డీలర్ల వద్దకు చేరిన హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

Written By:
Recommended Video - Watch Now!
Auto Rickshaw Explodes In Broad Daylight

హ్యందాయ్ మోటార్స్ ఈ ఏడాది 2018 ఐ20 ఫేస్‌లిఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. హ్యుందాయ్ తాజాగా ఐ20 ఫేస్‌లిఫ్ట్ కార్లను డీలర్లకు సరఫరా చేస్తుండగా తీసిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. మీరు కనుక కొత్త ఐ20 కారు కొంటున్నట్లయితే కొద్ది రోజులు ఆగండి... హ్యుందాయ్ అతి త్వరలో తమ ఆల్ న్యూ ఐ20 ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేయనుంది.

 హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

హ్యుందాయ్ ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ కారును ఆటో ఎక్స్‌పో 2018లో ప్రదర్శించనుంది. మునుపటి వెర్షన్‌తో పోల్చితే ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ మరియు డిజైన్ పరంగా ఇందులో ఎన్నో మార్పులు జరిగాయి.

 హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ ఫ్రంట్ డిజైన్‌లో అధునాతన ఫ్రంట్ బంపర్, సరికొత్త సిగ్నేచర్ క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్ మరియు స్వల్ప డిజైన్ అప్‌డేట్స్‌కు గురైన హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు ప్రొజెక్టర్ లైట్లు ఉన్నాయి.

 హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

ఐ20 ఫేస్‌లిఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడటానికి మునుపటి తరం ఐ20 కారునే పోలి ఉంది. ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ వద్ద మొదలయ్యి, రియర్ టెయిల్ ల్యాంప్స్ వద్ద ముగిసే అవే క్యారెక్టర్ లైన్స్ ఇందులో ఉన్నాయి. నూతన అల్లాయ్ వీల్స్ వచ్చే అకాశం ఉంది. రియర్ డిజైన్‌లో కూడా నూతన టెయిల్ ల్యాంప్ క్లస్టర్ మరియు రీడిజైన్ చేయబడిన బంపర్ ఉన్నాయి.

 హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

హ్యుందాయ్ ఐ20 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లో ప్రీమియమ్ ఫీల్ కలిగించే అధునాతన డ్యాష్ బోర్డ్, పెద్ద పరిమాణంలో ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు డ్యూయల్ టోన్ బ్లాక్ మరియు బీజి ఇంటీరియర్ వంటివి ఉన్నాయి.

 హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

ఇందులోని నూతన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి కనెక్టివిటి ఫీచర్లతో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు సెన్సార్లతో పాటు మరిన్ని ముఖ్యమైన ఫీచర్ల రానున్నాయి.

 హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

సాంకేతికంగా హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్‌లో అవే మునుపటి 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.4-లీటర్ డీజల్ ఇంజన్‌లు వస్తున్నాయి. వీటిలో పెట్రోల్ వేరియంట్ 82బిహెచ్‌పి పవర్ మరియు 115ఎన్ఎమ్ టార్క్, అదే విధంగా డీజల్ యూనిట్ 89బిహెచ్‌పి పవర్ మరియు 220ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి.

 హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

పెట్రోల్ వేరియంట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు డీజల్ వేరియంట్ ఐ20 6-స్పీడ్ మ్యాన్యునవల్ గేర్‌బాక్స్‌తో లభ్యం కానున్నాయి. తాజాగా అందిన సమాచారం మేరకు, పెట్రోల్ వెర్షన్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

 హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

నూతన ఐ20 ఫేస్‌లిఫ్ట్ మరింత పదునైన డిజైన్ శైలిలో అత్యంత ఆకర్షణీయంగా సొబగులతో విపణిలోకి రానుంది. ఐ20 ఫేస్‌లిఫ్ట్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో ఉన్న బాలెనో కారుకు సరాసరి పోటీనివ్వనుంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: 2018 Hyundai i20 Facelift Images At Dealership Leaked; Launch At Auto Expo 2018
Story first published: Saturday, February 3, 2018, 16:17 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark