త్వరలో విడుదల కానున్న 2018 హ్యుందాయ్ శాంట్రో గురించి 8 ముఖ్యమైన విషయాలు

Written By:

హ్యుందాయ్ శాంట్రో బడ్జెట్ కార్ కస్టమర్ల మదిలో ఇప్పటికీ బెస్ట్ కారుగానే నిలిచింది. భారత్‌లో హ్యుందాయ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన మోడల్ శాంట్రో. ఆశించి ఫలితాలు సాధించడం లేదనే కారణం చేత శాంట్రో కారును విపణి నుండి తొలగించిప్పటికీ దీనికి ఉన్న డిమాండ్ ఇంకా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ తమ శాంట్రో కారును మళ్లీ లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది.

Recommended Video - Watch Now!
Auto Expo 2018: Tata Tiago EV - Details, Expected Price, Launch - DriveSpark
హ్యుందాయ్ శాంట్రో

మునుపటి శాంట్రో తరహాలో సరికొత్త డిజైన్ ఫిలాఫీలో బ్రాండ్ న్యూ శాంట్రో కారును హ్యుందాయ్ నిర్మిస్తోంది. శాంట్రో బ్రాండ్ యథావిధిగా కొనసాగినప్పటికీ, డిజైన్ పరంగా పూర్తి కొత్తగా ఉండనుంది.

హ్యుందాయ్ శాంట్రో

హ్యుందాయ్ మోటార్స్ కొత్త తరం శాంట్రో హ్యాచ్‌బ్యాక్ కారును ఈ ఏడాది దీపావళి పండుగ నాటికి పూర్తి స్థాయిలో విక్రయాలకు సిద్దంగా ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేయనుంది.

హ్యుందాయ్ శాంట్రో

శాంట్రో బ్రాండ్ పేరుతో వస్తున్న సరికొత్త స్మాల్ హ్యాచ్‌బ్యాక్ మునుపటి తరం శాంట్రో కారుతో పోల్చుకుంటే అధునాతన డిజైన్ శైలిలో వస్తోంది. విపణిలో ఇప్పటి వరకు చిన్న కార్ల సెగ్మెంట్లో పరిచయం కాని శైలిలో ప్రవేశపెట్టనుంది.

హ్యుందాయ్ శాంట్రో

మధ్య తరగత కస్టమర్లను ఆకట్టుకునే ఉద్దేశ్యంతో రూపొందిస్తున్న నూతన శాంట్రో ఇంటీరియర్‌ను కూడా అత్యాధునిక ఆకర్షణీయమైన హంగులతో అట్రాక్టివ్‌గా తీర్చిదిద్దింది. నాణ్యమైన ఇంటీరియర్ ఫీచర్లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగు మరియు డిజిటల్ స్క్రీన్ అదే విధంగా అనలాగ్ మీటర్ గల ఇంస్ట్రుమెంట్ కన్సోల్ వంటివి ఉన్నాయి.

హ్యుందాయ్ శాంట్రో

హ్యుందాయ్ శాంట్రో ఇంటీరియర్‌లో లగ్జరీ అనుభూతిని కల్పించే ఎన్నో అంశాలు ఉన్నాయి. చిన్న కారే అయినప్పటికీ, వాటర్ బాటిల్ మరియు కప్ హోల్డర్స్ మరియు అత్యుత్తమ స్టోరేజ్ స్పేస్ వంటి ఎన్నో విలాసవంతమైన ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ శాంట్రో

ఎంట్రీ లెవల్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్లోకి వస్తోన్న హ్యుందాయ్ శాంట్రో కారులో సాంకేతికంగా 1.0-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 70బిహెచ్‌పి పవర్ మరియు 100ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హ్యుందాయ్ శాంట్రో

కేవలం పెట్రోల్ ఇంజన్ వేరియంట్లో మాత్రమే లభించే హ్యుందాయ్ శాంట్రో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌లతో లభ్యం కానుంది. ఇది లీటర్‌కు సుమారుగా 22కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వనుంది.

హ్యుందాయ్ శాంట్రో

కొన్ని సంవత్సరాల క్రితం శాంట్రో బ్రాండ్ ఇండియన్ మార్కెట్ నుండి తొలగించబడింది. అయినప్పటికీ, ఇండియన్ కస్టమర్లు హ్యుందాయ్ బ్రాండ్ కారును మళ్లీ విపణిలోకి లాంచ్ చేస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. కస్టమర్ల నుండి వస్తోన్న ఆదరణకు అనుగుణంగా హ్యుందాయ్ కూడా కొత్త తరం శాంట్రోను భారత్‌కు ఖరారు చేసింది.

హ్యుందాయ్ శాంట్రో

సరికొత్త హ్యుందాయ్ శాంట్రో రూ. 3.5 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విపణిలోకి విడుదలయ్యే అవకాశం ఉంది. మరిన్ని ఆటోమొబైల్ వార్తలను తెలుగులో పొందడానికి డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి...

English summary
Read In Telugu: New 2018 hyundai santro 8 things know
Story first published: Sunday, March 11, 2018, 16:30 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark