తొలి ఎస్‌యూవీతోనే అద్భుతం చేసిన జాగ్వార్

Written By:
Recommended Video - Watch Now!
Jaguar 'The Art Of Performance Tour' Bangalore - DriveSpark

బ్రిటన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం జాగ్వార్ ఎట్టకేలకు ప్రొడక్షన్ వెర్షన్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. జాగ్వార్ గత కొంత కాలంగా ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని పలు దఫాలుగా పరీక్షిస్తూ వస్తోంది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం కాన్సెప్ట్ రూపంలో ఆవిష్కరించిన జాగ్వార్ ఇప్పుడు ప్రొడక్షన్‌కు సిద్దమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది.

జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డిజైన్ మొత్తాన్ని భౌతిక శాస్త్రం ఆధారంగా అభివృద్ది చేసినట్లు జాగ్వార్ పేర్కొంది. ఇంజన్ లేకపోవడంతో బానెట్ పొట్టిగా ఉంటుంది. గాలి ద్వారా ఘర్షణను నివారించేందుకు ఫ్రంట్ డిజైన్‌లో స్లోపింగ్ బానిట్, హనికాంబ్ గ్రిల్, స్లీక్ ఎల్ఇడి హెడ్‍‌లైట్లు మరియు విశాలమైన ఎయిర్ ఇంటేకర్ ఉన్నాయి.

జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

ఐ-పేస్ ఎస్‌యూవీలో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, కొత్తగా డిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్ మరియు ఇంటిగ్రేటెడ్ సింగ్నల్ లైట్లు గల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ ఇంకా ఎన్నో నూతన డిజైన్ అంశాలు ఉన్నాయి.

జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

జాగ్వార్ తమ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అత్యంత కఠినమైన రహదారుల్లో మైనస్ 40 డిగ్రీల నుండి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద పరీక్షించారు. ఐ-పేస్ ఎలక్ట్రిక్ నిజానికి ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ కాదు. కానీ 500మిల్లీమీటర్ల లోతు వరకు నీటిలో ప్రయాణించగలదు.

జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

ఐ-పేస్ ఇంటీరియర్‌లో విశాలమైన క్యాబిన్ మరియు విభిన్న స్టోరేజ్ స్పేస్‌లు కలవు. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇంటీరియర్‌లో ఐన్‌కంట్రోల్ టచ్ ప్రొ డ్యూఒ ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. జాగ్వార్ తొలుత దీనిని రేంజ్ రోవర్ వెలార్‌లో పరిచయం చేసింది.

జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

జాగ్వార్ ఐ-పేస్ ఎస్‌యూవీలో అలెక్సా స్కిల్ గల ఇన్‌కంట్రోల్ రిమోట్ అప్లికేషన్ ఉంది. ఈ ఫీచర్ ద్వారా, ఎస్‌యూవీ ఛార్జిగ్ మరియు ఇతరత్రా వివరాలను డ్రైవర్ అలెక్సా డివైజ్‌లను అడగవచ్చు. అంతే కాకుండా, 4జీ వై-ఫై హాట్‌స్పాట్, త్రీ వోల్ట్ సాకెట్స్, ఆరు యుఎస్‌బి పోర్ట్స్ మరియు హెచ్‌డిఎమ్ఐ/హెచ్ఎమ్ఎల్ పోర్ట్ ఉన్నాయి.

జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో రెండు యాక్సిల్స్ మీద రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. రెండు మోటార్లు సంయుక్తంగా 395బిహెచ్‌పి పవర్ మరియు 696ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ గల ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కేవలం 4.5-సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిమీల వేగాన్ని అందుకుంటుంది.

జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

ఎస్‌యూవీలోని ఎలక్ట్రిక్ మోటార్లకు 60kWh లిథియం-అయాన్ బ్యాటరీ నుండి పవర్ అందుతుంది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే నిరవధికగా 480కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 100kW ర్యాపిడ్ ఛార్జర్ ద్వారా కేవలం 45 నిమిషాల్లోనే 80 శాతం బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

జాగ్వార్ ఐ-పేస్ ఎల్‌క్ట్రిక్ ఎస్‌యూవీని ఆస్ట్రియా దేశంలో ఉన్న మ్యాగ్నా స్టేర్ ప్రొడక్షన్ ప్లాంటులో తయారు చేయనున్నారు. ఈ ప్లాంటులో ప్రతి 8 గంటలకు ఒక ఐ-పేస్ ఎస్‌యూవీని తయారు చేయవచ్చు. ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను జూలై 2018 నుండి డెలివరీ ఇవ్వనుంది.

జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జాగ్వార్ నుండి వస్తోన్న తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ జాగ్వార్ ఐ-పేస్. సాంకేతికంగా అత్యాధునిక ఎలక్ట్రిక్ మోటార్లు, అత్యధిక రేంజ్ మరియు అద్భుతమైన పర్ఫామెన్స్ ఐ-పేస్ సొంతం. భారత్‌లో జాగ్వార్ ఐ-పేస్ విడుదల గురించి ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు. మరో రెండేళ్లపు ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇండియన్ రోడ్లను చేరే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Jaguar I-Pace Electric SUV Revealed — Specifications, Features & Images
Story first published: Sunday, March 4, 2018, 5:45 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark