యు321 ఎమ్‌పీవీ విడుదల విషయంలో స్పీడు పెంచిన మహీంద్రా

దేశీయ దిగ్గజ ఎస్‌యూవీల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త యు321 ఎమ్‌పీవీని విడుదలకు శరవేగంగా సిద్దం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక మార్లు ఇండియన్ రోడ్ల మీద అత్యంత రహస్యంగా రహదారి పరీక్ష

By Anil Kumar

దేశీయ దిగ్గజ ఎస్‌యూవీల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త యు321 ఎమ్‌పీవీని విడుదలకు శరవేగంగా సిద్దం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక మార్లు ఇండియన్ రోడ్ల మీద అత్యంత రహస్యంగా రహదారి పరీక్షలు నిర్వహించింది.

మహీంద్రా యు321 ఎమ్‌పీవీ

తాజాగా మరోసారి రహదారి పరీక్షలు నిర్వహిస్తుండగా కెమెరాతో క్లిక్‌మనిపించిన యు321 వెహికల్ ఇంటీరియర్ ఫోటోలు రహస్యంగా లీక్ అయ్యాయి. ఈ ఫోటోలలో రెండవ మరియు మూడవ వరుస సీటింగ్ రివీల్ అయ్యింది.

మహీంద్రా యు321 ఎమ్‌పీవీ

ఫోటోలను గమనిస్తే, రెండవ వరుస సీటింగ్ విశాలంగా సౌకర్యంగా అనిపించినప్పటికీ, మూడవ వరుస సీటింగ్ చాలా ఇరుకుగా కనిపిస్తోంది. అయితే, మూడవ వరుసలో ఎత్తైన హెడ్ రూమ్ మరియు సౌకర్యవంతమైన లెగ్ రూమ్ అందివ్వడం జరిగింది. కాబట్టి ఇందులోని చివరి వరుస పిల్లలు చాలా బాగా సరిపోతుంది.

మహీంద్రా యు321 ఎమ్‌పీవీ

యు321 ఎమ్‍‌పీవీలో ఎక్కువ లగేజీ తీసుకెళ్లాలంటే మూడవ వరుస సీటును 60:40 నిష్పత్తిలో మడిపేయవచ్చు. రూఫ్ మౌంటెడ్ ఏ/సి వెంట్, కప్ హోల్డర్స్ మరియు మొబైల్ పెట్టుకునేందుకు పలు స్టోరేజ్ స్పేస్‌లు ఉన్నాయి. మహీంద్రా యు321 వాహనం 6 లేదా 7 మంది ప్రయాణించే సీటింగ్ లేఔట్ కలిగి ఉంది.

మహీంద్రా యు321 ఎమ్‌పీవీ

మహీంద్రా యు321 ఇంటీరియర్‌లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పియానో బ్లాక్ ఫినిషింగ్ గల డ్యాష్‌బోర్డ్, పలు రకాల స్టోరేజ్ ప్రదేశాలు,పెద్ద పరిమాణంలో ఉన్న ఇన్ఫర్మేషన్ డిస్ల్పే, ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు స్టీరింగ్ ఆధారిత కంట్రోల్స్ వంటి పలు ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా యు321 ఎమ్‌పీవీ

సరికొత్త మహీంద్రా యు321 సాంకేతికంగా 1.6-లీటర్ కెపాసిటి గల ఎమ్‌ఫాల్కన్ డీజల్ ఇంజన్‌తో రానుంది. ఇది గరిష్టంగా 125బిహెచ్‌పి పవర్ మరియు 305ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా 163బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇందులో రానుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభ్యమయ్యే అవకాశం ఉంది.

మహీంద్రా యు321 ఎమ్‌పీవీ

భద్రత పరంగా మహీంద్రా యు321లో ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్ మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లు రానున్నాయి. యు321 ఎమ్‌పీవీని పూర్తిగా మోనోకోక్యూ ఛాసిస్ మీద నిర్మించారు. ఉత్తర అమెరికాలోని ట్రాయ్, మిచిగావ్‌లో ఉన్న మహీంద్రా రీసెర్చ్ సెంటర్‌లో దీనిని డెవలప్ చేశారు.

మహీంద్రా యు321 ఎమ్‌పీవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా అండ్ మహీంద్రా తమ యు321 ఎమ్‌పీవీని ఈ ఏడాది పండుగ సీజన్‌లో మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీని ధరల శ్రేణి రూ. 9 లక్షల నుండి రూ. 15 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉండే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో విపణిలోకి ప్రవేశిస్తే, టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు మారుతి ఎర్టిగా ఎమ్‌పీవీలతో తలపడనుంది.

Source: MotorOctane

Most Read Articles

English summary
Read In Telugu: Mahindra U321 MPV Interior Revealed; Expected Price And Launch Details
Story first published: Wednesday, May 16, 2018, 18:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X