ఎదురు చూపులకు స్వస్తి పలకండి: మారుతి వితారా బ్రిజా ఏఎమ్‌టి వచ్చేసింది

By Anil Kumar

భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మారుతి వితారా బ్రిజా ఆటోమేటిక్ విడుదలయ్యింది. మారుతి సుజుకి ఆటో గేర్ షిఫ్ట్ (AGS) గేర్‌బాక్స్ గల మారుతి వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యూవీని రూ. 8.54 లక్షల ధరతో విడుదల చేసింది.

ఎదురు చూపులకు స్వస్తి పలకండి: మారుతి వితారా బ్రిజా ఏఎమ్‌టి వచ్చేసింది

మారుతి వితారా బ్రిజా ఎస్‌యూవీని తొలుత డీజల్ ఇంజన్ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే ప్రవేశపెట్టింది. అయితే, గత ఏడాది విడుదలైన టాటా నెక్సాన్ వితారా బ్రిజాకు గట్టి పోటీగా నిలిచింది. దీనికి తోడు టాటా నెక్సాన్ ఇటీవల ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‍‌తో విడుదలయ్యింది.

ఎదురు చూపులకు స్వస్తి పలకండి: మారుతి వితారా బ్రిజా ఏఎమ్‌టి వచ్చేసింది

టాటా నెక్సాన్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో ఎంచుకోవచ్చు. కస్టమర్లు వారి అభిరుచుకి తగిన వెర్షన్‌లో ఎంచుకునే అవకాశాన్ని కల్పించడంతో... మారుతి సుజుకి కూడా వితారా బ్రిజాలో ఏఎమ్‌టి గేర్‌బాక్స్ పరిచయం చేసింది. టాటా నెక్సాన్ ఏఎమ్‌టి విడుదలైన అతి కొద్ది కాలంలో దాని కంటే తక్కువ ధరలో విడుదల చేసింది.

ఎదురు చూపులకు స్వస్తి పలకండి: మారుతి వితారా బ్రిజా ఏఎమ్‌టి వచ్చేసింది

మారుతి వితారా బ్రిజా ఏఎమ్‌టి నాలుగు విభిన్న వేరియంట్లలో లభ్యం కానుంది. అవి, VDI, ZDI, ZDI+ మరియు ZDI + డ్యూయల్ టోన్. మారుతి వితారా బ్రిజా ఆటోమేటిక్ ప్రారంభ ధర రూ. 8.54 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 10.49 లక్షలు. అన్ని వేరియంట్ల ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

Variant Prices
VDi AGS ₹ 854000
ZDi AGS ₹ 931500
ZDi+ AGS ₹ 1027000
ZDi+ DUAL TONE AGS ₹ 1049000
ఎదురు చూపులకు స్వస్తి పలకండి: మారుతి వితారా బ్రిజా ఏఎమ్‌టి వచ్చేసింది

అంతే కాకుండా, మారుతి వితారా బ్రిజా ఆటోమేటిక్ వేరియంట్లను ఇప్పుడు ఆటమ్ ఆరేంజ్ మరియు పర్ల్ ఆర్కిటిక్ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లో ఎంచుకోవచ్చు. అదనంగా, ఎక్ట్సీరియర్‌లోని ఫ్రంట్ గ్రిల్ మరియు డిక్కీ మీద ప్రత్యేకమైన క్రోమ్ సొబగులు ఉన్నాయి.

ఎదురు చూపులకు స్వస్తి పలకండి: మారుతి వితారా బ్రిజా ఏఎమ్‌టి వచ్చేసింది

వితారా బ్రిజా ఆటోమేటిక్ టాప్ ఎండ్ వేరియంట్లో గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్‌ గల అధునాతన అల్లాయ్ వీల్స్ వచ్చాయి. ఇంటీరియర్‌లో అత్యంత ఆకర్షణీయమైన బ్లాక్ థీమ్ ఫినిషింగ్ గల డ్యాష్‌బోర్డ్ కలదు. ఈ మార్పులు మినహాయిస్తే, వితారా బ్రిజా ఏఎమ్‌టి ఇతర అంశాల పరంగా రెగ్యులర్ మ్యాన్యువల్ వేరియంట్ల తరహాలోనే ఉంటుంది.

ఎదురు చూపులకు స్వస్తి పలకండి: మారుతి వితారా బ్రిజా ఏఎమ్‌టి వచ్చేసింది

మారుతి వితారా బ్రిజా ఏఎమ్‌టి వేరియంట్లో 1.3-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. ఆటో గేర్ షిఫ్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 88.8బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. బ్రిజా మ్యాన్యువల్ వెర్షన్ మైలేజ్ లీటరుకు 24కిలోమీటర్లుగా ఉంది. ఆటోమేటిక్ వెర్షన్ కూడా ఇదే తరహా మైలేజ్ ఇవ్వగలదు.

ఎదురు చూపులకు స్వస్తి పలకండి: మారుతి వితారా బ్రిజా ఏఎమ్‌టి వచ్చేసింది

మారుతి సుజుకి వితారా బ్రిజా ఆటోమేటిక్ ఇటీవల విపణిలోకి విడుదలైన టాటా నెక్సాన్ ఆటోమేటిక్ ఎస్‌యూవీకి గట్టి పోటీనిస్తుంది. టాటా నెక్సాన్ ఆటోమేటిక్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది. కానీ నెక్సాన్ టాప్ ఎండ్ వేరియంట్లలో మాత్రమే ఏఎమ్‌టి పరిచయం చేసింది. మారుతి మాత్రం వితారా బ్రిజా మిడ్ మరియు టాప్ రేంజ్ వేరియంట్లలో ఏఎమ్‌టి అందించింది. ఈ కారణం చేతనే వితారా బ్రిజా ఏఎమ్‌టి ధర నెక్సాన్ ఏఎమ్‌టి కంటే తక్కువగా ఉంది.

ఎదురు చూపులకు స్వస్తి పలకండి: మారుతి వితారా బ్రిజా ఏఎమ్‌టి వచ్చేసింది

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

గత రెండేళ్ల కాలంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. అత్యుత్తమ మైలేజ్ మరియు ఇండియన్ రోడ్లకు ఎంతో అనువైన వితారా బ్రిజా ఎస్‌యూవీని ప్రవేశపెట్టి ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి భారీ విజయాన్ని అందుకుంది. అయితే, అవకాశాలకు అనుగుణంగా పోటీగా కూడా అదే రీతిలో పెరిగింది. ప్రస్తుతం, కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో మారుతి వితారా బ్రిజా, టాటా నెక్సాన్, ఫోర్డ్ ఇకోస్పోర్ట్ మరియు మహీంద్రా టియువి300 వంటి మోడళ్లు ఉన్నాయి.

వీటి మీద ఆధిపత్యం చెలాయించేందుకు, మారుతి తమ వితారా బ్రిజాను అదనపు సేఫ్టీ ఫీచర్లతో నాలుగు ఆటోమేటిక్ వేరియంట్లను విడుదల చేసింది.

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Vitara Brezza AMT Launched In India; Prices Start At Rs 8.54 Lakh
Story first published: Wednesday, May 9, 2018, 13:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X