మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారు ధర పెరిగింది.. గమనించారా?

మారుతి సుజుకి తమ వ్యాగన్ఆర్ కారు ధరలు స్వల్పంగా పెంచింది. ఉన్నట్లుండి ఈ మోడల్ ధర మాత్రమే పెంచడానికి కారణమేంటా అని ఆలోచిస్తున్నారా..? మీ డౌటు నిజమే, మారుతి వ్యాగన్ఆర్ కారును బిఎస్-6 వెర్షన్‌లో నిశ్శబ్దంగా మార్కెట్లోకి లాంచ్ చేసింది. బిఎస్-6 మారుతి వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 4.42 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది, అంటే మునుపటి వెర్షన్ కంటే రూ. 8 వేలు ఎక్కువగా ఉంది.

బిఎస్-6 అంటే ఏమిటి? పాత వెర్షన్ మరియు కొత్త వెర్షన్‌ మధ్యనున్న తేడా ఏంటో చూద్దాం రండి..

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారు ధర పెరిగింది.. గమనించారా?

పాత వెర్షన్ చెప్పుకునే బిఎస్-4 మరియు కొత్త వెర్షన్ అయిన బిఎస్-6 వ్యాగన్ఆర్ రెండు మోడళ్లలో కూడా అదే 1.0-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ ఉంది. అయితే, భారత ప్రభుత్వం ఏప్రిల్ 01, 2020 నుండి మార్కెట్లో అమ్ముడయ్యే ప్రతి కారు కూడా బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటించాలని పేర్కొంది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారు ధర పెరిగింది.. గమనించారా?

బిఎస్-4 ప్రమాణాలతో పోల్చుకుంటే.. బిఎస్-6 వెర్షన్‌లో ఇంజన్‌‌లు ఉద్గారించే కాలుష్య కారకాల సంఖ్య తక్కువగా ఉంటుంది. యూరోపియన్ దేశాల్లో అమల్లో ఉన్న ప్రమాణాలకు భారత్ స్టేజ్-6 రూల్స్‌ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. బిఎస్-4 కార్లతో పోల్చుకుంటే బిఎస్-6 కార్ల ఒక రకంగా పర్యావరణానికి మంచివనే చెప్పాలి.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారు ధర పెరిగింది.. గమనించారా?

మారుతి వ్యాగన్ఆర్ టాప్ ఎండ్ వేరియంట్ VXi+ మినహాయిస్తే, మిగతా అన్ని వేరియంట్లు బిఎస్-6 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తున్నాయి. బిఎస్-6 ఇంజన్‌తో లభించే వేరియంట్ల ధర శ్రేణి రూ. 4.42 లక్షల నుండి రూ. 5.41 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారు ధర పెరిగింది.. గమనించారా?

బిఎస్-6 నూతన ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఇంజన్‌‌ను అభివృద్ది చేసినప్పటికీ, ఇంజన్ ఇచ్చే పవర్ మరియు టార్క్‌లలో ఎలాంటి మార్పులు జరగలేదు. వ్యాగన్ఆర్ లోని 998సీసీ సామర్థ్యం గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారు ధర పెరిగింది.. గమనించారా?

మారుతి సుజుకి ఇటీవల విడుదల చేసిన మారుతి ఎస్-ప్రెస్సో స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారులో కూడా ఇదే ఇంజన్ ఉంది. మారుతి వ్యాగన్ఆర్ 1.0-లీటర్ ఇంజన్‌తో పాటు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో కూడా లభ్యమవుతోంది, ఇది కూడా బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటిస్తుంది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారు ధర పెరిగింది.. గమనించారా?

మారుతి వ్యాగన్ఆర్ పవర్‌ఫుల్ వెర్షన్‌లోని 1.2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 82బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ అనుసంధానంతో లభిస్తోంది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారు ధర పెరిగింది.. గమనించారా?

మారుతి వ్యాగన్ఆర్ కారులో బిఎస్-6 ఇంజన్ అందివ్వడం మినహాయిస్తే మరెలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇది వరకు లభించే అన్ని ఫీచర్లు ఇందులో యధావిధగా లభిస్తాయి.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారు ధర పెరిగింది.. గమనించారా?

మారుతి వ్యాగన్ఆర్ ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్. వ్యాగన్ఆర్ కారు చాలా ఏళ్ల క్రితమే దేశీయ మార్కెట్లోకి విడుదలయ్యింది, ఇప్పుడు మూడవ తరం (థర్డ్ జనరేషన్) వ్యాగన్ఆర్ మోడల్ అమ్ముడవుతోంది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ కారు ధర పెరిగింది.. గమనించారా?

మారుతి వ్యాగన్ఆర్ గత అక్టోబర్ 2019 నెలలో 14,359 యూనిట్లు అమ్ముడయ్యి, భారతదేశపు టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో నిలిచింది. అంతే కాకుండా, గత ఆరు నెలలుగా వరుసగా ఆరవ బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది.

Most Read Articles

English summary
Maruti WagonR 1.0-Litre BS6 Engine Launched In India: Prices Start At Rs 4.42 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X