసిస్ మీద నిర్మించినట్లు డుకాటి పేర్కొంది. అయితే, బీల్ బేస్ మరియు బైకు ఓవరాల్ కొలతలు స్టాండర్డ్ మల్టీస్ట్రాడా 1260 బైకునే పోలి ఉన్నాయి.

డుకాటి మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ విడుదల

మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ బాడీ మీద రేస్ ప్రేరిత డీకాల్స్ మరియు తేలికపాటి బరువున్న ఫోర్జ్‌డ్ అల్యూమినియం వీల్స్ ఉన్నాయి. అంతే కాకుండా, హ్యాండిల్ బార్ మీద బ్యాక్‌లిస్ట్ స్విచ్చులు, నాలుగు రైడింగ్ మోడ్స్, క్రూయిజ్ కంట్రోల్, వీలీ కంట్రోల్ మరియు హ్యాండ్స్-ఫ్రీ కనెక్టివిటి వంటి అదనపు ఫీచర్లు కలవు.

డుకాటి మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ విడుదల

ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కోసం కలర్ టిఎఫ్‌టి డిస్ల్పే, ఎల్ఇడి హెడ్‌లైట్ మరియు కార్నరింగ్ లైట్లు కేవలం మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ మరియు 1260 ఎస్ వేరియంట్లలో మాత్రమే లభిస్తున్నాయి.

డుకాటి మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ విడుదల

మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ బైకు స్టాండర్డ్ 1260 మరియు 1260 ఎస్ వేరియంట్ల కంటే మరింత తేలికగా ఉంటుంది. దీని మొత్తం బరువు 229కిలోలుగా ఉండిగా, 1260 మరియు 1260 ఎస్ వేరియంట్ల ధరలు వరుసగా 232 మరియు 235కిలోలుగా ఉన్నాయి.

డుకాటి మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డుకాటి మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ బైకు డుకాటి ఇండియా లైనప్‌లోనే టాప్ ఎండ్ వేరియంట్. ఇందులో ఓహ్లిన్స్ సస్పెన్షన్ మరియు ఇతర ప్రీమియం విడి భాగాలు ఉన్నాయి. అత్యంత మెరుగైన పనితీరును ప్రదర్శించే ఇది ఇతర వేరియంట్ల కంటే చాలా తేలికగా ఉంటుంది.

డుకాటి మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ విడుదల

డుకాటి మల్టీస్ట్రాడా 1260 పైక్స్ పీక్ మోడల్ విపణిలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000 ఎక్స్ఆర్ ప్రో బైకుకు గట్టి పోటీనిస్తుంది. అయితే, 21.42 లక్షల ధరతో విడుదలైన ఈ బైకును ఎంత మంది కొనుగోలు చేస్తారో చూడాలి మరి!!

Most Read Articles

English summary
Read In Telugu: Ducati Multistrada 1260 Pikes Peak Launched In India; Priced At Rs 21.42 Lakh
Story first published: Tuesday, June 26, 2018, 18:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X