TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
మారుతికి గట్టి షాక్, ప్రతి కారుకు పోటీని సృష్టిస్తున్న హ్యుందాయ్
దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ 2018లో ఇండియన్ మార్కెట్లోకి కొన్ని కొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి సిద్దమైంది.
తాజాగా అందిన సమాచారం మేరకు, ఈ ఏడాదిలో పరిచయం చేసే కొత్త ఉత్పత్తులతో పాటు ఏ-సెగ్మెంట్‌కు చెందిన ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్‌కు ఖరారు చేసినట్లు తెలిసింది.
కొత్త ఎస్‌యూవీకి సంభందించి హ్యుందాయ్ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ఏ-సెగ్మెంట్ ఆధారిత ఎస్‌యూవీతోపాటు మూడవ తరానికి చెందిన ఐ10 హ్యాచ్‌బ్యాక్‌ను 2020 నాటికి పరిచయం చేయనుంది. రెండింటిని ఒకే ఫ్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేసే అవకాశం ఉంది.
వీటితో పాటు క్యూఎక్స్ఐ కోడ్ పేరుతో నూతన సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. హ్యుందాయ్ 2016లో జరిగిన ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఆవిష్కరించిన కార్లినో కాన్సెప్ట్ ఆధారంగా అభివృద్ది చేస్తోంది.
కాన్సెప్ట్ వెర్షన్ కార్లినో కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రొడక్షన్ దశకు చేరుకుని పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే, విపణిలో ఉన్న ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టాటా నెక్సాన్ మరియు మారుతి సుజుకి వంటి కంపాక్ట్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది. దీనిని 2019 నాటికి అందుబాటులోకి తీసుకురానుంది.
ఈ ఏడాదిలో హ్యుందాయ్ తమ క్రెటా ఎస్‌యూవీని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ చేయనుంది. 2018 మలిసగంలో క్రెటా ఫేస్‌లిఫ్ట్ పూర్తి స్థాయిలో లభ్యం కానుంది. దీనితో పాటు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఐ20 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కూడా విడుదలకు సిద్దమవుతోంది. హ్యుందాయ్ దీనిని ఇప్పటికే పలుమార్లు రహస్యంగా పరీక్షించింది.
హ్యుందాయ్ మోటార్స్ తమ మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ బ్రాండ్ శాంట్రో ఆధారిత కారును ఏహెచ్2 కోడ్ పేరుతో డెవలప్ చేస్తోంది. కొత్త తరం శాంట్రో కారును 2018లోనే రెనో క్విడ్ మరియు మారుతి ఆల్టో కార్లకు గట్టి పోటీనిచ్చేలా హ్యుందాయ్ ఇయాన్ స్థానాన్ని భర్తీ చేస్తూ విపణిలోకి రానుంది.
Trending On DriveSpark Telugu:
సలోన్ వెర్షన్ స్విఫ్ట్ స్పోర్ట్ ఆవిష్కరించిన సుజుకి
2017లో అత్యధికంగా గూగుల్ చేసిన టాప్ 10 కార్లు
ఈ ఏడాది మారుతి విడుదలకు సిద్దం చేసిన కొత్త కార్లు
మొత్తం డబ్బు చెల్లించి నాలుగు నెలలైనా కారు డెలివరీకి ససేమిరా అంటున్న డీలర్
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
దేశీయంగా గత కొన్నేళ్ల నుండి కాంపాక్ట్ ఎస్‌యూవీలకు మంచి ఆదరణ లభిస్తోంది. దాదాపు అన్ని కార్ల తయారీ సంస్థలు ఈ సెగ్మెంట్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. వాటిలో ఇప్పుడు హ్యుందాయ్ కూడా నిలిచింది. హ్యుందాయ్ మోటార్స్ కార్లినో ఆధారిత ఎస్‌యూవీతో పాటు 2019 నాటికి ఏ-సెగ్మెంట్ ఆధారిత ఎస్‌యూవీతో సిద్దమవుతోంది.
Trending DriveSpark Telugu YouTube Videos