2020కి డీజిల్ ఇంజిన్లను నిలిపివేయనున్న రెనాల్ట్!

ఆటో మోటార్స్ ఇండియా నుండి వచ్చిన నివేదికల ప్రకారం రెనాల్ట్ రాబోయే సంవత్సరంలో డీజిల్ తో నడిచే వాహనాల యొక్క మోడళ్ల ఉత్పత్తులను నిలిపివేయనున్నట్లు చెబుతున్నారు. బిఎస్ -6 యొక్క కొత్త ఉద్గార నిబంధనలను అమలుచేసిన తర్వాత డీజిల్ ఇంజిన్లయొక్క ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు తెలుస్తుంది. డీజిల్ ఇంజిన్లను నిలిపివేసిన తరువాత 2020 ఏప్రిల్ నుంచి రెనాల్ట్ కంపెనీ పెట్రోల్ తో నడిచే వాహనాలను మాత్రమే విక్రయిస్తుందని ఫ్రెంచ్ బ్రాండ్ నిర్దారించింది.

2020కి డీజిల్ ఇంజిన్లను నిలిపివేయనున్న రెనాల్ట్!

రెనాల్డ్ ప్రస్తుతం రెండు రకాలైన డీజిల్ తో నడిచే వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. అవి డస్టర్ మరియు లాడ్జి క్యాప్టూర్ వంటి మోడళ్ళు. ఇప్పుడు కొన్ని కఠినమైన నిబంధనలు ప్రవేశపెట్టడంతో డీజిల్ తో నడిచే ఈ వాహనాలను నవీనీకరించడం సాధ్యం కాదు.

2020కి డీజిల్ ఇంజిన్లను నిలిపివేయనున్న రెనాల్ట్!

డీజిల్ ఇంజన్లను నిలిపివేయడంతో పాటు భారతీయ మార్కెట్లో లాడ్జీ ఎమ్‌పివి ఉత్పత్తి మరియు అమ్మకాలను నిలిపివేస్తామని రెనాల్ట్ ధృవీకరించింది. ప్రస్తుతం 1.5-లీటర్ కె 9 కె డీజిల్ యూనిట్ ద్వారా శక్తినిచ్చే రెనాల్ట్ లాడ్జి పూర్తిగా బ్రాండ్ యొక్క పోర్ట్‌ఫోలియో నుండి నిలిపివేయబడుతుంది.

2020కి డీజిల్ ఇంజిన్లను నిలిపివేయనున్న రెనాల్ట్!

రెనాల్ట్ ఇండియా సీఈఓ "వెంకట్రామ్ మామిళ్ళపల్లె" మాటాడుతూ ఇకపై డీజిల్ ఇంజిన్లతో నడిచే వాహనాలను తయారు చేసే ఆలోచన కంపెనీకి లేదని చెప్పారు. రెనాల్ట్ బ్రాండ్ నుండి భవిష్యత్ లో వచ్చే అన్ని వాహనాలు ప్రీమియం క్యాప్టూర్ ఎస్‌యూవీతో సహా అన్నింటికీ పెట్రోల్ ఇంజిన్లు మాత్రమే ఉంటాయి అని నిర్థారించారు. రెనాల్ట్ లాడ్జి యొక్క ఉత్పత్తి ఇకపై ముగుస్తుంది అని ఈ మోడల్ ను పునరుద్దరించే ప్రణాళికలు ఏ మాత్రం లేవు అని స్పష్టం చేసారు.

2020కి డీజిల్ ఇంజిన్లను నిలిపివేయనున్న రెనాల్ట్!

ప్రస్తుత 1.5-లీటర్ కె 9 కె డీజిల్ ఇంజన్ లాడ్జీకి శక్తినిస్తుంది 1461 సిసి నాలుగు సిలిండర్ యూనిట్ రూపంలో వస్తుంది. ఇది 108బిపిహెచ్ మరియు 245ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

2020కి డీజిల్ ఇంజిన్లను నిలిపివేయనున్న రెనాల్ట్!

డీజిల్ ఇంజన్లు మరియు లాడ్జీల ఉత్పత్తిని నిలిపివేయడమే కాకుండా, త్వరలో రాబోతున్న బిఎస్- VI ఉద్గార నిబంధనలకు అనుగుణంగా వారి తాజా సబ్ -4 మీటర్ కాంపాక్ట్-ఎంపివి అప్‌డేట్ అవుతుందని రెనాల్ట్ ధృవీకరించింది. రెనాల్ట్ జనవరి 2020 లో బిఎస్ 6 ట్రైబర్ ఎమ్‌పివిని భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు మనకు తెలుస్తుంది.

Read More:2 సంవత్సరాల వారంటీని 4 సంవత్సరాలకు పెంచిన రాయల్ ఎన్ఫీల్డ్!

2020కి డీజిల్ ఇంజిన్లను నిలిపివేయనున్న రెనాల్ట్!

రెనాల్ట్ లాడ్జీ డీజిల్ ఇంజిన్‌లపై ఆలోచనలు:

ఇప్పుడు రెనాల్ట్ భారత మార్కెట్లో డీజిల్ ఇంజిన్‌ల ఉత్పత్తికి దూరంగా ఉంది. డీజిల్ ఇంజిన్ యొక్క నవీకరణలకు పెట్రోల్ యూనిట్ల కంటే ఎక్కువ పెట్టుబడి అవసరం కాబట్టి వీటి ఉత్పత్తిని విరమించుకున్నారు. మరోవైపు రెనాల్ట్ లాడ్జీ దేశంలో అమ్మకాల కోసం చాలా కష్టపడుతోంది. కాబట్టి ఈ వాహనాలను ఇంకా తయారుచేయడం నిరర్ధకం అనే చెప్పాలి.

Read More:ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల యొక్క అమ్మకాల పరిస్థితి

Most Read Articles

English summary
Renault To Discontinue Diesel Engines From April 2020: Will Discontinue Lodgy From Product Portfolio- Read in Telugu
Story first published: Friday, December 27, 2019, 9:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more