ఫోర్డ్ ఫ్రీస్టైల్ విడుదల: వేరియంట్లు, ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

అమెరికా ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్ ఇండియా విభాగం నేడు (26 ఏప్రిల్, 2018) విపణిలోకి సరికొత్త ఫ్రీస్టైల్ కారును విడుదల చేసింది. కాంపాక్ట్ యుటిలిటి వెహికల్ అనే సరికొత్త సెగ్మెంట్లోకి ఫ్రీస్టై

By Anil Kumar

అమెరికా ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్ ఇండియా విభాగం నేడు (26 ఏప్రిల్, 2018) విపణిలోకి సరికొత్త ఫ్రీస్టైల్ కారును విడుదల చేసింది. కాంపాక్ట్ యుటిలిటి వెహికల్ అనే సరికొత్త సెగ్మెంట్లోకి ఫ్రీస్టైల్ కారును రూ. 5.09 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరతో ప్రవేశపెట్టింది.

ఫోర్డ్ వాహన శ్రేణిలోని ఫిగో హ్యాచ్‌బ్యాక్ మరియు ఇకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీల మధ్య స్థానాన్ని భర్తీ చేసే ఫ్రీస్టైల్ క్రాసోవర్ కారును ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా రూపొందించింది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ విడుదల

ఫోర్డ్ ఫ్రీస్టైల్ వేరియంట్లు మరియు ధరలు

ఫోర్డ్ ఫ్రీస్టైల్ నాలుగు విభిన్న వేరియంట్లలో విడుదలయ్యింది. అవి, ఆంబియంట్, ట్రెండ్, టైటానియం మరియు టైటానియం ప్లస్. ఫోర్డ్ ఫ్రీస్టైల్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.09 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 7.89 లక్షలు. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.

Variant Petrol Diesel
Ambiente ₹ 509,000 ₹ 609,000
Trend ₹ 599,000 ₹ 699,000
Titanium ₹ 639,000 ₹ 735,000
Titanium+ ₹ 694,000 ₹ 789,000
ఫోర్డ్ ఫ్రీస్టైల్ విడుదల

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఇంజన్ వివరాలు

ఫోర్డ్ ఇండియా తమ సరికొత్త కాంపాక్ట్ యుటిలిటి వెహికల్ ఫ్రీస్టైల్‌ కారులో రెండు ఇంజన్ ఆప్షన్లను పరిచయం చేసింది. అవి, 95బిహెచ్‌పి పవర్ మరియు 120ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.2-లీటర్ నూతన డ్రాగన్ సిరీస్ పెట్రోల్ ఇంజన్ మరియు 100బిహెచ్‌‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లు ఉన్నాయి. రెండింటినీ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ విడుదల

ఫోర్డ్ ఫ్రీస్టైల్ డిజైన్

ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్‌తో పోల్చుకుంటే ఫోర్డ్ ఫ్రీస్టైల్ చూడటానికి చాలా లావుగా మరియు ధృడంగా కనిపిస్తుంది. ఫ్రీస్టైల్ ఫ్రంట్ డిజైన్‌లో హెక్సాగోనల్ బ్లాక్డ్ అవుట్ గ్రిల్, గ్రిల్‌కు ఇరువైపులా హెడ్‌ల్యాంప్స్, సి-ఆకారంలో ఉన్న ఫాగ్ ల్యాంప్స్ మరియు సిల్వర్ స్కిడ్ ప్లేట్లు ఉన్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ విడుదల

ఫోర్డ్ ఫ్రీస్టైల్ సైడ్ ప్రొఫైల్‌లో బాడీ చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ ఉంది, 15-అంగుళాల్ అల్లాయ్ వీల్స్ మరియు బ్లాక్ గ్రాఫిక్స్ గమనించవచ్చు. ఫోర్డ్ ఫ్రీస్టైల్ రియర్ డిజైన్‌లో కొత్తగా డిజైన్ చేయబడిన టెయిల్ ల్యాంప్ క్లస్టర్ మరియు స్కిడ్ ప్లేట్ ఉంది. ఈ కాంపాక్ట్ యుటిలిటి వెహికల్‌కు ఆఫ్ రోడ్ లుక్‌ను ఇచ్చేందుకు రూఫ్ రెయిల్స్ కూడా ఉన్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ విడుదల

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఇంటీరియర్ మరియు ఫీచర్లు

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఇంటీరియర్‌లో చాకోలెట్-ఆన్-బ్లాక్ థీమ్ డ్యాష్‌బోర్డ్ ఉంది. ఫ్రీస్టైల్ క్యాబిన్‌లో 6.5-అంగుళాల పరిమాణంలో ఉన్న సింక్3 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా, పవర్ ఫోల్డింగ్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు మరియు ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Recommended Video

Ford Freestyle Review | Test Drive | Interior, Top Features & More - DriveSpark
ఫోర్డ్ ఫ్రీస్టైల్ విడుదల

భద్రత పరంగా ఫోర్డ్ ఫ్రీస్టైల్ కాంపాక్ట్ యుటిలిటి వెహికల్‌‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, సీట్ బెల్ట్ రిమైండర్, కీలెస్ ఎంట్రీ, అప్రోచ్ సెన్సార్లు మరియు పెరీమీటర్ థెఫ్ట్ అలారమ్ వంటివి ఉన్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ విడుదల

ఫోర్డ్ ఫ్రీస్టైల్ టాప్ ఎండ్ వేరియంట్లో అదనంగా యాక్టివ్ రోల్ఓవర్ ప్రొటెక్షన్, సైడ్ మరియు కర్టెన్ ఎయిర్ బ్యాగులు మరియు ఎమర్జెన్సీ అస్టిస్టెన్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఆరు విభిన్న రంగుల్లో లభిస్తుంది. అవి, కేన్యాన్ రిడ్జ్, మూన్‌డస్ట్ సిల్వర్, స్మోక్ గ్రే, వైట్ గోల్డ్, ఆక్స్‌ఫర్డ్ వైట్ మరియు అబ్సల్యూట్ బ్లాక్ వంటి రంగుల్లో ఎంచుకోవచ్చు.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ విడుదల

ఫోర్డ్ ఫ్రీస్టైల్ యాక్ససరీలు

ఫ్రీస్టైల్ కోసం ఫోర్డ్ ఎన్నో ఆకర్షణీయమైన స్టైలిష్ యాక్ససరీలను అందిస్తోంది. ఈ ఫ్రీస్టైల్ కాంపాక్ట్ యుటిలిటి వెహికల్‌లో రియర్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నా, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, బాడీ స్ట్రిప్ కిట్, రూఫ్ వ్రాప్, సీట్ కవర్లు, సన్ బ్లైండ్స్ మరియు స్లిమ్‌లైన్ వెథర్ షీల్డ్ వంటివి ఉన్నాయి.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఫోర్డ్ ఫ్రీస్టైల్ భారతదేశపు తొలి కాంపాక్ట్ యుటిలిటి వెహికల్. ఎన్నో అత్యాధునిక ఫీచర్లు మరియు ఆకర్షణీయమైన యాక్ససరీలతో వచ్చిన ఫ్రీస్టైల్ సాధారణ హ్యాచ్‌బ్యాక్ కార్లతో పోల్చుకుంటే విభిన్నంగా ఉంటుంది. హ్యాచ్‌బ్యాక్ డిజైన్ మరియు కాంపాక్ట్ ఎస్‌యూవీ లక్షణాలతో వచ్చిన పర్ఫెక్ట్ క్రాసోవర్ ఈ ఫోర్డ్ ఫ్రీస్టైల్.

సరికొత్త ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ విపణిలో ఉన్న టయోటా ఎటియోస్ క్రాస్, వోక్స్‌వ్యాగన్ పోలో క్రాస్, హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ మరియు ఫియట్ అర్బన్ క్రాస్ వంటి మోడళ్లకు గట్టి పోటీస్తుంది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ విడుదల

అంతే కాకుండా, ఇంజన్ అండర్ షీల్డ్, యాంటీ-థెఫ్ట్ నట్లు, రియర్ కెమెరా, రూఫ్ రెయిల్స్, స్మార్ట్ ఆంబియంట్ లైటింగ్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి.

 ఫోర్డ్ ఫ్రీస్టైల్ విడుదల

1.ఫోర్డ్ ఫ్రీస్టైల్ రివ్యూ: ఒక కొత్త అధ్యయనానికి నాంది

2.ఫోర్డ్ ఫ్రీస్టైల్ క్రాసోవర్ కారులో కళ్లు చెదిరే యాక్ససరీలు

3.మే లో విడుదలవుతున్న టయోటా యారిస్ వేరియంట్లు మరియు ధరల వివరాలు

4.2018 మారుతి ఎర్టిగా కారును ఆవిష్కరించిన మారుతి సుజుకి

5.విపణిలోకి 2018 మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఫేస్‌లిఫ్ట్ విడుదల

Most Read Articles

English summary
Read In Telugu: Ford Freestyle Launched In India; Prices Start At Rs 5.09 Lakh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X