టయోటా యారిస్ బుకింగ్స్ ప్రారంభం - విడుదల, స్పెసిఫికేషన్స్, ఫీచర్లు

Written By:

టయోటా కిర్లోస్కర్ ఇండియా గత ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో సరికొత్త యారిస్ మిడ్ సైజ్ సెడాన్ కారును ఆవిష్కరించింది. టయోటా ఈ ప్రీమియం సెడాన్ కారును మార్కెట్లోకి లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. పలు నూతన ఫీచర్లు మరియు విభిన్న డిజైన్ శైలిలో ఉన్న ప్రీమియం సి-సెగ్మెంట్ సెడాన్ టయోటా యారిస్‌ మీద బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

టయోటా యారిస్ బుకింగ్స్

బెంగళూరు మరియు సౌత్ ఇండియాలో ఉన్న ఇతర నగరాల్లోని టయోటా డీలర్లు యారిస్ మీద బుకింగ్స్ ప్రారంభించినట్లు డ్రైవ్‌స్పార్క్‌కు వెల్లడించారు. టయోటా యారిస్ ఏప్రిల్ 2018 చివరి నాటికి విడుదల కానున్నట్లు తెలిసింది. దీనిని రూ. 50,000 చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.

టయోటా యారిస్ బుకింగ్స్

టయోటా యారిస్ సెడాన్ లభించే వేరియంట్లు మరియు ధరల గురించి ఎలాంటి సమాచారం లేదని డీలర్లు తెలిపారు. కాబట్టి, ఇప్పుడు యారిస్ సెడాన్ బుక్ చేసుకుంటే అది లభించే వేరియంట్‌ను ఇప్పుడే ఎంచుకోలేదు. అయితే విడుదల తరువాత అందరి కంటే కొంచెం ముందుగానే డెలివరీ లభిస్తుంది.

టయోటా యారిస్ బుకింగ్స్

టయోటా యారిస్ మిడ్ సైజ్ సెడాన్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభ్యం కానుంది. ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించిన యారిస్‌ను గమనిస్తే, ఇందులో అతి కీలకమైన పలు ప్రీమియమ్ ఫీచర్లు రానున్నాయి.

Recommended Video - Watch Now!
Toyota Yaris India Walkaround; Specifications, Features, Details
టయోటా యారిస్ బుకింగ్స్

యారిస్ ఎక్ట్సీరియర్‌లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, బంపర్ మీద ఇవ్వబడిన పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్, రియర్ వ్యూవ్ కెమెరా, ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్స్ మౌంటెడ్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మరియు అక్కడక్కడ క్రోమ్ సొబగులు అందివ్వడం జరిగింది.

టయోటా యారిస్ బుకింగ్స్

సేఫ్టీ పరంగా టయోటా యారిస్‌ సెడాన్‌లో ఏడు ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటి కంట్రోల్ మరియు ముందు వైపు పార్కింగ్ సెన్సార్స్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

టయోటా యారిస్ బుకింగ్స్

యారిస్ ఇంటీరియర్‌లో, 7-అంగుళాల పరిమాణం గల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, న్యావిగేషన్, గెస్చర్ కంట్రోల్, 8-రకాలుగా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న డ్రైవర్ సీటు, రియర్ ప్యాసింజర్ల కోసం రూఫ్ మౌంటెడ్ ఎయిర్ వెంట్స్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లో ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్ మరియు పడిల్ షిఫ్టర్స్ ఉన్నాయి.

టయోటా యారిస్ బుకింగ్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

యారిస్ సెడాన్ టయోటా ఇండియా లైనప్‌లో ఉన్న ఎటియోస్ మరియు కరోలా మోడళ్ల మధ్య స్థానాన్ని భర్తీ చేస్తుంది. నూతన డిజైన్ శైలి, అత్యాధునిక ఫీచర్లతో యారిస్ ఖచ్చితంగా కస్టమర్లను ఆకట్టుకోనుంది.

టయోటా మోటార్స్‌కు యారిస్ సెడాన్ ఎంతో ముఖ్యమైన మోడల్. దీని ధరల శ్రేణి అంచాగా రూ. 10 లక్షల నుండి రూ. 12 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉండనుంది. టయోటా యారిస్ విపణిలో ఉన్న మారుతి సియాజ్, హ్యుందాయ్ వెర్నా మరియు హోండా సిటీకి గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: Toyota Yaris Bookings Open — Launch Details, Specs, Features And Expected Price
Story first published: Monday, March 19, 2018, 18:02 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark