సలోన్ వెర్షన్ స్విఫ్ట్ స్పోర్ట్ ఆవిష్కరించిన సుజుకి

Written By:

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం సుజుకి 208 జనవరిలో జరగనున్న 2018 టోక్యో ఆటో సలోన్‌లో ప్రదర్శించనున్న స్విఫ్ట్ స్పోర్ట్ సలోన్ వెర్షన్‌ను ఆవిష్కరించింది.

స్విఫ్ట్ స్పోర్ట్ సలోన్ వెర్షన్‌ను మరింత హాట్ హ్యాచ్‌బ్యాక్‌ను తలపించేలా ఎన్నో కాస్మొటిక్ అప్‌డేట్స్ చోటు చేసుకున్నాయి. బహుశా దీనిని లిమిటెడ్ ఎడిషన్‌గా మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

2018 మారుతి స్విఫ్ట్

2018 స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ సలోన్ వెర్షన్‌ను రూపొందించింది. ఈ స్పెషల్ ఎడిషన్ స్విఫ్ట్ మ్యాట్ బ్లాక్ పెయింట్ స్కీములో రానుంది. ఫ్రంట్ లిప్ స్పాయిలర్, ఎరుపు రంగు సొబగులున్న సైడ్ స్కర్ట్స్ మరియు ఎరుపు రంగులో ఉన్న అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ వంటివి ఉన్నాయి.

Recommended Video - Watch Now!
Shocking Car Accident That Happened In Karunagappally, Kerala
2018 మారుతి స్విఫ్ట్

రేడియేటర్ గ్రిల్ సరౌండింగ్స్‌లో శాటిన్ గ్రే కలర్ ఫినిషింగ్. రియర్ డోర్ మీద స్పోర్ట్ బ్రాండింగ్, స్పోర్టివ్ బాడీ డీకాల్స్, బ్లాక్ అల్లాయ్ వీల్స్ మరియు గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్‌లో ఉన్న రూఫ్ టాప్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ప్రత్యేకాకర్షణగా నిలిచాయి.

2018 మారుతి స్విఫ్ట్

గ్లోబల్ వెర్షన్ సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో సాంకేతికంగా 138బిహెచ్‌పి పవర్ మరియు 230ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.4-లీటర్ కెపాసిటి గల బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కలిగి ఉంది.

2018 మారుతి స్విఫ్ట్

సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ 2018 ఫిబ్రవరిలో జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వాహన ప్రదర్శన వేదిక మీద ప్రదర్శించే అవకాశం ఉంది. దీనితో పాటే, మారుతి సుజుకి కొత్త తరం స్విఫ్ట్‌ను కూడా ఇదే ఈవెంట్లో ఆవిష్కరించనుంది.

Trending On DriveSpark Telugu:

2017లో భారత్‌కు శాశ్వతంగా వీడ్కోలు పలికిన కార్లు

మితిమీరిన వేగంతో బీభత్సం సృష్టించిన కారు

2017లో ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన బెస్ట్ కార్లు

2018 మారుతి స్విఫ్ట్

ఇండియన్ వెర్షన్ స్విఫ్ట్ సాంకేతికంగా 82బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే 1.2-లీటర్ పెట్రోల్ మరియు 74 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 1.3-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభించనుంది.

2018 మారుతి స్విఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ సలోన్ వెర్షన్ కేవలం స్పెషల్ ఎడిషన్‌గా మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాస్మొటిక్ మెరుగులు పొందిన ఇది భారత్‌కు వచ్చే అవకాశం లేనట్లే, అయితే, సరికొత్త థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ మరియు స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు ఈ ఏడాది పూర్తి స్థాయిలో విపణిలోకి రానున్నాయి.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Suzuki Swift Sport Salon Version Revealed — To Debut At 2018 Tokyo Auto Salon
Story first published: Monday, January 1, 2018, 10:58 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark