భారతదేశం నుండి దక్షిణాఫ్రికాకు ఎగుమతవుతున్న రెనాల్ట్ ట్రైబర్!

భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న చాల రకాల వాహనాలలో రెనాల్ట్ ట్రైబర్ ఒకటి. ఇవి ప్రస్తుతం మన దేశంలో దాదాపు 20,000 కి పైగా ఉన్నాయని, ఈ సంఖ్యలు ఇతర విదేశీ మార్కెట్లలో కూడా విజయవంతంగా పెంచాలని రెనాల్ట్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ "శ్రీ వెంకట్రామ్ మామిల్లపల్లె" అన్నారు. ప్రాంతీయ సహకార దేశాల కోసం ఆఫ్రికన్ మరియు దక్షిణ ఆసియా అసోసియేషన్ వారు రెనాల్ట్ ట్రైబర్లను దిగుమతి చేసుకుంటున్నారు.

భారతదేశం నుండి దక్షిణాఫ్రికాకు ఎగుమతవుతున్న రెనాల్ట్ ట్రైబర్!

రెనాల్ట్ ట్రైబర్ దాని అండర్‌పిన్నింగ్స్‌ను క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌తో పంచుకుంటుంది. ట్రైబర్ వాహనాలు సంస్థ యొక్క సిఎంఎఫ్-ఎ నిర్మాణంపై నిర్మించబడ్డాయి. ఇవి డాట్సన్ రెడి-జిఓలో కూడా కనిపిస్థాయి.

భారతదేశం నుండి దక్షిణాఫ్రికాకు ఎగుమతవుతున్న రెనాల్ట్ ట్రైబర్!

ఇప్పుడు దాదాపుగా ఎక్కువమంది ప్రయాణికులకు ప్రయాణించడానికి అనుకూలంగా తయారు చేసే వాహనాలలో ఎక్కువ సీట్లు ఉండేట్లు తయారుచేస్తున్నారు. ఆరు సీట్లు ఉన్న వాహనాలు మరియు అంతకంటే తక్కువ సెట్లు ఉన్న వాహనాలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. కానీ రాబోయే తరాలకు ఉపయోగపడేవిధంగా ఇప్పుడు రెనాల్ట్ ట్రైబర్ ఏడు సీట్ల విభాగాన్ని తయారు చేసింది. ఏడు సీట్ల విభాగంలో చాల తొందరగా ఇది అభివృద్ధి చెందుతోంది.

భారతదేశం నుండి దక్షిణాఫ్రికాకు ఎగుమతవుతున్న రెనాల్ట్ ట్రైబర్!

ఏడు సీట్ల విభాగంలో ట్రైబర్ బాగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఈ విభాగంలో మొదటి స్థానం మాత్రం మారుతి సుజుకి ఎర్టిగా కైవసం చేసుకుంది. ఏది ఏమైనా ఏడు సీట్లు కలిగిన వాహనాలలో ఎర్టిగా బాగా అభివృద్ధి చెందగా దాని తరువాత స్థానానికి మాత్రం రెనాల్ట్ ట్రైబర్ ఆక్రమించింది. ఇది బహుళ ప్రయానికులకు బాగా అనుకూలమైన వాహనం.

భారతదేశం నుండి దక్షిణాఫ్రికాకు ఎగుమతవుతున్న రెనాల్ట్ ట్రైబర్!

రెనాల్ట్ ట్రైబర్‌లో పెద్ద ఫ్రంట్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్‌తో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు మరియు సొగసైన టెయిల్ లైట్లు ఉన్నాయి. ఎంపివి లో పెద్ద సెంట్రల్ ఎయిర్ డ్యామ్ మరియు 14-అంగుళాల డ్యూయల్-టోన్ వీల్స్ వంటివి ఉన్నాయి

భారతదేశం నుండి దక్షిణాఫ్రికాకు ఎగుమతవుతున్న రెనాల్ట్ ట్రైబర్!

ఇంటీరియర్స్ డాష్‌బోర్డ్‌ నలుపు మరియు లేత గోధుమరంగును కలిగి ఉంటుంది. ట్రైబర్లో 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఎల్‌ఈడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కూల్డ్ స్టోరేజ్ స్పేస్ ఇంకా స్మార్ట్ యాక్సెస్ కీ కార్డ్ ఉన్నాయి. ఇందులో ఇంకో చెప్పుకోవలసిన ప్రత్యేకత ఏమిటంటే రెండవ మరియు మూడవ వరుస సీట్లలో ఉండే ప్రయాణికుల కోసం ఎయిర్ కండిషనింగ్ వెంట్స్‌ వంటి సౌకర్యాలు వుంటాయి.

భారతదేశం నుండి దక్షిణాఫ్రికాకు ఎగుమతవుతున్న రెనాల్ట్ ట్రైబర్!

రెనాల్ట్ ట్రైబర్ ఒకే ఇంజన్ ఎంపికతో వస్తుంది. 1.0-లీటర్ మూడు సిలిండర్, బిఎస్ 4 పెట్రోల్ ఇంజన్ 72 బిహెచ్‌పి శక్తిని మరియు 96 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కి జతచేయబడుతుంది.

Read More:బిఎస్-6 ద్విచక్ర వాహనాల అమ్మకాలలో 60,000 యూనిట్ల మైలురాయి దాటి కొత్త శకాన్ని ప్రారంభించనున్న హోండా!

భారతదేశం నుండి దక్షిణాఫ్రికాకు ఎగుమతవుతున్న రెనాల్ట్ ట్రైబర్!

2020 ప్రారంభంలో బిఎస్ 6 కంప్లైంట్ ఇంజిన్ లాంచ్ అవుతుందని మరియు ట్రైబర్ కంపెనీ అభివృద్ధి కోసం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్‌లో కూడా పనిచేస్తోంది. ప్రస్తుత తరం రెనాల్ట్ ట్రైబర్ ఎమ్‌పివి ధర రూ. 4.95 లక్షల నుంచి రూ. 6.63 లక్షల మధ్య ఉంటుంది.

Read More:2020 ఆటో ఎక్స్‌పోలో ప్రారంభించనున్న కొత్త టాటా టిగోర్

భారతదేశం నుండి దక్షిణాఫ్రికాకు ఎగుమతవుతున్న రెనాల్ట్ ట్రైబర్!

రెనాల్ట్ ఎగుమతి గురించి ఆలోచనలు:

మనదేశం నుంచి ఇతర దేశాలకు ఎక్కువగా అమ్ముడుపోయిన కార్లలో రెనాల్ట్ ట్రైబర్ ఒకటి. రెనాల్డ్ ఇప్పుడు దక్షిణాఫ్రికా దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు. ఇప్పటిదాకా కూడా ట్రైబర్ ఇతర దేశాలకు ఒక నిర్దిష్ట మోడెల్లో ఎగుమతి చేయడం జరుగుతోంది. ఒక నిర్దిష్ట మోడల్‌ను ఎగుమతి చేయడం అంటే మోడల్ దేశీయంగా సాధించిన విజయం అని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే వాహనం మార్కెట్లో బాగా అమ్ముడుపోయే సామర్త్యాన్ని కలిగి ఉంటుంది. రెనాల్డ్ ఇప్పుడు బాగా అమ్ముడవుతున్న వాహనం. దక్షిణాఫ్రికాలో ఈ రెనాల్ట్ ఇంకా బాగా అమ్ముడుపోతుందని నిర్వహణ వర్గాలు ఆశిస్తున్నాయి.

Most Read Articles

English summary
Renault Triber MPV Exports From India: 600 Units To South Africa- Read in Telugu
Story first published: Thursday, December 26, 2019, 12:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X