రెనో లోగాన్ స్టెప్‌వే క్రాస్ సెడాన్: ఎస్‌యూవీ స్టైల్లో సెడాన్

ప్రపంచ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్ మరియు ఎస్‌యూవీల డిజైన్ అంశాల మేళవింపుతో ఓ సరికొత్త ఉత్పత్తిని రూపొందించింది.

By Anil Kumar

ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో ఓ కొత్త ప్రయోగం చేసింది. ప్రపంచ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్ మరియు ఎస్‌యూవీల డిజైన్ అంశాల మేళవింపుతో ఓ సరికొత్త ఉత్పత్తిని రూపొందించింది. క్రాస్ సెడాన్ సెగ్మెంట్ క్రింద తీసుకొచ్చిన లోగాన్ స్టెప్‌వే క్రాస్ సెడాన్ కారును రష్యన్ మార్కెట్లో ఆవిష్కరించింది.

రెనో లోగాన్ స్టెప్‌వే

రెనో సరికొత్త లోగాన్ స్టెప్‌వే క్రాస్ సెడాన్ కారుతో పాటు శాండ్రియో స్టెప్‌వే మరియు డాకర్ స్టెప్‌వే అనే మోడళ్లను కూడా రివీల్ చేసింది. అయితే, సరికొత్త రెనో లోగాన్ స్టెప్‌వే మోడల్‌ను ఆగష్టు 29, 2018 నుండి ప్రారంభమయ్యే 2018 మోస్కో ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ సెలూన్‌లో ప్రజా సందర్శన కోసం ఆవిష్కరించింది.

రెనో లోగాన్ స్టెప్‌వే

రెనో లోగాన్ స్టెప్‌వే ఫ్రంట్ డిజైన్‌లో క్రోమ్ పట్టీతో కూడిన బ్లాక్ గ్రిల్, పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు, కండలు తిరిగిన బంపర్, బాడీ చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్, సిల్వర్ స్కిడ్ ప్లేట్ మరియు ఫాగ్ ల్యాంప్స్ చుట్టు క్రోమ్ మేళవింపులున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే రెనో లోగాన్ ఫ్రంట్ డిజైన్ ఇండియన్ మార్కెట్లో ఉన్న రెనో క్విడ్‌ను పోలి ఉంటుంది.

రెనో లోగాన్ స్టెప్‌వే

రెనో లోగాన్ స్టెప్‌వే క్రాస్ సెడాన్ సైడ్ డిజైన్ విషయానికి వస్తే ఎస్‌యూవీ తరహా అధిక ఎత్తులో మరియు సెడాన్ తరహాలో పొడవుగా ఉంటుంది. బాడీ చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ మరియు అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. రెనో లోగాన్ స్టెప్‌వే గ్రౌండ్ క్లియరెన్స్ 40 మిల్లీమీటర్లుగా ఉంది, సాధారణ లోగాన్ కంటే ఇది చాలా ఎక్కువ.

రెనో లోగాన్ స్టెప్‌వే

రెనో లోగాన్ స్టెప్‌వే ఇంటీరియర్‌లో సరికొత్త స్టీరింగ్ వీల్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేయగల అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రిమోట్ స్టార్ట్ సిస్టమ్, హీటెడ్ విండ్‌షీల్డ్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, హీటెడ్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్లతో పాటు పార్కింగ్ సెన్సార్లు వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.

రెనో లోగాన్ స్టెప్‌వే

రెనో లోగాన్ స్టెప్‌వే క్రాస్ సెడాన్ కారులో సాంకేతికంగా 1.6-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది మూడు రకాలుగా పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. బేస్ వేరియంట్ 83బిహెచ్‌పి-134ఎన్ఎమ్, మిడ్ వేరియంట్ 100బిహెచ్‌పి-145ఎన్ఎమ్ అదే విధంగా టాప్ ఎండ్ వేరియంట్ 111బిహెచ్‌పి పవర్ మరియు 152ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి.

అన్ని ఇంజన్ వేరియంట్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సీవీటీ గేర్‌బాక్స్ అనుసంధానం కలిగి ఉన్నాయి.

రెనో లోగాన్ స్టెప్‌వే

రెనో ఇండియా గతంలో మహీంద్రా అండ్ మహీంద్రా భాగస్వామ్యంతో అభివృద్ది చేసిన లోగాన్ సెడాన్ కారును దేశీయ విపణిలో విక్రయించేది. అయితే ఆశించిన డిమాండ్ లభించకపోవడంతో మార్కెట్ నుండి తప్పించింది. కాబట్టి, లోగాన్ స్టెప్‌వే క్రాస్ సెడాన్ కారును ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశాలు దాదాపు లేనట్లే.

రెనో లోగాన్ స్టెప్‌వే

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఫ్రెంచ్ దిగ్గజం రెనోకు రష్యా అతి ముఖ్యమైన మార్కెట్. రష్యన్ కస్టమర్లకు అవసరమయ్యే ఫీచర్లను జోడించి ఎస్‌యూవీ మరియు సెడాన్ డిజైన్ అంశాలతో లోగాన్ స్టెప్‌వే క్రాస్ సెడాన్ కారును ప్రత్యేకించిన రష్యన్ మార్కెట్ కోసం అభివృద్ది చేసింది. ఆశించిన స్పందన లభిస్తే, తరువాత మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లకు దీనిని పరిచయం చేసే అవకాశం ఉంది.

ఏదేమైనప్పటికీ, రెనో లోగాన్ స్టెప్‌పే క్రాస్ సెడాన్ కారు గురించి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ సెక్షన్ ద్వారా మాతో పంచుకోండి...

Most Read Articles

Read more on: #renault #రెనో
English summary
Read In Telugu: Renault Logan Stepway Cross-Sedan Unveiled
Story first published: Tuesday, August 21, 2018, 18:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X