నెల రోజుల వ్యవధిలోనే 4,000 యారిస్ కార్లను విక్రయించిన టయోటా

టయోటా కిర్లోస్కర్ మోటార్ మే 18, 2018 న విపణిలోకి యారిస్ సెడాన్ కారును విడుదల చేసింది. విడుదల చేసిన అనతి కాలంలో భారీ విజయాన్ని అందుకుంది. ఒక్క మే నెల మలిసగంలోనే ఏకంగా 4,000 యారిస్ కార్లు రోడ్డెక్కాయి.

By Anil Kumar

దేశీయ మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లోకి టయోటా తొలిసారిగా యారిస్ సెడాన్ కారును విడుదల చేసింది. ఈ సెగ్మెంట్లో ఇప్పటికీ పరిచయం కానటువంటి ఎన్నోఫస్ట్-ఇన్ క్లాస్ ఫీచర్లను అందించింది.

నెల రోజుల వ్యవధిలోనే 4,000 యారిస్ కార్లను విక్రయించిన టయోటా

మే 2018 సేల్స్‌తో టయోటా కిర్లోస్కర్ మోటార్ దేశీయంగా 20 శాతం వృద్దిని సాధించినట్లు ప్రకటించింది. మే 2018 నెలలో 13,940 యూనిట్లను విక్రయించగా... ఇందులో 13,113 యూనిట్లను దేశీయ మార్కెట్లో మరియు 827 యూనిట్ల ఎటియోస్ కార్లను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసింది.

నెల రోజుల వ్యవధిలోనే 4,000 యారిస్ కార్లను విక్రయించిన టయోటా

గత ఏడాది ఇదే నెలలో 10,914 యూనిట్లను దేశీయ విపణిలో మరియు 1,425 యూనిట్లను ఎగుమతి చేసింది. ఈ క్రమంలో ఇండియన్ మార్కెట్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన టయోటా 20 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

నెల రోజుల వ్యవధిలోనే 4,000 యారిస్ కార్లను విక్రయించిన టయోటా

టయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటి మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా మాట్లాడుతూ, "మే 2018 ఫలితాల్లో రెండంకెల వృద్దిని సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ప్రతి సెగ్మెంట్లో కూడా లీడర్‌గా రాణిస్తున్న ఫార్చ్యూనర్, ఇన్నోవా క్రిస్టా మరియు యారిస్ కార్లు ఈ విజయానికి గణనీయంగా దోహదపడ్డాయని చెప్పుకొచ్చాడు."

నెల రోజుల వ్యవధిలోనే 4,000 యారిస్ కార్లను విక్రయించిన టయోటా

టయోటా ఇటీవల విడుదల చేసిన యారిస్ కారుకు మంచి స్పందన లభిస్తోంది. విడుదలైన కేవలం 13 రోజుల్లోనే 4,000 కార్లను కస్టమర్లకు డెలివరీ ఇచ్చింది. ప్రస్తుతం, ఇండియన్ మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో యారిస్‌ పట్ల సానుకూల స్పందన లభిస్తోంది.

నెల రోజుల వ్యవధిలోనే 4,000 యారిస్ కార్లను విక్రయించిన టయోటా

ఎన్ రాజా మాట్లాడుతూ, యారిస్ సెడాన్ మీద వచ్చే స్పందనను ముందుగా ఊహించి, విడుదలకు నెల రోజులు ముందుగానే యారిస్ ప్రొడక్షన్ ప్రారంభించిము. దాంతో డిమాండుకు అనుగుణంగా డెలివరీ ఇవ్వగలిగాము. దీంతో వెయింటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా తగ్గిపోయింది.

నెల రోజుల వ్యవధిలోనే 4,000 యారిస్ కార్లను విక్రయించిన టయోటా

టయోటా యారిస్ సెడాన్‌లో ఎన్నో ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు ఉన్నాయి. అందులో... రూఫ్ మౌంటెడ్ ఏ/సి వెంట్స్, గెస్ట్చర్ కంట్రోల్, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, పవర్ డ్రైవర్ సీటు, రూఫ్ మౌంటెడ్ ఏసి వెంట్స్, ఆంబియంట్ లైటింగ్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్, లెథర్ సీట్ అప్‌హోల్‌స్ట్రే, కప్ హోల్డర్స్ గల రియర్ ఆర్మ్ రెస్ట్, కీలెస్ ఎంట్రీ, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, రియర్ వ్యూవ్ కెమెరా మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

నెల రోజుల వ్యవధిలోనే 4,000 యారిస్ కార్లను విక్రయించిన టయోటా

డ్రైవ్‍‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టయోటా మోటార్స్ చిన్న కార్ల పరిశ్రమలో విపరీతమైన పోటీ కారణంగా పెద్దగా రాణించలేకపోతోంది. అయితే, ఖరీదైన ఫార్చ్యూనర్ మరియు ఇన్నోవా మోడళ్ల ద్వారా ఆయా సెగ్మెంట్లలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తోంది. ఇటీవల పరిచయమైన యారిస్ సెడాన్ విపణిలో ఉన్న హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ మోడళ్ల నుండి ఎదురవుతున్న పోటీని తట్టుకుని అత్యుత్తమ సేల్స్ సాధించింది. టయోటా లైనప్‌లో ఉన్న ఎటియోస్ మరియు కరోలా ఆల్టిస్ మధ్య స్థానాన్ని భర్తీ చేస్తుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Toyota Domestic Sales Grow By 20 Percent In May 2018; Yaris Sells 4,000 Units Since Launch
Story first published: Friday, June 1, 2018, 15:06 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X