2018 ఎడిషన్‌ ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ విడుదల: వేరియంట్లు, ధరలు మరియు ప్రత్యేకతలు

Written By:
Recommended Video - Watch Now!
Fire Accident In Chengicherla, Telangana | Petrol Tanker Blast

ఇసుజు మోటార్స్ ఇండియా విపణిలోకి 2018 ఎడిషన్ డి-మ్యాక్స్ వి-క్రాస్ వెహికల్‌ను లాంచ్ చేసింది. సరికొత్త 2018 ఎడిషన్ డి-మ్యాక్స్ వి-క్రాస్ ప్రారంభ ధర రూ. 14.31 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

2018 ఎడిషన్ ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్

ఇసుజు తమ డి-మ్యాక్స్ వి-క్రాస్ వాహనాన్ని రెండు విభిన్న వేరియంట్లలో ప్రవేశపెట్టింది. వీటిలో హై ఎండ్ వేరియంట్ ధర రూ. 15.81 లక్షలు మరియు స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 14.31 లక్షలు. రెండు ధరలు కూడా ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి. నూతన వి-క్రాస్ శ్రేణి వాహనాలలో 2018 ఎడిషన్ పేరుతో సరికొత్త ఫీచర్లను ఇసుజు పరిచయం చేసింది.

2018 ఎడిషన్ ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్

ఈ 2018 ఎడిషన్ డి-మ్యాక్స్ వి-క్రాస్ సాంకేతికంగా మునుపటి మోడల్‌నే పోలి ఉన్నప్పటికీ, ధర మాత్రం కాస్త అధికంగానే ఉంది. ఇసుజు భారతదేశపు తొలి అడ్వెంచర్ యుటిలిటి వెహికల్‌ను మొట్టమొదటి సారిగా మే 2016 లో దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టింది.

2018 ఎడిషన్ ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్

కొత్త ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్‌లో డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే, ఎక్ట్సీరియర్ పరంగా ఎన్నో అప్‌డేట్స్ జరిగాయి. అందులో ఫాగ్ ల్యాంప్స్ స్థానంలో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, ఎల్ఇడి టెయిల్ లైట్లు మరియు రీడిజైన్ చేయబడిన టెయిల్ గేట్, సైడ్ స్టెప్స్ మరియు 2018 ఎడిషన్ డి-మ్యాక్స్ వెహికల్‌లో క్రోమ్ బంపర్ ఉంది.

2018 ఎడిషన్ ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్

కొత్త ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్‌లో డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే, ఎక్ట్సీరియర్ పరంగా ఎన్నో అప్‌డేట్స్ జరిగాయి. అందులో ఫాగ్ ల్యాంప్స్ స్థానంలో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, ఎల్ఇడి టెయిల్ లైట్లు, రీడిజైన్ చేయబడిన టెయిల్ గేట్, సైడ్ స్టెప్స్ మరియు 2018 ఎడిషన్ డి-మ్యాక్స్ వెహికల్‌లో క్రోమ్ బంపర్ ఉంది.

2018 ఎడిషన్ ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్

భద్రత పరంగా డి-మ్యాక్స్ వి-క్రాస్ వాహనంలో రెగ్యులర్‌గా వచ్చే ఫీచర్లతో పాటు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ వంటి అదనపు ఫీచర్లను టాప్ ఎండ్ వేరియంట్ "హై" లో ఉన్నాయి.

Trending On DriveSpark Telugu:

రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

రెండు లారీల మధ్య నలిగిపోయిన ఈ కారులో ప్రయాణికులంతా సేఫ్: ఇంతకీ ఇది ఏ కారో... తెలుసా...?

మారుతి నుండి మరో కొత్త ఎస్‌యూవీ: పూర్తి వివరాలు!!

2018 ఎడిషన్ ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్

సాంకేతికంగా సరికొత్త డి-మ్యాక్స్ వి-క్రాస్‌లో 2.5-లీటర్ కెపాసిటి గల అదే డీజల్ ఇంజన్ కలదు. ఇంజన్ ఉత్పత్తి చేసే 132బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది.

2018 ఎడిషన్ ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ భారతదేశపు అత్యుత్తమ అడ్వెంచర్ యుటిలిటి వెహికల్. ఎలాంటి పోటీ ఉన్నా ఇప్పటి వరకు నిలకడైన ఫలితాలు సాధిస్తూ వచ్చింది. ఇప్పుడు 2018 ఎడిషన్‌లో లాంచ్ చేసి, అధునాతన మరియు అతి ముఖ్యమైన ఫీచర్లను పరిచయం చేసింది. అందులో అడ్వెంచర్ వాహనాలకు అతి ముఖ్యమైన ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ వంటివి వచ్చాయి. రెగ్యులర్ వెర్షన్ డి-మ్యాక్స్ వి-క్రాస్‌తో పోల్చితే 2018 ఎడిషన్ డి-మ్యాక్స్ ధరలు అధికంగానే ఉన్నాయి. ధర స్వల్పంగా పెరిగినప్పటికీ, మార్కెట్లో ఇదే అత్యుత్తమమైన అడ్వెంచర్ వెహికల్.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: 2018 Edition Isuzu D-Max V-Cross Launched In India; Prices Start At Rs 14.31 Lakh
Story first published: Tuesday, January 16, 2018, 9:27 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark