విపణిలోకి రేంజ్ రోవర్ ఎవోక్ ల్యాండ్‌మార్క్ ఎడిషన్ విడుదల: ధర, ఇంజన్ మరియు ఫీచర్లు

Written By:
Recommended Video - Watch Now!
Under-Aged Rider Begs The Policewomen To Spare Him - DriveSpark

రేంజ్ రోవర్ ఇండియన్ మార్కెట్లోకి ఎవోక్ ల్యాండ్‌మార్క్ ఎడిషన్ లగ్జరీ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. సరికొత్త రేంజ్ రోవర్ ఎవోక్ ల్యాండ్‌మార్క్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 50.20 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

రేంజ్ రోవర్ ఎవోక్ ల్యాండ్‌మార్క్ ఎడిషన్

రెగ్యులర్ మోడల్ యొక్క ఎస్ఇ వేరియంట్ ఆధారంగా ల్యాండ్ రోవర్ సరికొత్త ఎడిషన్‌లో రేంజ్ రోవర్ ఎవోక్‌ను లాంచ్ చేసింది. ఎవోక్ ఆరవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ స్పెషల్ ఎడిషన్ ప్రవేశపెట్టినట్లు ల్యాండ్ రోవర్ పేర్కొంది.

రేంజ్ రోవర్ ఎవోక్ ల్యాండ్‌మార్క్ ఎడిషన్

ల్యాండ్‌మార్క్ ఎడిషన్ డైనమిక్ బాడీ స్టైల్ కిట్ ద్వారా 2018 రేంజ్ రోవర్ ఎవోక్ రెగ్యులర్ మోడల్ కంటే విభిన్నంగా ఉంది. బాడీ కలర్‌లో ఉన్న లోయర్ బాడీ క్లాడింగ్, గ్రాఫైట్ అట్లాస్ గ్రిల్, ఫెండర్ వంటి మరియు టెయిల్ గేట్ బ్యాడ్జింగ్ వంటివి ఎక్ట్సీరియర్ స్టైలింగ్ అంశాలు ఉన్నాయి.

రేంజ్ రోవర్ ఎవోక్ ల్యాండ్‌మార్క్ ఎడిషన్

స్పెషల్ ఎడిషన్ ఎవోక్ ఎస్‌యూవీలో గ్లాస్ బ్లాక్ కలర్‌లో ఉన్న 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, కర్పాథియన్ గ్రే కాంట్రాస్ట్ రూఫ్ మరియు మూడు విభిన్న రంగుల్లో ఎంచుకోదగ్గ ఎక్ట్సీరియర్ కలదు.

రేంజ్ రోవర్ ఎవోక్ ల్యాండ్‌మార్క్ ఎడిషన్

ఎవోక్ ల్యాండ్‌మార్క్ ఎడిషన్‌ ఇంటీరియర్‌లో డార్క్ శాటిన్ అల్యూమినియం సెంటర్ కన్సోల్ ట్రిమ్స్, ఎబోనీ లెథర్ సీట్లు, లైట్ లునార్ స్టిచ్చింగ్ వంటివి తప్పనిసరిగా వచ్చాయి. ఎవోక్ ల్యాండ్‌మార్క్ ఎడిషన్‌ ఎస్‌యూవీలో కీలెస్ ఎంట్రీ మరియు గెశ్చర్ టెయిల్ గేట్ ఫీచర్లు ఉన్నాయి.

రేంజ్ రోవర్ ఎవోక్ ల్యాండ్‌మార్క్ ఎడిషన్

సాంకేతికంగా రేంజ్ రోవర్ ఎవోక్ ల్యాండ్‌మార్క్ ఎడిషన్ ఎస్‌యూవీలో 4-సిలిండర్ల 2.0-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ కలదు. 10-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ 177బిహెచ్‌పి పవర్ మరియు 430ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Trending On DriveSpark Telugu:

గాల్లోకి ఎగిరి రెండు అంతస్థుల మేడ మీదకు దూసుకెళ్లిన కారు

కంపాస్ మరియు ఎక్స్‌యూవీ500కు పోటీగా టాటా నుండి 5,7-సీటర్ హెచ్5 ఎస్‌యూవీ

2018 ఎడిషన్‌ ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ విడుదల: వేరియంట్లు, ధరలు మరియు ప్రత్యేకతలు

రేంజ్ రోవర్ ఎవోక్ ల్యాండ్‌మార్క్ ఎడిషన్

ఎవోక్ ల్యాండ్‌మార్క్ ఎడిషన్ కేవలం 9 సెకండ్లలోనే గంటకు 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు గరిష్టంగా 195కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడంలో డీజల్ ఇంజన్ సహాయపడుతుంది.

రేంజ్ రోవర్ ఎవోక్ ల్యాండ్‌మార్క్ ఎడిషన్

జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరక్టర్ రోహిత్ శర్మ మాట్లాడుతూ," ఇండియన్ కస్టమర్లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు రేంజ్ రోవర్ లగ్జరీ అంశాలను రేంజ్ రోవర్ ఎవోక్ ద్వారా తీసుకొచ్చామని తెలిపాడు."

రేంజ్ రోవర్ ఎవోక్ ల్యాండ్‌మార్క్ ఎడిషన్

"అత్యుత్తమ డిజైన్, ప్రతి ఒక్కరినీ ఆకర్షించే రూపం మరియు అన్ని భూ భాగాలను సునాయాసంగా చేధించే సామర్థ్యం రేంజ్ రోవర్ ఎవోక్ సొంతం. ఆరు సంవత్సరాల ఎవోక్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విభిన్న ఎక్ట్సీరియర్ మరియు డిజైన్ అంశాలతో ఎవోక్ ల్యాండ్‌మార్క్ ఎడిషన్ ప్రవేశపెట్టినట్లు ఆయన చెప్పుకొచ్చాడు."

రేంజ్ రోవర్ ఎవోక్ ల్యాండ్‌మార్క్ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సరికొత్త కలర్ ఆప్షన్స్ మరియు ఇతర మార్పులతో రేంజ్ రోవర్ ఎవోక్ ల్యాండ్‌మార్క్ ఎడిషన్ రెగ్యులర్ వెర్షన్‌తో పోల్చితే చాలా భిన్నంగా ఉంటుంది. ఫీచర్ల పరంగా కూడా కొత్త అప్‌డేట్స్ చోటు చేసుకున్నాయి. స్టాండర్డ్ మోడళ్లతో పోల్చుకుంటే స్పెషల్ ఎడిషన్ ఎవోక్ స్పోర్టివ్‍‌గా ఉంటుంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Range Rover Evoque Landmark Edition Launched In India; Priced At Rs 50.20 Lakh. Read In Telugu
Story first published: Tuesday, January 16, 2018, 19:01 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark