మరో రెండు వేరియంట్లలో విడుదలైన వోల్వో ఎక్స్‌సి40

By Anil Kumar

వోల్వో ఇండియా విభాగం ఇటీవల సరికొత్త ఎక్స్‌సి40 ఎస్‌యూవీని విపణిలోకి లాంచ్ చేసింది. వోల్వో ఎక్స్‌సి40 (Volvo XC40) ఎస్‌యూవీని తొలుత ఆర్-డిజైన్ (R-Design) అనే వేరియంట్లో పరిచయం చేయగా, ఇప్పుడు వీటికి కొనసాగింపుగా ముమెంటమ్ (Momentum) మరియు ఇన్‌స్క్రిప్షన్ (Inscription) అనే మరో రెండు వేరియంట్లను విడుదల చేసింది.

మరో రెండు వేరియంట్లలో విడుదలైన వోల్వో ఎక్స్‌సి40

కొత్తగా విడుదలైన వోల్వో ఎక్స్‌సి40 బేస్ వేరియంట్ ముమెంటమ్ ధర రూ. 39.90 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ఇన్‌స్క్రిప్షన్ ధర రూ. 43.90 లక్షలు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నాయి.

మరో రెండు వేరియంట్లలో విడుదలైన వోల్వో ఎక్స్‌సి40

వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీ ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన తొలి రెండు వారాల్లో దేశవ్యాప్తంగా 200 యూనిట్లకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి. ఆర్-డిజైన్ వేరియంట్ రూ. 39.90 లక్షల పరిచయాత్మక ధరతో విడుదలయ్యింది. ఇప్పుడు, వోల్వో ఎక్స్‌సి ఆర్-డిజైన్ ధర రూ. 42.90 లక్షలకు చేరుకుంది.

మరో రెండు వేరియంట్లలో విడుదలైన వోల్వో ఎక్స్‌సి40

కొత్త విడుదలైన రెండు వేరియంట్లతో పాటు మొత్తం మూడు వేరియంట్లలో ఉన్న అదే మునుపటి 2.0-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ 190బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి అనుసంధానం చేసిన 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా పవర్ మరియు టార్క్ నాలుకు చక్రాలకు సరఫరా అవుతుంది.

మరో రెండు వేరియంట్లలో విడుదలైన వోల్వో ఎక్స్‌సి40

ఫీచర్ల విషయానికి వస్తే, మిడ్ మరియు టాప్ ఎండ్ వేరియంట్లలో దాదాపు ఒకే తరహా ఫీచర్లు ఉన్నాయి. ఆర్-డిజైన్ మరియు ఇన్‌స్క్రిప్షన్ వేరియంట్లలో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేయగల 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, పవర్ టెయిల్ గేట్, హీటెడ్ ఫ్రంట్ మరియు రియర్ సీట్లు, వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్, 12-స్పీకర్ల హార్మన్ కార్డన్ సౌండ్ మ్యూజిక్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

మరో రెండు వేరియంట్లలో విడుదలైన వోల్వో ఎక్స్‌సి40

వోల్వో ఎక్స్‌సి40 ఇన్‌స్క్రిప్షన్ వేరియంట్లో పలు అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఈ టాప్ ఎండ్ వేరియంట్లో డిజైన్ పరంగా పలు ఫీచర్లు ఉన్నాయి, ప్రత్యేకించి విభిన్నమైన ఫ్రంట్ గ్రిల్, 6-స్పోక్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, క్రిస్టర్ గేర్ నాబ్, ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న రియర్ సీట్ హెడ్ రెస్ట్ వంటివి ఉన్నాయి.

మరో రెండు వేరియంట్లలో విడుదలైన వోల్వో ఎక్స్‌సి40

వోల్వో ఎక్స్‌సి40 బేస్ వేరియంట్ ముమెంటమ్‌లో పలు ఫీచర్లు మిస్సయ్యాయి. ప్రత్యేకంగా 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, స్టాండర్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్లు ఎక్స్‌సి40 ముమెంటమ్ వేరియంట్లో రాలేదు.

మరో రెండు వేరియంట్లలో విడుదలైన వోల్వో ఎక్స్‌సి40

ఏదేమైనప్పటికీ, వోల్వో ఎక్స్‌సి40 అన్ని వేరియంట్లలో ఒకే తరహా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. లేన్-కీపింగ్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ వార్నింగ్, పైలట్ అసిస్ట్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ మరియు 8-ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి.

మరో రెండు వేరియంట్లలో విడుదలైన వోల్వో ఎక్స్‌సి40

వోల్వో తాజాగా విడుదల చేసిన ఎక్స్‌సి40 ముమెంటమ్ మరియు ఇన్‌స్క్రిప్షన్ రెండు వేరియంట్ల మీద ఇప్పటికే దేశవ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 2 లక్షల రుపాయలు చెల్లించి నచ్చిన వేరియంట్ బుక్ చేసుకోవచ్చు. వోల్వో ఎక్స్‌సి40 నూతన వేరియంట్ల డెలివరీలు ఆగష్టులో ప్రారంభమవుతాయి.

మరో రెండు వేరియంట్లలో విడుదలైన వోల్వో ఎక్స్‌సి40

స్వీడన్ దిగ్గజం వోల్వో దేశీయ విపణిలోకి అత్యంత సురక్షితమైన ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీని ధరకు తగ్గ విలువలతో మూడు విభిన్న వేరియంట్లో లాంచ్ చేసింది. విడుదలైనప్పటి నుండి వోల్వో ఎక్స్‌‌సి40 ఎస్‌యూవీకి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా బెంగళూరు ఓ వోల్వో షోరూమ్ ఒకే రోజు 12 యూనిట్ల ఎక్స్‌సి40 ఎస్‌యూవీలను డెలివరీ ఇచ్చింది.

మరో రెండు వేరియంట్లలో విడుదలైన వోల్వో ఎక్స్‌సి40

వోల్వో ఎక్స్‌సి40 స్మాల్ ఎస్‌యూవీ విపణిలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1, మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఎ మరియు ఆడి క్యూ3 వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Volvo XC40 Momentum & Inscription Variants Launched In India; Prices Start At Rs 39.90 Lakh
Story first published: Tuesday, July 17, 2018, 15:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X