TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
రెనో డస్టర్ మీద లక్ష రుపాయల తగ్గింపు
డస్టర్ ఎస్‌యూవీ అంటే ఇష్టం ఉన్నప్పటికీ ధర భారం కారణంగా ఎంచుకోలేకపోయిన వారికి గుడ్ న్యూస్. భారతదేశపు మోస్ట్ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ రెనో డస్టర్ ధరలు భారీగా దిగివచ్చాయి. 2018 రెనో డస్టర్ మీద ఏకంగా లక్ష రుపాయలు తగ్గింది.
ధరలు తగ్గడానికి గల కారణాలు, ఏయే వేరియంట్ల మీద ఎంత వరకు ధరలు తగ్గాయి మరియు రెనో డస్టర్ ఎస్‌యూవీ గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...


రెనో డస్టర్‌ను చాలా వరకు ప్రాంతీయంగా తయారు చేయడంతో పెట్టుబడి ఖర్చులు తగ్గాయి. ఇందుకు అనుగుణంగా డస్టర్ మొత్త ధరలను సమీక్షించి సవరించిన అనంతరం కొత్త ధరలను వెల్లడించింది.
ధరల తగ్గింపు అనంతరం, కొత్త ధరల ప్రకారం రెనో డస్టర్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 7.95 లక్షలు మరియు డస్టర్ టాప్ ఎండ్ డీజల్ వేరియంట్ ధర రూ. 12.79 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.
ధరల తగ్గింపు అనంతరం సవరించిన కొత్త ధరలు మార్చి 1, 2018 నుండి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రెనో విక్రయ కేంద్రాల నుండి ఎంచుకునే డస్టర్ మీద లక్ష రుపాయలు వరకు లాభ పడవచ్చు.
రెనో ఇండియాకు డస్టర్ అతి ముఖ్యమైన మోడల్. విపణిలోకి విడుదల చేసినప్పటి నుండి రెనో యొక్క బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. మార్కెట్లోకి విడుదలయ్యే కొన్ని సంవత్సరాలు కావస్తున్నా... ఇప్పటికీ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది.
భారత్‌లో రెనో డస్టర్ ధరలు
వేరియంట్ | పాత ధరలు | కొత్త ధరలు | తగ్గింపు |
RXE Petrol | Rs 8,50,925 | Rs 7,95,000 | Rs 55,925 |
RXL Petrol | Rs 9,30,816 | Rs 8,79,000 | Rs 51,816 |
RXS CVT Petrol | Rs 10,24,746 | Rs 9,95,000 | Rs 29,746 |
Std 85 PS Diesel | Rs 9,45,663 | Rs 8,95,000 | Rs 50,663 |
RXE 85 PS Diesel | Rs 9,65,560 | Rs 9,09,000 | Rs 56,560 |
RXS 85 PS Diesel | Rs 10,74,034 | Rs 9,95,000 | Rs 79,034 |
RXZ 85 PS Diesel | Rs 11,65,237 | Rs 10,89,000 | Rs 76,237 |
RXZ 110 PS Diesel | Rs 12,49,976 | Rs 11,79,000 | Rs 70,976 |
RXZ 110 PS AMT Diesel | Rs 13,09,970 | Rs 12,33,000 | Rs 76,970 |
RXZ 110 PS AWD Diesel | Rs 13,79,761 | Rs 12,79,000 | Rs 1,00,761 |
రెనో డస్టర్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‍లలో లభ్యమవుతోంది. డస్టర్ పెట్రోల్ వేరియంట్లోని 1.5-లీటర్ ఇంజన్ 104.5బిహెచ్‌పి పవర్ మరియు 143ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లో కూడా లభ్యమవుతోంది.
రెనో డస్టర్ డీజల్ వేరియంట్లోని 1.5-లీటర్ ఇంజన్ రెండు రకాల పవర్ మరియు టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకటి 108.5బిహెచ్‌పి పవర్ మరియు 245ఎన్ఎమ్ టార్క్, మరొకటి 84బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది.
రెనో ఇండియా మేనేజింగ్ డైరక్టర్ మరియు సిఇఓ సుమిత్ సాహ్నే మాట్లాడుతూ, " రెనో క్విడ్ కారును 98 శాతం స్థానికీకరణతో విడుదల చేశాం. అదే తరహాలోనే డస్టర్‌ను కూడా ఎక్కువ వరకు స్థానికంగా తయారైన విడి భాగాలతో తయారు చేసాము. ఈ ప్రయోజనాలను కస్టమర్లకు అందించేందుకు డస్టర్ మీద ధర తగ్గించినట్లు పేర్కొన్నాడు."
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
రెనో డస్టర్ ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యి, ఒక కొత్త సెగ్మెంట్‌ను సృష్టించింది. అడ్వెంచర్ విభాగంలో కూడా పోటీదారుల కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. తాజాగా, డస్టర్ లోని అన్ని వేరియంట్ల మీద ధరలు తగ్గడంతో డస్టర్‌ను సొంతం చేసుకునే ఔత్సాహికుల సంఖ్య పెరగనుంది. నూతన ధరలు ఖచ్చితంగా ఇండియన్ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకోనున్నాయి.