ల్యాంబోర్గిని ఉరుస్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోల కోసం...

Written By:
Recommended Video - Watch Now!
మీకు తెలియని 11 టైటానిక్ ఫాక్ట్స్ | 11 Titanic Facts That You Didn't Know - DriveSpark

ల్యాంబోర్గిని ఇండియన్ మార్కెట్లోకి ఉరుస్ లగ్జరీ సూపర్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ల్యాంబోర్గిని ఉరుస్ ప్రారంభ ఎక్స్-షోరూమ్(ఇండియా) ధర రూ. 3 కోట్లుగా ఉంది.

2017లో డిసెంబర్ 4 న ఆవిష్కరించిన ఉరుస్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లో ల్యాంబోర్గిని యొక్క రెండవ ఎస్‌యూవీ మోడల్‌గా అందుబాటులోకి తీసుకొచ్చింది.

ల్యాంబోర్గిని ఉరుస్ విడుదల

ల్యాంబోర్గిని ఉరుస్ ఇంజన్ మరియు పవర్

ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ దిగ్గజం ల్యాంబోర్గిని ఉరుస్ సూపర్ ఎస్‌యూవీలో 4.0-లీటర్ కెపాసిటి గల ట్విన్ టుర్బో వి8 టుర్భో ఛార్జ్‌డ్ ఇంజన్ అందించింది. ఇది 6,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 641బిహెచ్‌పి పవర్ మరియు 2,250-4,500ఆర్‌పిఎమ్ మధ్య 850ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ల్యాంబోర్గిని ఉరుస్ విడుదల

ల్యాంబోర్గిని ఉరుస్ ట్రాన్స్‌మిషన్

8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గుండా ఆల్ వీల్ అనుసంధానంతో ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ మొత్తం అన్ని చక్రాలకు సరఫరా అవుతుంది.

ల్యాంబోర్గిని ఉరుస్ విడుదల

ల్యాంబోర్గిన్ ఉరుస్ స్పీడ్

ల్యాంబోర్గిని ఉరుస్ ఎస్‌యూవీ కేవలం 3.6 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది, 200కిలోమీటర్ల వేగాన్ని 12.8 సెకండ్లలో మరియు అత్యధిక వేగం గంటకు 305కిలోమీటర్లుగా ఉంది.

ల్యాంబోర్గిని ఉరుస్ విడుదల

ల్యాంబోర్గిన్ ఉరుస్ డ్రైవింగ్ మోడ్స్

ఇండియాలో లభించే లగ్జరీ కార్లలో డ్రైవింగ్ మోడ్స్ ఎక్కువగా చూస్తుంటాం. వాటిలో మూడు లేదా నాలుగు ఉంటాయి. అయితే, ల్యాంబోర్గిని ఉరుస్ ఎస్‌యూవీలో ఆరు రకాల విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. రెగ్యులర్ ఆన్ రోడ్ కోసం మూడు - స్ట్రాడా(స్ట్రీట్), స్పోర్ట్, కోర్సా(ట్రాక్) మరియు ఆఫ్ రోడింగ్ కోసం మూడు - సబ్బియా(శాండ్), టెర్రా(గ్రావెల్) మరియు నెవె(స్నో).

ల్యాంబోర్గిని ఉరుస్ విడుదల

ల్యాంబోర్గిని ఉరుస్ కొలతలు

సూపర్ కార్లను తయారు చేసే ల్యాంబోర్గిని అదే ప్రేరణతో సూపర్ ఎస్‌యూవీని అభివృద్ది చేసింది. ల్యాంబోర్గిని ఉరుస్ పొడవు 5,112ఎమ్ఎమ్, వెడల్పు 2,016ఎమ్ఎమ్, ఎత్తు 1,638ఎమ్ఎమ్, వీల్ బేస్ 3,003ఎమ్ఎమ్ మరియు 85-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి గల ఉరుస్ బరువు 2,200కిలోలుగా ఉంది.

ల్యాంబోర్గిని ఉరుస్ విడుదల

ప్రపంచపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ గ్రూపు క్రింద ఉన్న ల్యాంబోర్గిని ఉరుస్ ఎస్‌యూవీని వోక్స్‌వ్యాగన్ వారి ఎమ్‌ఎల్‌బి ఎవో ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించింది. ఇదే ఫ్లాట్‌ఫామ్ మీదనే బెంట్లీ బెంట్యాగా మరియు పోర్షే కయీన్ కార్లను అభివృద్ది చేశారు.

ల్యాంబోర్గిని ఉరుస్ విడుదల

ల్యాంబోర్గిన్ ఉరుస్ డిజైన్

డిజైన్ విషయానికి వస్తే, 2012లో జరిగిన బీజింగ్ ఆటో షో వేదిక మీద ల్యాంబోర్గిని తొలిసారి ప్రదర్శించిన ఉరుస్ కాన్సెప్ట్ డిజైన‌నే పోలి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఫ్రంట్ గ్రిల్ మరియు బంపర్ సెక్షన్‌లో మార్పులు చేసి, ఫ్యూచరిస్టిక్ డిజైన్ శైలిలో రూపొందించింది.

ల్యాంబోర్గిని ఉరుస్ విడుదల

ల్యాంబోర్గిన్ ఉరుస్ ఎక్ట్సీరియర్ ఫీచర్లు

ఫ్రంట్ డిజైన్‌ లోని పెద్ద పరిమాణంలో ఉన్న ఎయిర్ ఇంటేకర్ ఇంజన్‌కు అధిక మొత్తంలో గాలి సరఫరా అయ్యేందుకు తోడ్పడుతుంది. అంతే కాకుండా, ముందు వైపున్న స్ల్పిట్టర్ ఎలిమెంట్లు గాలి ద్వారా కలిగే ఘర్షణను తగ్గించడానికి ముందు నుండి వీచే గాలి ప్రవాహం కారు కింద నుండి వెళ్లేలా చేస్తాయి.

ల్యాంబోర్గిని ఉరుస్ విడుదల

ఉరుస్ ఎస్‌యూవీ చూడటానికి భారీ పరిమాణంలో ఉన్నప్పటికీ, ఎస్‌యూవీలోని ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ మరియు టెయిల్ లైట్లు చూడటానికి చాలా స్లిమ్ముగా ఉన్నాయి. స్టాండర్డ్ వెర్షన్‌ ఉరుస్ 21-అంగుళాల పరిమాణం ఉన్న అల్లాయ్ వీల్స‌తో 285/45 జడ్ఆర్21(ముందు) మరియు 15/40జడ్ఆర్21(వెనుక) కొలతల్లో ఉన్న టైర్లతో ఎంచుకోవచ్చు. అంతే కాకుండా 22 లేదా 23-ఇంచ్ అల్లాయ్ వీల్స్‌తో కూడా ఎంచుకోవచ్చు.

ల్యాంబోర్గిని ఉరుస్ విడుదల

ల్యాంబోర్గిన్ ఉరుస్ ఇంటీరియర్ ఫీచర్లు

ఇంటీరియర్‌లో ఐదు మంది సౌకర్యవంతంగా ప్రయాణించేలా లెథర్ సీట్లు, పెద్ద పరిమాణంలో ఉన్న మూడు టిఎఫ్‌టి డిస్ల్పేలు ఉన్నాయి. వీటిలో ఒక డిస్ల్పే, స్టీరింగ్ వెనుక భాగంలోని ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ స్థానంలో వచ్చింది.

ల్యాంబోర్గిని ఉరుస్ విడుదల

మిగిలిన రెండు టిఎఫ్‌టి డిస్ల్పేలు కూడా సెంటర్ కన్సోల్ మీద ఉన్నాయి. వీటిలో ఒకటి ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్‌లా మరొక పలు రకాల కంట్రోలింగ్ ఫంక్షన్స్ కోసం ఉపయోగపడుతోంది.

ల్యాంబోర్గిని ఉరుస్ విడుదల

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇటలీకి చెందిన సూపర్ కార్ల దిగ్గజం ల్యాంబోర్గిని సుమారుగా 25 సంవత్సరాల అనంతరం ఎస్‌యూవీ వాహనాల ప్రపంచంలోకి ఉరుస్ సూపర్ ఎస్‌యూవీ ద్వారా ప్రవేశించింది. ఏదేమైనప్పటికీ, 1980 చివర్లో మరియు 1990ల ప్రారంభంలో వచ్చిన రాంబో లాంబో తరహా కాకుండా, ఇది ఎంతో విభిన్నంగా ఉంటుంది. ఉరుస్ వేగానికి మరియు దాని స్టైలింగ్ ఆకృతికి సూపర్ కార్ల ప్రియులు ఫిదా అయిపోవడం గ్యారంటీ.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Lamborghini Urus Launched In India At Rs 3 Crore

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark