త్వరపడండి కంపాస్‌లోని ఆ ఒక్క వేరియంట్ మీద ఒకటిన్నర లక్ష డిస్కౌంట్

Written By:

ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ (FCA) జీప్ 4X4 మంథ్ సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ సెలబ్రేషన్ ఏప్రిల్ 4 నుండి 30, 2018 వరకు జరుగుతాయి. జీప్ 4X4 మంథ్ సెలబ్రేషన్స్‌లో భాగంగానే విపణిలో ఉన్న కంపాస్ ఎస్‌యూవీ మీద అద్భుతమైన ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటించింది.

జీప్ కంపాస్ ఆఫర్లు

ఈ ఏప్రిల్ 4 నుండి 30 మధ్యన జీప్ కంపాస్ 4X2 వేరియంట్ బుక్ చేసుకోవాలనుకునే మరియు ఇప్పటికే బుక్ చేసుకున్న కస్టమర్లు అదనంగా మరో రూ. 50,000 లు చెల్లిస్తే, 4X2 వేరియంట్‌కు బదులుగా కంపాస్ టాప్ 4X4 ఎండ్ వేరియంట్‌ను ఎంచుకోవచ్చు.

జీప్ కంపాస్ ఆఫర్లు

కంపాస్ 4X2 వేరియంట్ ధర ప్రారంభ రూ. 19.21 లక్షలు మరియు 4X4 వేరియంట్ ధర రూ. 21.18 లక్షలు. అంటే 50,000 రుపాయలు చెల్లించడంతో కస్టమర్లు ఏకంగా టాప్ ఎండ్ వేరియంట్ కంపాస్ ఎస్‌యూవీని సొంతం చేసుకోవచ్చ.

జీప్ కంపాస్ ఆఫర్లు

4X2 మరియు 4X4 వేరియంట్ల మధ్య ధరల వ్యత్యాసం రూ. 2 లక్షలుగా ఉంది. అంటే ఈ జీప్ 4X4 మంథ్ ఆఫర్లలో భాగంగా రూ. 50,000 చెల్లిస్తే 4X4 వేరియంట్‌ను రూ. 1.5 లక్షల తక్కువ ధరతో ఎంచుకోవచ్చన్నమాట.

Recommended Video - Watch Now!
MG Motors’ Creta Rival Is Coming To India - DriveSpark
జీప్ కంపాస్ ఆఫర్లు

జీప్ 4X3 మంథ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా, ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ క్యాంప్‌జీప్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. కంపాస్ 4X4 ఎక్స్‌పీరియెన్స్ డ్రైవ్ ఈవెంట్‌ను ముఖ్యమైన కస్టమర్ల కోసం ముంబాయ్, పూనే మరియు హైదరాబాద్ నగరాల్లో నిర్వహిస్తోంది.

జీప్ కంపాస్ ఆఫర్లు

ప్రస్తుతం, 4X4 డ్రైవ్ ఆప్షన్ కేవలం జీప్ కంపాస్ టాప్ ఎండ్ లిమిటెడ్ డీజల్ వేరియంట్లో మాత్రమే లభిస్తోంది. సాంకేతికంగా ఇందులో ఉన్న 2-లీటర్ మల్టీజెట్ డీజల్ ఇంజన్ గరిష్టంగా 170బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

జీప్ కంపాస్ ఆఫర్లు

కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా జీప్ 4X4 మంథ్ సంబరాలను నిర్వహిస్తోంది. కంపెనీ ఒక నెల ఉత్సవాల్లో తమ ఆకర్షణీయైన ఆఫర్లు మరియు డిస్కౌంట్లతో ఎక్కువ మంది కస్టమర్లను అమితంగా ఆకర్షించనుంది. కస్టమర్లు కూడా కంపాస్ టాప్ ఎండ్ వేరియంట్ ద్వారా అదనపు ఫీచర్లను పొందవచ్చు.

జీప్ కంపాస్ ఆఫర్లు

1. దిగ్గజాలను వణికిస్తోన్న టాటా కొత్త ఎస్‌యూవీ

2.బ్రేక్ ఫెయిల్ అవడాన్ని ముందుగానే గుర్తించవచ్చా...?

3.జాజ్ పల్సర్ ఎల్ఎస్135 బైక్‌కు శాస్వత వీడ్కోలు

4.ఏ/సి వాడకం కారు మైలేజ్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది?

5.హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు అంటే ఏమిటి ? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ? తెలుసుకోండి

English summary
Read In Telugu: Jeep Celebrates 4X4 Month — Offers Heavy Discounts On The Top-End Compass Variant
Story first published: Friday, April 6, 2018, 12:11 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark