2018 కోసం రెనో నుండి వస్తోన్న మరో రెండు కార్లు

రెనో ఇండియాకు భారీ సక్సెస్ సాధించిపెట్టిన రెండు మోడళ్లు - క్విడ్ మరియు డస్టర్. అయితే, మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లు విడుదలవుతుండటంతో ఈ రెండు కార్లు కూడా పట్టును కోల్పోతూ వచ్చాయి. అయితే, భార

By Anil Kumar

రెనో ఇండియాకు భారీ సక్సెస్ సాధించిపెట్టిన రెండు మోడళ్లు - క్విడ్ మరియు డస్టర్. అయితే, మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లు విడుదలవుతుండటంతో ఈ రెండు కార్లు కూడా పట్టును కోల్పోతూ వచ్చాయి. అయితే, భారీ అంచనాలతో రెనో గత ఏడాది క్యాప్చర్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. అయితే, అది కూడా రెనో అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది.

రెనో నుండి వస్తోన్న మరో రెండు కార్లు

అయితే, రెనో ఇండియా ప్రొడక్ట్ లైనప్‌లో ఉన్న అలసత్వాన్ని పోగొట్టేందుకు ఈ ఏడాదిలోనే మార్కెట్లోకి రెండు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడానికి రెనో సిద్దమైంది. దాని తాలుకు వివరాలు ఇప్పుడు బహిర్గతమయ్యాయి.

రెనో నుండి వస్తోన్న మరో రెండు కార్లు

రెనో సేల్స్ ఊపందుకునేందుకు ఈ 2018లోనే నూతన మోడళ్లను లాంచ్ చేయాలని భావించుకుంది. అందులో ఒకటి రెనో క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌. విడుదలైన అనతి కాలంలోనే బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచి, దేశీయ దిగ్గజం మారుతి సుజుకి కంపెనీకి చుక్కలు చూపించింది. ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు మరియు స్టైలిష్ ఎస్‌యూవీ లుక్ ఇందుకు బాగా కలిసొచ్చింది.

రెనో నుండి వస్తోన్న మరో రెండు కార్లు

అయితే, ఇటీవల కాలంలో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్ల సెగ్మెంట్లో పలు కొత్త మోడళ్లు విడుదలయ్యేసరికి ఒకప్పుడు నెలకు 10,000 యూనిట్ల వరకు అమ్ముడుపోయే క్విడ్ ఇప్పుడు సగానికి పడిపోయాయి.

రెనో నుండి వస్తోన్న మరో రెండు కార్లు

రెనో క్విడ్ సేల్స్ పుంజుకునేందుకు రెనో చేస్తున్న మరో ప్రయత్నం క్విడ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేయడం. డిజైన్ పరంగా పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు. అయితే, ఫ్రంట్ బంపర్, గ్రిల్ మరియు ఇంటీరియర్‌లో ఫ్రెష్ లుక్ కల్పించేందుకు పలు రకాల అప్‌డేట్స్ చోటు చేసుకోనున్నాయి.

రెనో నుండి వస్తోన్న మరో రెండు కార్లు

ప్రస్తుతం రెనో క్విడ్ లభిస్తున్న 799సీసీ మరియు 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లతో అవే 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌‌మిషన్‌లో క్విడ్ ఫేస్‌లిఫ్ట్ లభించనుంది.

రెనో నుండి వస్తోన్న మరో రెండు కార్లు

అదే విధంగా మరో ఉత్పత్తిగా క్యాప్చర్ ఎస్‌యూవీని మరో కొత్త వేరియంట్లో లాంచ్ చేయనుంది. ప్రస్తుతం ఇది రెనో ఇండియా యొక్క హై ఎండ్ మోడల్‌గా ఉంది. పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్స్‌లో లభించే ఈ ప్రీమియం ఎస్‌యూవీ ప్రీమియం ఫీచర్లతో కేవలం ఖరీదైన కార్లను ఎంచుకునే కస్టమర్లను మాత్రమే టార్గెట్ చేయనుంది.

రెనో నుండి వస్తోన్న మరో రెండు కార్లు

రెనో క్యాప్చర్ ఎస్‌యూవీని డస్టర్‌ను నిర్మించిన అదే ఫ్లాట్‌ఫామ్ మీద రూపొందించింది. ఇంజన్ ఆప్షన్‌లను కూడా డస్టర్ నుండి సేకరించి ఇందులో అందివ్వడం జరిగింది. అయితే, డస్టర్ డీజల్ వేరియంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందించిన రెనో క్యాప్చర్ ఎస్‌యూవీలో ఏఎమ్‌టి అందివ్వలేదు. ఏఎమ్‌టి అందిస్తే ఉన్నత విలువలను అందుకోలేదనే ఉద్దేశ్యంతో పరిచయం చేయలేదని సమర్థించుకుంది.

Source: Economic Times

Most Read Articles

Read more on: #renault #రెనో
English summary
Read In Telugu: Renault to launch 2 new cars in 2018: Details
Story first published: Tuesday, May 22, 2018, 18:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X