ఎలక్ట్రిక్ వాహనాలకు నూతన నెంబర్ ప్లేట్ విధానం

By Anil Kumar

ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ నెంబర్ ప్లేట్ల విధానాన్ని అనుమతించింది. ఇండియన్ రోడ్ల మీద తిరిగే పెట్రోల్ మరియు డీజల్ వాహనాల నుండి ఈ గ్రీన్ నెంబర్ ప్లేట్లు ఎలక్ట్రిక్ వాహనాలను వేరు చేస్తాయి.

ఎలక్ట్రిక్ వాహనాలకు నూతన నెంబర్ ప్లేట్ విధానం

ఇది వరకు ఎలక్ట్రిక్ వాహనాలకు మరియు సాధారణ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వాహనాలకు ఒకే తరహా నెంబర్ ప్లేట్ సిస్టమ్ ఉండేది. అయితే, ఇప్పుడు తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే ప్రత్యేకమైన నెంబర్ ప్లేట్ సిస్టమ్ వచ్చింది.

ఎలక్ట్రిక్ వాహనాలకు నూతన నెంబర్ ప్లేట్ విధానం

ఇక మీదట అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క నెంబర్ ప్లేట్లు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అయితే, వీటిలో వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించే ఎలక్ట్రిక్ వాహనాలకు ఆకుపచ్చ రంగు బోర్డు మీద తెలుపు రంగు నెంబర్లు ఉన్న రిజిస్ట్రేషన్ ప్లేటును కేటాయిస్తారు.

ఎలక్ట్రిక్ వాహనాలకు నూతన నెంబర్ ప్లేట్ విధానం

అదే విధంగా, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎలక్ట్రిక్ వాహనాలకు (ఉదాహరణకు ట్యాక్సీలు మరియు చిన్న చిన్న ట్రక్కులు) ఆకుపచ్చ రంగు ప్లేట్ మీద పసుపు రంగులో అక్షరాలు ఉండే రిజిస్ట్రేషన్ ప్లేటును కేటాయిస్తారు.

ఎలక్ట్రిక్ వాహనాలకు నూతన నెంబర్ ప్లేట్ విధానం

ఈ గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్లను కేవలం ఉద్గార రహిత వాహనాలకు మాత్రమే ఇస్తారు. ఇండియన్ రోడ్ల మీద తిరిగే ఎలక్ట్రిక్ బస్సులు, కార్లు మరియు చిన్న తరహా వాణిజ్య వాహనాలకు ఈ గ్రీన్ కలర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లను అందిస్తారు.

ఎలక్ట్రిక్ వాహనాలకు నూతన నెంబర్ ప్లేట్ విధానం

ప్రస్తుతం, టాటా మోటార్స్ మరియు మహీంద్రా మాత్రమే వ్యక్తిగత మరియు వాణిజ్య అవసరాలకు ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్ విధానంతో ఇక మీదట ఎలక్ట్రిక్ వాహనాలను సులభంగా గుర్తించవచ్చు.

ఎలక్ట్రిక్ వాహనాలకు నూతన నెంబర్ ప్లేట్ విధానం

గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్ విధానంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు మీద ప్రభుత్వం ఇతర ప్రయోజనాలను కూడా ప్రతిపాదించింది. ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసే వారికి కేంద్రం ప్రతిపాదించిన ప్రయోజనాల్లో పార్కింగ్ ఏరియాల్లో తొలి ప్రాధాన్యత, ఇరుకైన రహదారుల్లో ఉచిత ఎంట్రీ మరియు టోల్ ధరల్లో తగ్గింపు అదే విధంగా వాణిజ్య వాహనాలకు పర్మిట్లను తొలగించింది.

ఎలక్ట్రిక్ వాహనాలకు నూతన నెంబర్ ప్లేట్ విధానం

ఎలక్ట్రిక్ వాహనాల మీద పర్మిట్లను తొలగించడంతో ప్రత్యేకించి అర్బన్ ఏరియాల్లో ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు మరియు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల సేల్స్ విపరీతంగా ఊపందుకోనున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్లను ఉపయోగించాలని సూచించే నోటిఫికేషన్ మరో వారం రోజుల్లో జారీ అవుతుంది.

ఎలక్ట్రిక్ వాహనాలకు నూతన నెంబర్ ప్లేట్ విధానం

ప్రజలు ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసే దిశగా ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల కోసం విభిన్నమైన గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్ల విధానానికి భారత ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ ప్రకటనలో తెలిపారు. ఇలాంటి ఎలక్ట్రిక్ వాహనాలు గ్రీన్ కలర్ ప్లేటు మీద వ్యక్తిగత అవసరాలకైతే తెలుపు రంగు అక్షరాలు మరియు వాణిజ్య అవసరాలకైతే పసుపు రంగు అక్షరాలు ఉంటాయని వివరించాడు.

ఎలక్ట్రిక్ వాహనాలకు నూతన నెంబర్ ప్లేట్ విధానం

ఎలక్ట్రిక్ వాహనాలకు గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్లను కేటాయించడంతో పాటు, 16 నుండి 18 ఏళ్ల వయసున్న యువతీ యువకులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే ఎలక్ట్రిక్ స్కూటర్లను రైడ్ చేయడానికి అనుమతించింది.

ప్రస్తుతం అయితే, 16 నుండి 18 ఏళ్ల మధ్య వయసున్న యువత 50సీసీ కంటే తక్కువ ఇంజన్ కెపాసిటి ఉన్న మోపెడ్‌లను నడపడానికి అనుమతిస్తోంది. కానీ, ఇండియన్ మార్కెట్లో 50సీసీ కంటే తక్కువ కెపాసిటి ఉన్న టూ వీలర్ల లేవు.

ఎలక్ట్రిక్ వాహనాలకు నూతన నెంబర్ ప్లేట్ విధానం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఉద్గార రహిత వాహనాలకు ప్రాచుర్యం పొందిన ఎలక్ట్రిక్ వాహనాలను విరివిగా వినియోగించడంలో ఎన్నో ప్రపంచ దేశాలు ముందున్నాయి. కానీ, ఇండియా మాత్రమే ఇప్పటికీ, విపరీతమైన కాలుష్య కారకాలను వాతావరణంలోకి వెదజల్లే డీజల్ మరియు పెట్రోల్ వాహనాలను ఉపయోగిస్తోంది.

ఎలక్ట్రిక్ వాహనాలకు నూతన నెంబర్ ప్లేట్ విధానం

దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహిచేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు నూతన నెంబర్ ప్లేట్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అదనంగా, ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించే వారికి మరెన్నో అదనపు ప్రయోజనాలను ప్రతిపాదించింది.

Most Read Articles

English summary
Read In Telugu: Electric Vehicles To Get Green Number Plates
Story first published: Thursday, May 10, 2018, 16:34 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X