మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 - స్టేజ్ 2 ఫలితాలు

By Anil Kumar

ఆద్యంతం ఉత్కంఠగా సాగుతున్న మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ స్టేజ్ 2 విజయవంతంగా పూర్తయ్యింది. మారుతి సుజుకి మరియు ఎగ్జాన్ మొబిల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న భారతదేశపు అతి పెద్ద ర్యాలీ స్పోర్ట్ డెసర్ట్ స్టార్మ్ 2018 స్టేజ్ 2 రాజస్థాన్‌లోని బికనీర్‌లో ప్రారంభమయ్యి బికమ్‌పూర్‌లో ముగిసింది.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018

స్టేజ్ 1 పూర్తి చేసుకుని బికనీర్ నుండి ప్రారంభమై సుమారుగా 200కిలోమీటర్ల దూరంలో ఉన్న బికమ్‌పూర్ దిశగా మొదలయ్యింది. భగభగమండే సూర్యుడిని సవాల్ చేస్తూ, ర్యాలీ నిర్వాహకులు అమర్చిన అత్యంత ఇరుకైన మార్గం గుండా ఫోర్ వీలర్లు మరియు టూ వీలర్లు స్టేజ్ 2 ముగింపు దిశగా దూసుకెళ్లాయి.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018

బికమ్‌పూర్‌లో స్టేజ్ 2 ముగిసే ప్రదేశం చాలా చిన్నగా ఉండటంతో, అదే స్టేజ్ 2 ఎండ్ పాయింటును పబుసార్ ప్రదేశానికి మార్చడం జరిగింది.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018

థార్ ఎడారి చివరంచుల్లోని పబుసార్ ప్రదేశాన్ని ర్యాలీ స్టేజ్ 2 ముగింపు ప్రదేశంగా ఎంచుకోవడంతో ర్యాలీలో పాల్గొన్న పోటీదారులు పబుసార్‍కు చేరుకున్నారు. స్టేజ్ 2 ఎండ్ పాయింట్ ఒక రకంగా సర్వీస్ సెంటర్‌గా కూడా ఉపయోగపడింది. అక్కడి నుండి ట్రాన్స్‌పోర్ట్ ద్వారా స్టేజ్ 3 ప్రారంభమయ్యే జైసల్మీర్‌కు చేరుకున్నారు.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018

పబుసార్ ప్రాంతంలో ర్యాలీ జరిగిన భూబాగాల్లో పొడి ఇసుక మరియు వదులు నేలలు అధికంగా ఉన్నాయి. అసమాంతరంగా ఉన్న తలాల నుండి సరైన దిశగా వెళ్లడానికి పోటీదారులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018

నిజానికి, పబుసార్ తలాల్లో గుబురుగా ఉన్న పొదల కారణంగా టూ వీలర్ మరియు ఫోర్ వీలర్ రైడర్లకు విజిబిలిటీ చాలా తక్కువగా అనిపించింది. అయితే, వెహికల్స్ ఇచ్చే శబ్దానికి అనుగుణంగా ర్యాలీ ఒక క్రమం మార్గంలో ఎండ్ పాయింట్ దిశగా వెళ్లింది.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018

ప్రతిష్టాత్మక డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ స్టేజ్ 2 సంతృప్తి పరిచే రైడింగ్ పరిస్థితుల మధ్య ఎట్టకేలకు సాయంకాలానికి ముగిసింది. కానీ, దీని తరువాత స్టేజ్ ర్యాలీ మధ్యాహ్నం నుండి ఎడారి మార్గం నుండి వెళ్లేలా ర్యాలీ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018

డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ స్టేజ్ 2 ఫలితాలు:

మోటో కెటగిరీలో

1. సిఎస్ సంతోష్ (#1) 03:03:06

2. అరోన్ మరె (#3) 03:05:20

3. సంజయ్ కుమార్ (#6) 03:21:27

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018

ఎక్స్‌ట్రీమ్ కెటగిరీ ఫలితాలు

1. అభిషేక్ మిశ్రా, వి వేణు రమేష్‌ కుమార్ (#103) 03:44:07

2. సురేశ్ రాణా, పి.వి శ్రీనివాస్ మూర్తి (#101) 03:44:45

3. రాజ్ సింగ్ రాథోర్, సాగర్ మల్లప్ప (#102) 03:53:11

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి మరియు ఎగ్జాన్ మొబిల్ నిర్వహిస్తున్న డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ స్టేజ్ 1 మరియు స్టేజ్ 2 పూర్తయ్యింది. స్టేజ్ 1 తో పోల్చుకుంటే స్టేజ్ 2 ర్యాలీలో లోతుగా దిగబడిపోయే ఇసుక మార్గాలు, గుబురుగా ఉన్న పొదల కారణంగా న్యావిగేషన్ ఇబ్బందులు మరియు మధ్యాహ్నం వేళ జరగడంతో ఎన్నో ఇబ్బందుల మధ్య పూర్తయ్యింది.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 స్టేజ్ 3 ర్యాలీ ఫలితాల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి. ఆలోపు రాజస్థాన్ ఎడారుల నుండి మా ప్రతినిధి పంపిన ర్యాలీ ఫోటోలను క్రింది గ్యాలరీ ద్వారా వీక్షించండి.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018

డ్రైవ్‌స్పార్క్ తెలుగులో వైరల్‌ స్టోరీలు...

1.సెకండ్ హ్యాండ్ బైకుల కంటే తక్కువ ధరతో లభిస్తున్న కొత్త బజాజ్ సిటి100

2.డీజిల్ రైలింజన్లు అస్సలు ఆఫ్ చేయరెందుకు?

3.12,000 కిమీల పొడవైన లండన్-చైనా రైలు మార్గం ప్రారంభం

4.రజనీకాంత్ కార్ కలెక్షన్ 1980 నుండి 2017 వరకు...

5.ఆ డ్రైవర్ నెలసరి వేతనం 2 లక్షల రుపాయలు!!

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Suzuki Desert Storm 2018 Powered By ExxonMobil — Stage 2 Results
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X