గుడ్‌న్యూస్ ప్రకటించిన రెనో: 5 లక్షలకే 7-సీటర్ ట్రైబర్ కారు!

ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ ప్రకటించింది. అవును, రెనో ఇండియా విభాగం అత్యంత సరసమైన ధరలో ఇటీవల లాంచ్ చేసిన ట్రైబర్ ఎంపీవీ (మల్టీ-పర్పస్-వెహికల్) డెలివరీ ప్రారంభించినట్లు ప్రకటించింది. ట్రైబర్ కారును ఇది వరకే బుక్ చేసుకున్నట్లు కస్టమర్లకు డెలివరీ ఇస్తోంది.

గుడ్‌న్యూస్ ప్రకటించిన రెనో: 5 లక్షలకే 7-సీటర్ ట్రైబర్ కారు!

రూ. 5 లక్షల - రూ. 6.5 లక్షల ధరల శ్రేణిలో విడుదలైన రెనో ట్రైబర్ 7-సీటర్ మారుతి సుజుకి ఎర్టిగా మరియు ఇతర ఎంపీవీ కార్లకు గట్టి పోటీనిస్తోంది. ఇది నాలుగు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది.

గుడ్‌న్యూస్ ప్రకటించిన రెనో: 5 లక్షలకే 7-సీటర్ ట్రైబర్ కారు!

రెనో ట్రైబర్ ఎంపీవీ సాంకేతికంగా 1.0-లీటర్ కెపాసిటీ గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌తో లభ్యమవుతోంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 72బిహెచ్‌పి పవర్ మరియు 96ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అతి త్వరలో ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందివ్వాలని భావిస్తోంది.

గుడ్‌న్యూస్ ప్రకటించిన రెనో: 5 లక్షలకే 7-సీటర్ ట్రైబర్ కారు!

రెనో ట్రైబర్ సకుటుంబ సమేతంగా ప్రయాణించాలనుకునే మిడిల్-క్లాస్ ఫ్యామిలీకి బెస్ట్ ఛాయిస్, ఇందులో 7-మంది ప్రయాణించవచ్చు,విశాలమైన క్యాబిన్, అత్యుత్త గ్రౌడ్ క్లియరెన్స్ మరియు మెరుగైన లగేజ్ స్పేస్ కలదు.

గుడ్‌న్యూస్ ప్రకటించిన రెనో: 5 లక్షలకే 7-సీటర్ ట్రైబర్ కారు!

రెనో ట్రైబర్ ఎంపీవీ డిజైన్ పరంగా చూస్తే కొద్దిగా క్విడ్ కారునే పోలి ఉంటుంది. నిజానికి ట్రైబర్ కారును క్విడ్ కారును తయారు చేసిన ఫ్లాట్‌ఫామ్ మీదనే డెవలప్ చేశారు. కండలు తిరిగిన శరీరాకృతితో రోడ్డుపై చక్కటి హుందాతనాన్ని ప్రదర్శిస్తుంది.

గుడ్‌న్యూస్ ప్రకటించిన రెనో: 5 లక్షలకే 7-సీటర్ ట్రైబర్ కారు!

రెనో ట్రైబర్ ఇంటీరియర్‌ చూడటానికి లగ్జరీగా ఉంటుంది. రెనో మీడియా నవ్ ఇంటర్‌ఫేస్ ఆధారంగా పనిచేసే టచ్-స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఇది జీపీఎస్ న్యావిగేషన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది.

గుడ్‌న్యూస్ ప్రకటించిన రెనో: 5 లక్షలకే 7-సీటర్ ట్రైబర్ కారు!

ప్యాసింజర్ల భద్రత పరంగా ఇందులో రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సీట్ బెల్ట్ రిమైండర్లు, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, హై స్పీడ్ అలర్ట్స్, మరియు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. వీటన్నింటినీ ట్రైబర్ లభించే అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా అందించారు.

గుడ్‌న్యూస్ ప్రకటించిన రెనో: 5 లక్షలకే 7-సీటర్ ట్రైబర్ కారు!

రెనో ట్రైబర్ 7-సీటర్ కారును రెనో షోరూముల్లో లేదా రెనో కంపెనీ వెబ్‌సైట్లో రూ. 11,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అన్ని వేరియంట్ల మీద 15 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు రెనో డీలర్లు డ్రైవ్‌స్పార్క్‌కు స్పష్టం చేశారు.

గుడ్‌న్యూస్ ప్రకటించిన రెనో: 5 లక్షలకే 7-సీటర్ ట్రైబర్ కారు!

రెనో ఇండియా ట్రైబర్ కారును ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం వ్యూహాత్మకంగా తీసుకొచ్చింది. ఏడాదికి 2 లక్షల కార్లను విక్రయించాలనే కంపెనీ లక్ష్యంలో భాగంగానే ఈ మోడల్‌ను తీసుకొచ్చారు. రానున్న కాలంలో మరిన్ని ఉత్పత్తులను లాంచ్ చేయాలని భావిస్తోంది. అంతే కాకుండా 18 రాష్ట్రాల్లో ఉన్న 330 చిన్నపాటి నగరాలకు తమ కార్యకలాపాలను విస్తరించాలనే లక్ష్యంతో ఉంది.

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
Renault Triber Deliveries Commence In India: Bookings & Other Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X