హ్యుందాయ్ క్రెటా స్పోర్ట్స్ ఎడిషన్ విడుదల: ఇంజన్, ఫీచర్ వివరాలు

హ్యుందాయ్ ఇండియా ఇప్పటికే వెన్యూ అమ్మకాలతో వార్తలో నిలిచింది, ఇందులో ఉన్న కొత్త ఫీచర్లు మరియు ప్రత్యేకంగా భారత దేశం కోసం కొన్ని ఫీచర్లను వెన్యూలో అదనంగా ఇచ్చింది. దీనితో దేశీయ మార్కెట్లో విజయాన్ని సాధించింది. అయితే ఇప్పుడు కొత్తగా హ్యుందాయ్ మరో క్రెటా పై కొత్త ఎడిషన్ ను లాంచ్ చేసింది. మరి కొత్త క్రెటా యొక్క ఉన్న ఫీచర్లు మరియు అప్ డేట్ ల గురించి వివరంగా తెలుసుకుందాం రండి..

హ్యుందాయ్ క్రెటా స్పోర్ట్స్ ఎడిషన్ విడుదల: ఇంజన్, ఫీచర్ వివరాలు

హ్యుందాయ్ ఇండియా భారత మార్కెట్లో క్రెటా స్పోర్ట్స్ ఎడిషన్ ను నిశ్శబ్దంగా విడుదల చేసింది. ఈ కొత్త లిమిటెడ్-ఎడిషన్ మోడల్ అదనపు ఫీచర్లు మరియు ఎక్విప్ మెంట్ తోపాటుగా అనేక చిన్న చిన్న మార్పులతో పొందడంమే కూండా ఇంకా గణనీయమైన కాస్మోటిక్ అప్డేట్ లను పొందింది.

హ్యుందాయ్ క్రెటా స్పోర్ట్స్ ఎడిషన్ విడుదల: ఇంజన్, ఫీచర్ వివరాలు

క్రెటా స్పోర్ట్స్ ఎడిషన్ లో ఉన్న కొత్త అప్డేట్లు విషయానికి వస్తే ఫ్రంట్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ పై స్మోక్డ్ ఎఫెక్ట్ ను కలిగి ఉంటాయి, ఫ్రంట్ గ్రిల్ పై డార్క్-క్రోమ్ ఫినిష్, ఫౌక్స్ డ్యూయల్ ఎగ్జాస్ట్ పైపులు, సిల్వర్ రూఫ్ రెయిల్స్ మరియు స్కిడ్ ప్లేట్లు, బ్లాక్డ్-అవుట్ ఓఆర్విఎం లను పొందింది.

హ్యుందాయ్ క్రెటా స్పోర్ట్స్ ఎడిషన్ విడుదల: ఇంజన్, ఫీచర్ వివరాలు

ఇంటీరియర్ విషయానికి వస్తే, కొత్త హ్యుందాయ్ క్రెటా స్పోర్ట్స్ ఎడిషన్ బ్లాక్ ఫ్యాబ్రిక్ సీట్లపై ' క్రెటా ' లోగో తో వస్తుంది, లెదర్ చుట్టిన స్టీరింగ్ వీల్, ఎసి వెంట్ లపై వెండి అవుట్ లుక్ ను ఇచ్చారు, సీట్లపై ఎలక్ట్రిక్ సన్ రూఫ్ మరియు కాంట్రాస్ట్ స్టిచింగ్, స్టీరింగ్ వీల్ మరియు గేర్ లీవర్ వంటి కొత్త అప్డేట్ లను పొందింది.

హ్యుందాయ్ క్రెటా స్పోర్ట్స్ ఎడిషన్ విడుదల: ఇంజన్, ఫీచర్ వివరాలు

కొత్త క్రెటా స్పోర్ట్స్ ఎడిషన్ మోడల్ యొక్క ఎస్ఎక్స్ వేరియంట్ ఆధారంగా మరియు అదనపు ఫీచర్లతో కూడా వస్తుంది. ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 7.0-అంగుళాల టచ్ స్ర్కీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం, క్రూయిజ్ కంట్రోల్, వైర్ లెస్ చార్జింగ్, హైట్ ఎడ్జెస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్ మరియు డ్యూయల్ ఎయిర్ బ్యాగులు వంటి అప్డేట్ లను కలిగి ఉంది.

హ్యుందాయ్ క్రెటా స్పోర్ట్స్ ఎడిషన్ విడుదల: ఇంజన్, ఫీచర్ వివరాలు

కొత్త హ్యుందాయ్ క్రెటా స్పోర్ట్స్ ఎడిషన్ స్టాండర్డ్ మోడల్ లో ఉన్న విధంగా 1.6-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ల ద్వారా ఆధారితమైంది.

హ్యుందాయ్ క్రెటా స్పోర్ట్స్ ఎడిషన్ విడుదల: ఇంజన్, ఫీచర్ వివరాలు

1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్ 122 బిహెచ్పి మరియు 151 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది, 1.6-లీటర్ డీజల్ చర్న్స్ 122 బిహెచ్పి మరియు 260 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ క్రెటా స్పోర్ట్స్ ఎడిషన్ విడుదల: ఇంజన్, ఫీచర్ వివరాలు

క్రెటా స్పోర్ట్స్ ఎడిషన్ లోని రెండు ఇంజిన్లు కూడా ఆప్షనల్ ఆటోమేటిక్ గా కాకుండా ఒక స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంటాయి. కొత్త హ్యుందాయ్ క్రెటా స్పోర్ట్స్ ఎడిషన్ కేవలం రెండు రంగులలో అందుబాటులో ఉంటుంది అవి ఫాంటమ్ బ్లాక్ మరియు పోలార్ వైట్/ఫాంటమ్ బ్లాక్.

హ్యుందాయ్ క్రెటా స్పోర్ట్స్ ఎడిషన్ విడుదల: ఇంజన్, ఫీచర్ వివరాలు

డ్యూయల్ టోన్ స్కీమ్ లిమిటెడ్ ఎడిషన్ క్రెటా ఎస్యువి యొక్క మొత్తం ధర పై రూ.11,000 ఎక్కువగా ఉంటుంది. మొత్తంమీద, కొత్త హ్యుందాయ్ క్రెటా స్పోర్ట్స్ ఎడిషన్, స్టాండర్డ్ మోడల్ తో పోలిస్తే రూ.55,000 ఖరీదైనది. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ గా ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా స్పోర్ట్స్ ఎడిషన్ విడుదల: ఇంజన్, ఫీచర్ వివరాలు

హ్యుందాయ్ క్రెటా మిడ్-సైజ్ ఎస్యువి సెగ్మెంట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఇది ఒకటిగా ఉంది. క్రెటా ప్రస్తుతం అత్యధిక అమ్మకాల నెలతో సెగ్మెంట్ లో నిలిచింది. కొత్త హ్యుందాయ్ క్రెటా స్పోర్ట్స్ ఎడిషన్ రూ.12.78 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ క్రెటా స్పోర్ట్స్ ఎడిషన్ విడుదల: ఇంజన్, ఫీచర్ వివరాలు

అయితే, పెరుగుతున్న పోటీ తో, హ్యుందాయ్ వారి ప్రముఖ మిడ్-సైజ్ ఎస్యువి యొక్క ఒక కొత్త స్పోర్ట్స్ వేరియంట్ ను వెంటనే విడుదల చేసింది. భారతదేశంలోని హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా ఎక్స్యూవి500, ఎంజి హెక్టర్, టాటా హర్రియర్, జీప్ కంపాస్ మరియు రాబోయే కియా సెల్టోస్ ఇది పోటీగా నిలువనుంది.

Most Read Articles

English summary
Hyundai Creta Sports Edition Launched In India — Prices Start At Rs 12.78 Lakh - Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X