రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ విడుదల: ధర, ఇంజన్, వేరియంట్లు, ఫీచర్లు మరియు ఫోటోలు

Written By:
Recommended Video - Watch Now!
Minor Motorcycle Rider Caught For Not Having A License - The Climax Of The Video Will Surprise You - DriveSpark

రేంజ్ రోవర్ లగ్జరీ ఎస్‌యూవీల విపణిలోకి సరికొత్త వెలార్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. కొత్తగా విడుదలైన రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 78.83 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 1.37 కోట్లు ఎక్స్‌-షోరూమ్‌గా ఉంది.

రేంజ్ రోవర్ వెలార్ విడుదల

రేంజ్ రోవర్ వెలార్ ఇంజన్ స్పెసిఫికేషన్స్

రేంజ్ రోవర్ తమ వెలార్ ఎస్‌యూవీలో పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లను అందించింది. ఇందులో 2.0-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ రెండు రకాల పవర్ ఉత్పత్తి చేస్తుంది.

రేంజ్ రోవర్ వెలార్ విడుదల

వెలార్ పెట్రోల్ బేస్ వేరియంట్ 247బిహెచ్‌పి పవర్ మరియు 365ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కేవలం 6.7 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని పుంజుకోగల ఇది గరిష్టంగా 217కిమీల వేగాన్ని అందుకుంటుంది.

రేంజ్ రోవర్ వెలార్ విడుదల

వెలార్‌లోని పవర్‌ఫుల్ పెట్రోల్ వేరియంట్‌లో అదే 2.0-లీటర్ టుర్బోఛార్జ్‌డ్ ఇంజీనియం పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 296బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6 సెకండ్ల వ్యవధిలో గంటకు 0 నుండి 100కిమీల వేగాన్ని అందుకునే ఇది గరిష్టంగా 234కిమీల వేగాన్ని చేరుకుంటుంది.

రేంజ్ రోవర్ వెలార్ విడుదల

డీజల్ ఇంజన్ విషయానికి వస్తే 2.0-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల చిన్న డీజల్ ఇంజన్ ఉంది. ఇది 177.5బిహెచ్‌పి పవర్ మరియు 430ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8.9 సెకండ్ల వ్యవధిలో గంటకు 0 నుండి 100కిమీల వేగాన్ని అందుకోగల దీని గరిష్ట వేగం 189కిమీలుగా ఉంది.

రేంజ్ రోవర్ వెలార్ విడుదల

వెలార్ ఎస్‌యూవీలోని టాప్ ఎండ్ డీజల్ వేరియంట్లో 3.0-లీటర్ కెపాసిటి గల టుర్బో వి6 ఇంజన్ ఉంది. ఇది 296బిహెచ్‌పి పవర్ మరియు 700ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కేవలం 6.5 సెకండ్ల వ్యవధిలో గంటకు 0 నుండి 100కిమీల వేగాన్ని అందుకోగల దీని గరిష్ట వేగం 241కిమీలుగా ఉంది.

రేంజ్ రోవర్ వెలార్ విడుదల

ల్యాండ్ రోవర్ లాంచ్ చేసిన రేంజ్ రోవర్ వెలార్ లోని అన్ని ఇంజన్ వేరియంట్లలో 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కలదు, ఇది ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్‌ను ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు సరఫరా చేస్తుంది.

Trending On DriveSpark Telugu:

125సీసీ ఇంజన్ సెగ్మెంట్లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే 8 బైకులు

లక్ష రుపాయల ధరలోపు లభించే ఐదు బెస్ట్ బైకులు

అరెనా షోరూముల్లో మాత్రమే లభించనున్న కొత్త తరం స్విఫ్ట్

రేంజ్ రోవర్ వెలార్ విడుదల

రేంజ్ రోవర్ వెలార్ డిజైన్

రేంజ్ రోవర్‌ లైనప్‌లో ఉన్న ఇతర మోడళ్లతో పోల్చుకంటే వెలార్ ఎస్‌యూవీ చూడటానికి కూపే స్టైల్లో ఉంటుంది. వాలుగా ఉన్న రూఫ్ లైన్ మరియు పదునుగా డిజైన్ చేయబడిన రియర్ ఎండ్ ఎస్‌యూవీకి ఒక కొత్త లుక్ తీసుకొచ్చాయి. అదే విధంగా ఎవోక్‍ లో ఉన్నటువంటి విప్లవాత్మక పలుచటి హెడ్ ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్ ఇందులో వచ్చాయి.

రేంజ్ రోవర్ వెలార్ విడుదల

రేంజ్ రోవర్ వెలార్ ఫీచర్లు

వెలార్ ఇంటీరియర్‌లో మూడు రకాల డిస్ల్పేలు ఉన్నాయి. వీటిలో ఒకటి అనలాగ్ ఇస్ట్రుమెంట్ ప్యానల్ స్థానంలో వచ్చింది. మిగతా రెండు డిస్ల్పేలను డ్యాష్ బోర్డ్ మీద చూడవచ్చు. వీటిలో పైనున్న డిస్ల్పేను ముందు మరియు వెనక్కి మలిపేయవచ్చు, ఇదే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లా పనిచేస్తుంది. దీని క్రింద ఉన్న మూడవ డిస్ల్పే క్లైమేట్ కంట్రోల్ మరియు ఇతర వ్యవస్థలను నిర్వహిస్తుంది.

రేంజ్ రోవర్ వెలార్ విడుదల

రేంజ్ రోవర్ వెలార్ ఎస్‌యూవీలో పెద్ద పరిమాణంలో ఉన్న సన్‌‌రూఫ్ మరియు టెర్రేన్ రెస్పాన్స్ సిస్టమ్‌తో పాటు ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ మరియు ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్స్ వంటి ఎన్నో సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

రేంజ్ రోవర్ వెలార్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రేంజ్ రోవర్ ఈ సారి ఇండియన్ రోడ్లను టార్గెట్ చేస్తూ, వివిధ రకాల రహదారులకు అనుగుణంగా ఎంచుకునేందుకు విభిన్న ఇంజన్ ఆప్షన్‌లలో వెలార్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. విశాలమైన ఇంటీరియర్, విలాసవంతమైన హంగులు, మూడు విభిన్న డిస్ల్పేలు మరియు ఎన్నో సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది.

పర్ఫెక్ట్ లగ్జరీ ఎస్‌యూవీ కోరుకునే వారికి ఫ్యూచరిస్టిక్ డిజైన్ స్టైల్లో ఉన్న రేంజ్ రోవర్ వెలార్ బెస్ట్ ఎంపిక కానుంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Range Rover Velar Launched In India - Prices Start At Rs 78.83 Lakh

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark