రెనో క్విడ్ లైవ్ ఫర్ మోర్ ఎడిషన్ విడుదల: ధర మరియు ఫీచర్ల కోసం...

రెనో విపణిలోకి సరికొత్త క్విడ్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారును లైవ్ ఫర్ మోర్ రీలోడెడ్ 2018 ఎడిషన్ పేరుతో లాంచ్ చేసింది. రెనో క్విడ్ 0.8- లీటర్ స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 2.66 లక్షలు

By N Kumar

రెనో విపణిలోకి సరికొత్త క్విడ్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారును లైవ్ ఫర్ మోర్ రీలోడెడ్ 2018 ఎడిషన్ పేరుతో లాంచ్ చేసింది. రెనో క్విడ్ 0.8- లీటర్ స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 2.66 లక్షలు మరియు 1.0-లీటర్ టాప్ ఎండ్ వేరియంట్ ధర గరిష్టంగా రూ. 3.87 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

రెనో క్విడ్ స్పెషల్ ఎడిషన్

రెనో ప్రవేశపెట్టిన క్విడ్ లైప్ ఫర్ మోర్ రీలోడెడ్ ఎడిషన్ మోడల్‌లో ఎక్ట్సీరియర్‌ పరంగా ఎన్నో కాస్మొటిక్ మెరుగులు, సరికొత్త బాడీ డీకాల్స్ మరియు పలు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి.

Recommended Video

Watch Now | Indian Navy's MiG-29K Crashed In Goa Airport | Full Details - DriveSpark
రెనో క్విడ్ స్పెషల్ ఎడిషన్

రెనో క్విడ్ లైప్ ఫర్ మోర్ రీలోడెడ్ 2018 ఎడిషన్ ధరలు

వేరియంట్లు ధరలు
KWID 0.8L SCe ₹ 2,66,700
KWID 1.0L SCe MT ₹ 3,57,900
KWID 1.0L SCe AMT ₹ 3,87,900
రెనో క్విడ్ స్పెషల్ ఎడిషన్

రెనో క్విడ్ లైప్ ఫర్ మోర్ రీలోడెడ్ 2018 ఎడిషన్ డిజైన్

రెనో క్విడ్ లైవ్ ఫర్ మోర్ రీలోడెడ్ ఎడిషన్ ఎక్ట్సీరియర్‌లోని బానెట్, రూఫ్, షోల్డర్ లైన్స్ మరియు సైడ్ బాడీ మీద స్పీడ్‌స్టర్ గ్రాఫిక్స్ ఉన్నాయి. అంతే కాకుండా రెనో స్పెషల్ స్టైలింగ్ మరియు కలర్ కాంబినేషన్స్ అందిస్తోంది.

రెనో క్విడ్ స్పెషల్ ఎడిషన్

బ్లాక్, డార్క్ గ్రే మరియు పసుపు రంగు సొబగుల కాంబినేషన్స్ ఎక్ట్సీరియర్‌ డిజైన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ రీఫ్రెష్డ్ స్పెషల్ ఎడిషన్ క్విడ్ కారులో "లైవ్ ఫర్ మోర్" లోగోను డోర్ల మీద అందివ్వడం జరిగింది.

Trending On DriveSpark Telugu:

2018లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం విడుదలయ్యే కార్లు

2018 స్విఫ్ట్ విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్: బుకింగ్స్ షురూ చేసిన డీలర్లు!!

ఇండియా మీదుగా వెళ్లే పది అంతర్జాతీయ రైలు మార్గాలు

రెనో క్విడ్ స్పెషల్ ఎడిషన్

ఈ రెనో లైవ్ ఫర్ మోర్ రీలోడెడ్ ఎడిషన్ క్విడ్ కారును స్పీడ్‌స్టర్ గ్రాఫిక్స్‌తో పాటు స్పోర్ట్జ్ మరియు ర్యాలీక్రాస్ గ్రాఫిక్స్‌తో కూడా ఎంచుకోవచ్చు. రెనో క్విడ్ ఐదు విభిన్న బాడీ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. అవి, ఫైరీ రెడ్, ఐస్ కూల్ వైట్, మూన్‌లైట్ సిల్వర్, ఔట్‌బ్యాక్ బ్రాంజ్ మరియు ప్లానెట్ గ్రే.

రెనో క్విడ్ స్పెషల్ ఎడిషన్

రెనో క్విడ్ లైవ్ ఫర్ మోర్ రీలోడెడ్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్

సాంకేతికంగా క్విడ్ లైవ్ ఫర్ మోర్ రీలోడెడ్ ఎడిషన్ 0.8-లీటర్ మరియు 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది. ఇందులోని 799సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ 53బిహెచ్‌పి పవర్ మరియు 72ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

రెనో క్విడ్ స్పెషల్ ఎడిషన్

అదే విధంగా పవర్‌ఫుల్ క్విడ్ కోరుకునే వారి కోసం పరిచయం చేసిన 999సీసీ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ 67బిహెచ్‌పి పవర్ మరియు 91ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకోవచ్చు.

రెనో క్విడ్ స్పెషల్ ఎడిషన్

రెనో క్విడ్ లైవ్ ఫర్ మోర్ రీలోడెడ్ ఎడిషన్ ఫీచర్లు

సరికొత్త రెనో క్విడ్ లైవ్ ఫర్ మోర్ రీలోడెడ్ ఎడిషన్‌లో నూతన ఫీచర్లు ఉన్నాయి. రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, లేన్ చేంజ్ ఇండికేటర్ మరియు స్పీడ్ ఆధారంగా వాల్యూమ్ కంట్రోల్ చేసుకునే మీడియానవ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రెనో క్విడ్ స్పెషల్ ఎడిషన్

రెనో ఇండియా క్విడ్ లైవ్ ఫర్ మోర్ రీలోడెడ్ ఎడిషన్ మీద దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రెనో విక్రయ కేంద్రాలలో బుకింగ్స్ ప్రారంభించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ క్విడ్ కార్లను కేవలం పరిమిత సంఖ్యలో కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయని రెనో పేర్కొంది.

రెనో క్విడ్ స్పెషల్ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రెనో క్విడ్ లైవ్ ఫర్ మోర్ రీలోడెడ్ ఎడిషన్ వెర్షన్‌లో పది రకాల నూతన అప్‌డేట్స్ జరిగాయి. ఎక్ట్సీరియర్ స్టైలింగ్ మరియు ఇంటీరియర్ ఫీచర్ల పరంగా మార్పులు చోటు చేసుకున్నాయి. సాధారణ క్విడ్‌తో పోల్చుకుంటే స్పెషల్ ఎడిషన్ క్విడ్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. అంతే కాకుండా అన్ని రకాల కస్టమర్లను ఆకట్టుకునేందుకు రెండు రకాల ఇంజన్ ఆప్షన్స్‌తో సరసమైన ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: Renault Kwid Live For More Reloaded 2018 Edition Launched In India; Prices Start At Rs 2.66 Lakh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X