ఆటో ఎక్స్‌పో 2018: యారిస్ సెడాన్ ఆవిష్కరించిన టయోటా

Written By:
Recommended Video - Watch Now!
New Maruti Swift Launch: Price; Mileage; Specifications; Features; Changes

ఆటో ఎక్స్‌పో 2018: టయోటా మోటార్స్ యారిస్ సెడాన్ కారును ఆవిష్కరించింది. దేశీయ మార్కెట్లో ఇప్పటికే విపరీతమైన పోటీ ఉన్న బి-సెగ్మెంట్లోకి యారిస్ సెడాన్ కారును ప్రవేశపెట్టింది. టయోటా మోటార్స్ తమ యారిస్ సెడాన్ కారుకు గ్రీకు దేవత ఛారిస్ పేరుతో ఆధారంగా తీసుకొచ్చారు.

టయోటా యారిస్

విపణిలో ఉన్న హోండా సిటి, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సిటీ మిడ్-సైజ్ సెడాన్ కార్లకు గట్టి పోటీగా యారిస్ సెడాన్ తీసుకొచ్చారు. టయోటా యారిస్ గురించి పూర్తి వివరాలు మరియు ఫోటోల కోసం...

టయోటా యారిస్

ఇండియన్ వెర్షన్ టయోటా యారిస్ కారును కేవలం 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్‌లో మాత్రమే ప్రవేశపెట్టింది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా ఇంజన్ ఉత్పత్తి చేసే 107బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ముందు చక్రాలకు సరఫరా అవుతుంది.

టయోటా యారిస్

సరికొత్త యారిస్ సెడాన్ కారును టయోటా వారి గ్లోబల్ బి ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించింది. దీని పొడవు 4,115ఎమ్ఎమ్, వెడల్పు 1,700ఎమ్ఎమ్ మరియు ఎత్తు 1,475ఎమ్ఎమ్‌గా ఉంది. టయోటా యారిస్ వీల్ బేస్ 1,2550ఎమ్ఎమ్‌గా ఉంది.

టయోటా యారిస్

ఇండియన్ రోడ్ల మీద అత్యుత్తమ పనితీరును కనబరిచేందుకు సెడాన్ ఎత్తును పెంచారు. అన్ని రకాల రహదారులను ఎదుర్కునేందుకు 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు 180 కొలతల్లో ఉన్న టైర్లను అందించారు. దీంతో అత్యుత్తమ మైలేజ్ కూడా సాధ్యమైంది.

టయోటా యారిస్

టయోటా యారిస్ కారును ఆసియన్ మార్కెట్లో ఉన్న మూడవ తరానికి చెందిన యారిస్‌ను ఫేస్‌లిఫ్ట్ రూపంలో ఆవిష్కరించింది. యారిస్ ఫ్రంట్ డిజైన్‌లో స్పోర్టివ్ యాంగులర్ హెడ్ ల్యాంప్స్, పెద్ద పరిమాణంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్‌కు ఇరువైపులా పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న హెడ్‌లైట్లు మరియు బంపర్‌కు ఇరువైపులా గుండ్రటి ఆకారంలో ఉన్న ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి.

టయోటా యారిస్

యారిస్ సైడ్ ప్రొఫైల్ ప్లేన్‌గా ఉంటుంది. డోర్లు మీదుగా ఇరువైపులా ఒక క్యారెక్టర్ లైన్ ఫ్రంట్ వీల్ ఆర్చెస్ నుండి రియర్ టెయిల్ ల్యాంప్ వరకు ఉంటుంది. ఇండియన్ వెర్షన్ యారిస్‌లో 15-అంగుళాల వీల్స్‌తో చూడటానికి చిన్నగా కనిపించినప్పటికీ ఇంటీరియర్ చాలా విశాలంగా ఉంటుంది.

టయోటా యారిస్

యారిస్ సెడాన్ ఇంటీరియర్‌లో ఫాక్స్ లెథర్ సీట్లు, పెడల్ షిఫర్లు, చిన్న పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏ/సి వెంట్స్, పవర్ డ్రైవర్ సీటు, 7-ఎయిర్‌బ్యాగులు, రూఫ్ మీద ఉన్న ఎయిర్ వెంట్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు మరియు అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

టయోటా యారిస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టయోటా యారిస్ సెడాన్ ఆవిష్కరణ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన దేశీయ కస్టమర్ల కోసం టయోటా మోటార్స్ ఎట్టకేలకు యారిస్ మిడ్ సైజ్ సెడాన్ కారును ఆవిష్కరించింది. ఇప్పటికే విపరీతమైన పోటీ ఉన్న సెగ్మెంట్లోకి యారిస్ ప్రవేశిస్తోంది.

టయోటా యారిస్

హోండా సిటి, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్‌ కార్లు పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వెర్షన్‌లో లభ్యమవుతోంది. మరి కేవలం పెట్రోల్ ఇంజన్‌తోనే వచ్చిన యారిస్‌కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలంటే దీని విడుదల వరకు వేచి ఉండాల్సిందే...

English summary
Read In Telugu: Auto Expo 2018: Toyota Yaris Unveiled
Story first published: Sunday, February 11, 2018, 17:07 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark