ప్రత్యర్థులకు పోటీగా కొత్త వెర్షన్ తో మారుతీ సుజుకి సియాజ్

దేశీయంగా అత్యధికంగా అమ్ముడవుతున్న ఆటో తయారీదారులు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఎర్టిగ పై బిఎస్-6 వెర్షన్ ను ఈ వారంలో ప్రారంభించింది. తాజాగా మారుతి సుజుకి నుండి లేటెస్ట్ మోడల్ గా రాబోతున్న సియాజ్ పై కూడా కొత్త ఉద్గార ప్రమాణాలతో ఈ నెలలో విడుదలకు సిద్ధం చేస్తోంది. మారుతీ సియాజ్ లో ఇస్తున్న కొత్త అప్డేట్ లు ఏవో ఇందులో చెప్పబోతున్నాము..

ప్రత్యర్థులకు పోటీగా కొత్త వెర్షన్ తో మారుతీ సుజుకి సియాజ్

ఈ నెలలో బిఎస్-6 ఉద్గార ప్రమాణాలతో సియాజ్ ను కూడా ప్రారంభించాలని ఈ సంస్థ భావిస్తోంది. ఇందులో ట్రాన్స్ మిషన్ల విషయానికి వస్తే ఐదు-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్, మరియు ఫోర్-స్పీడ్ ఆటోమేటిక్ కూడా ఒకటి ఉంది. అయితే బిఎస్-6 ఉద్గార ప్రమాణాలు జత చేసిన తరువాత కూడా ఈ స్పెసిఫికేషన్ లు ఒకేవిధంగా ఉండవచ్చు.

ప్రత్యర్థులకు పోటీగా కొత్త వెర్షన్ తో మారుతీ సుజుకి సియాజ్

సియాజ్ లో మనకు ఒక పెట్రోల్ మరియు రెండు డీజల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అయితే, మారుతి సుజుకి ఇటీవల తాము డీజల్ ఇంజన్ ఉత్పత్తిని ఆపివేస్తున్నట్లు ప్రకటించింది కాబట్టి భవిష్యత్తులో అమ్మకానికి ఒక పెట్రోల్ వేరియంట్ మాత్రమే ఉండ వచ్చు.

ప్రత్యర్థులకు పోటీగా కొత్త వెర్షన్ తో మారుతీ సుజుకి సియాజ్

కొత్త బిఎస్-6 సియాజ్ మోడల్ లో అప్డేటెడ్ అయిన ఇంజిన్ మాత్రమే కొత్త ఫీచర్ గా ఉంటుంది. ఈ సెడాన్ యొక్క డిజైన్ మరియు స్టైలింగ్ కు మరే ఇతర మార్పులు చేర్పులు ఉండవు. అదనంగా, ఇది మారుతి యొక్క నెక్స డీలర్ షిప్ ల ద్వారా ప్రత్యేకంగా అమ్మకానికి వెళ్లనుంది.

ప్రత్యర్థులకు పోటీగా కొత్త వెర్షన్ తో మారుతీ సుజుకి సియాజ్

సియాజ్ యొక్క ఇంటీరియర్లలో ఆపిల్ కారప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, ఒక క్రూయిజ్ నియంత్రణ వ్యవస్థ, లెదర్ సీట్లు, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎల్ఈడి డ్రిల్స్, ఆటోమ్యాటిక్ క్లయిమేట్ కంట్రోల్, ఒక స్మార్ట్ ప్లే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ వ్యవస్థ వంటి వివిధ సౌకర్యాలను కలిగి ఉంటుంది మరియు రియర్ ఎయిర్ కండిషనింగ్ వెంట్ లు కూడా ఉండబోతున్నాయి.

ప్రత్యర్థులకు పోటీగా కొత్త వెర్షన్ తో మారుతీ సుజుకి సియాజ్

భద్రత నిబంధనలకు అనుగుణంగా కొత్త మారుతి సియజ్ లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఎబిఎస్ తో ఈబిడి, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్, ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ వార్నింగ్ అలర్ట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు కొనసాగుతాయి.

ప్రత్యర్థులకు పోటీగా కొత్త వెర్షన్ తో మారుతీ సుజుకి సియాజ్

ఇప్పుడు బిఎస్-6 ఉద్గార ప్రమాణాలు ఉన్న అన్ని ఆటోమొబైల్స్ విషయానికి వస్తే, కొత్త సియాజ్ ధర పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం మారుతి సుజుకి సియాజ్ రూ.8.19 నుండి రూ.11.38 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య ఉండగా, బిఎస్-6 ఉద్గార ప్రమాణాలతో ఈ మోడల్ సుమారుగా రూ.15,000 ప్రీమియం ధర ఉంటుందని మేం ఆశిస్తున్నాం.

ప్రత్యర్థులకు పోటీగా కొత్త వెర్షన్ తో మారుతీ సుజుకి సియాజ్

ఇదంతా ప్రస్తుతానికి ఊహాగానాలే అయినప్పటికీ మారుతీ సుజుకి తయారీదారి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు, కనీస వివరాలు కూడా తెలియలేదు. మారుతీ సుజుకి నుంచి 105 బిహెచ్పి కంటే ఎక్కువ ఆఫర్ చేసే వేహికల్ ని కంపెనీ చేస్తుందని మేం ఆశిస్తున్నాం. దాని సైజు కు తగ్గట్టుగా సియాజ్ కావలసిన ఇంజిన్ మరియు కొత్త అప్డేట్ లను ఇస్తుందని అనుకొంటున్నాము.

Most Read Articles

English summary
Making Way For The BS-VI Compliant Ciaz — Launch Details And Specs - Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X