Just In
- 9 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 11 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 12 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 12 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హ్యుందాయ్ ఎలంట్రా మళ్లీ విడుదల: ప్రత్యేకతలేంటో చూద్దాం రండి!
హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త ఎలంట్రా సెడాన్ కారును మళ్లీ లాంచ్ చేసింది. హ్యుందాయ్ ఎలంట్రా సెడాన్ ప్రారంభ ధర రూ. 15.89 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఖరారు చేశారు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర 20.39 లక్షలుగా ఉంది. ఎలంట్రా లగ్జరీ సెడాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి...

హ్యుందాయ్ ఎలంట్రా సెడాన్ కారు నాలుగు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. వేరియంట్ల మరియు వాటి ధరలు ఇలా ఉన్నాయి..
వేరియంట్లు | ధరలు |
S | Rs 15.89 Lakh |
SX | Rs 18.49 Lakh |
SX AT | Rs 19.49 Lakh |
SX(O) AT | Rs 20.39 Lakh |

హ్యుందాయ్ ఎలంట్రా సెడాన్ కారులో ఫేస్‍లిఫ్ట్ వెర్షన్‌కు కావాల్సిన ఎన్నో అప్‌డేట్స్ జరిగాయి. మార్కెట్లో సరైన పోటీని నెలకొల్పేందుకు సరికొత్త ఎలంట్రాలో ఎన్నో అత్యాధునిక ఫీచర్లు మరియు నూతన టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇంజన్ స్పేసిఫికేషన్స్ మరియు సరికొత్త డిజైన్ ఫిలాసఫీలో భారీ మార్పులే జరిగాయి.

ఎలంట్రా డిజైన్ విషయానికి వస్తే, క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్, అధునాతన హెడ్‌ల్యాంప్ క్లస్టర్, సరికొత్త డే టైం రన్నింగ్ ల్యాంప్స్, త్రిభుజాకారంలో ఉన్న ఫాగ్ ల్యాంప్స్ మరియు కొత్త డిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్ వచ్చాయి. అంతే కాకుండా ముందు మరియు వెనుకవైపున రీడిజైన్ చేయబడిన బంపర్లు మరియు కొత్త స్టైల్లో రూపొందించిన ఎల్ఈడీ టైయిల్ ల్యాంప్స్ వచ్చాయి.

సరికొత్త హ్యుందాయ్ ఎలంట్రా సెడాన్ ఇంటీరియర్ విషయానికి వస్తే పూర్తి స్థాయిలో అప్‌డేట్ జరిగిన క్యాబిన్ చూడవచ్చు. 8.0-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వచ్చింది. ఇది ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10-రకాలుగా అడ్దెస్ట్ చేసుకునే డ్రైవర్ సీటు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, హ్యాండ్స్ ఫ్రీ టెయిల్ గేట్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఎన్నో ఫీచర్లు ఇందులో వచ్చాయి.

సేఫ్టీ విషయానికి వస్తే సరికొత్త హ్యుందాయ్ ఎలంట్రా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, రియర్ పార్కింగ్ కెమెరా, హై-స్పీడ్ వార్నింగ్, సీట్ బెల్ట్ రిమైండర్, హిల్-హోల్డ్ అసిస్ట్ మరియు వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి భద్రతా ఫీచర్లు అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా వచ్చాయి.

సాంకేతికంగా హ్యుందాయ్ ఎలంట్రా సెడాన్ ఒక్క ఇంజన్‌తో మాత్రమే లభ్యమవుతోంది. ఇందులోని 2.0-లీటర్ కెపాసిటీ సామర్థ్యం ఉ్నన పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 152బిహెచ్‌పి పవర్ మరియు 192ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ అనే ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. ఏప్రిల్ 2020 నుండి అమల్లోకి వచ్చే బిఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఇంజన్‌ను అప్‌గ్రేడ్ చేశారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
హ్యుందాయ్ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో ఎలంట్రా సెడాన్ కారును అంతర్జాతీయంగా ప్రదర్శించింది. కొరియన్ దిగ్గజం హ్యుందాయ్ ఎట్టకేలకు తమ సరికొత్త ఎలంట్రా కారును ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. హ్యుందాయ్ ఎలంట్రా పాపులర్ సెడాన్ మోడల్. ఇది దేశీయ మార్కెట్లో ఉన్న హోండా సివిక్, స్కోడా ఆక్టావియా మరియు టయోటా కరోలా ఆల్టిస్ వంటి ప్రీమియం సెడాన్ కార్లకు గట్టి పోటీనిస్తోంది.