టయోటాకు మళ్లీ గట్టి ఎదురుదెబ్బ

టయోటా కిర్లోస్కర్ కంపెనీ 2019 నవంబరులో విక్రయించిన కార్ల సేల్స్ రిపోర్ట్ వచ్చింది. టయోటా సేల్స్ గతంతో పోలిస్తే నమ్మశక్యంగాని విధంగా భారీగా తగ్గిపోయాయి. ఇండియాలో అతి పెద్ద నెట్‌వర్క్ ఉన్న టయోటా దేశీయంగా విక్రయించిన కార్ల కంటే విదేశాలకే ఎక్కువగా ఎగుమతి చేసింది.

టయోటాకు మళ్లీ గట్టి ఎదురుదెబ్బ

2018 నవంబరు నెలలో 10,721 యూనిట్లను విక్రయించిన టయోటా 2019 నంవబరులో 8,312 యూనిట్ల విక్రయించి దేశీయ విక్రయాల్లో 22శాతం పడిపోయాయి. అయితే గత ఏడాది నవంబరులో 669 కార్లను విదేశాలకు ఎగుమతి చేసిన టయోటా ఈ యేడు 929 కార్లను ఎగుమతి చేసి 39శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

టయోటాకు మళ్లీ గట్టి ఎదురుదెబ్బ

టయోటా మోటార్స్ దేశీయ సేల్స్ మరియు ఎగుమతులతో కలుపుకొని మొత్తం 9,241 కార్లను విక్రయించింది, గత ఏడాది ఇదే నెలలో 11,390 యూనిట్ల సేల్స్‌తో పోల్చుకుంటే ఓవరాల్ సేల్స్ 19శాతం వరకు పడిపోయాయి.

టయోటాకు మళ్లీ గట్టి ఎదురుదెబ్బ

సియామ్ విడుదల చేసిన నవంబర్ సేల్స్ రిపోర్ట్ గణాంకాల గురించి టయోటా కిర్లోస్కర్ మోటార్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్. రాజా మాట్లాడుతూ, "2019లో దేశీయ ఆటోమొబైల్ రంగం తీవ్ర ఒడిదుడుకు ఎదుర్కొంది, అంతే కాకుండా త్వరలో అన్ని మోడళ్లను బిఎస్-6 వెర్షన్‌లో ప్రవేశపెడుతున్నాము ఈ నేపథ్యంలో బిఎస్-4 కార్ల స్టాక్ ఎక్కువ లేకుండా డీలర్ల మీద ఒత్తిడి తగ్గించేందుకు ప్రయత్నించాము, ఇందుకు తగ్గట్లుగా ప్రొడక్షన్ చేపడుతున్నట్లు వివరించారు."

టయోటాకు మళ్లీ గట్టి ఎదురుదెబ్బ

టయోటా ఇండియన్ మార్కెట్లో విక్రయించిన కార్లలో ఇన్నోవా క్రిస్టా అగ్రస్థానంలో నిలిచింది. 2019 నవంబరులో ఇన్నోవా క్రిస్టా ఎంపీవీ 3,414 యూనిట్లు అమ్ముడవ్వగా క్రితం ఏడాది ఇదే నవంబరులో 3,141 యూనిట్లను విక్రయించారు.

టయోటాకు మళ్లీ గట్టి ఎదురుదెబ్బ

టయోటా ఇన్నోవా క్రిస్టా ఇప్పటి వరకు ఎలాంటి ధీటైన పోటీ లేకుండా మంచి ఫలితాలే సాధిస్తోంది. అయితే, ఈ సెగ్మెంట్లో ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కియా మోటార్స్ కియా కార్నివాల్ అనే ఎంపీవీని ఇన్నోవా క్రిస్టాకు సరాసరి పోటీగా తీసుకొస్తోంది. 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో దీనిని ఆవిష్కరించనుంది. వీలైనంత వరకు మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

టయోటాకు మళ్లీ గట్టి ఎదురుదెబ్బ

జపాన్ దిగ్గజం టయోటా రెండవ బెస్ట్ సెల్లింగ్ కారు, టయోటా గ్లాంజా. గడిచిన నవంబరులో 2,313 యూనిట్ల గ్లాంజా కార్లను విక్రయించింది. టయోటా ఇండియా మారుతి బాలెనో కార్లను సేకరించి రీ-బ్యాడ్జింగ్ వెర్షన్‌లో గ్లాంజా పేరుతో విక్రయిస్తోంది. ఈ మోడల్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో మంచి ఫలితాలు సాధిస్తోంది.

Most Read:2019 లో 10 టాప్ మోస్ట్ గూగిల్డ్ కార్స్

టయోటాకు మళ్లీ గట్టి ఎదురుదెబ్బ

టయోటా ఫార్చ్యూనర్ కంపెనీ యొక్క మూడవ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. నవంబర్ 2019లో 1,063 ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలను విక్రయించిన టయోటా క్రితం ఏడాది నవంబరులో నమోదైన 1,475 యూనిట్ల సేల్స్‌తో పోల్చుకుంటే 28 శాతం వరకు తగ్గముఖం పట్టాయి.

Most Read:రింగ్ రోడ్‌లో 10ఏళ్ల పిల్లవాడు కారుడ్రైవ్ చేస్తుండగా గుర్తించారు: వారికి విధించిన కాప్స్ ఇష్యూ చలాన్

టయోటాకు మళ్లీ గట్టి ఎదురుదెబ్బ

టయోటా సేల్స్ జాబితాలో నాలుగవ స్థానంలో నిలిచిన ఇటియోస్ లివా కంపెనీ యొక్క ఏకైక హ్యాచ్‌బ్యాక్ కారు. గత ఏడాది నవంబరులో 1,622 లివా కార్లను విక్రయించగా, ఈ యేడు కేవలం 913 యూనిట్ల సేల్స్ నమోదు చేసుకుని ఏకంగా 44 శాతం వరకు వృద్దిని నష్టపోయింది.

Most Read:కెటిఎమ్ 790 అడ్వెంచర్ కూడా వచ్చేసింది.. విడుదల ఎప్పుడంటే?

టయోటాకు మళ్లీ గట్టి ఎదురుదెబ్బ

టయోటా ఇటియోస్ సెడాన్ కంపెనీ యొక్క ఐదవ బెస్ట్ సెల్లింగ్ మోడల్. సొంత అవసరాలకు ఎంచుకునే కస్టమర్ల కంటే క్యాబ్ డ్రైవర్లు మరియు అద్దె కార్ల అవసరాలకే దీనిని ఎక్కువగా కొంటున్నారు. ఏదేమైనప్పటికీ గత ఏడాది నవంబరులో 1,389 ఇటియోస్ కార్లను విక్రయించిన టయోటా ఈ సంవత్సరంలో కేవలం 314 యూనిట్లనే విక్రయించి, 77శాతం వృద్దిని నష్టపోయింది.

టయోటాకు మళ్లీ గట్టి ఎదురుదెబ్బ

టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా విక్రయించిన యారిస్ మిడ్-సైజ్ సెడాన్, క్యామ్రీ హెబ్రిడ్ లగ్జరీ సెడాన్, కరోలా ప్రీమియం సెడాన్, వెల్‌ఫైర్ మరియు ప్రాడో లగ్జరీ ఎస్‌యూవీలు తర్వాతి స్థానంలో నిలిచాయి.

టయోటాకు మళ్లీ గట్టి ఎదురుదెబ్బ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టయోటా ఇండియా ఒక్క కాంపాక్ట్ ఎస్‌యూవీ మినహాయిస్తే దాదాపు అన్ని సెగ్మెంట్లలో ప్యాసింజర్ కార్లను విక్రయిస్తోంది. అయితే, మార్కెట్లో మారుతి, హ్యుందాయ్, టాటా, కొత్తగా వచ్చిన కియా మరియు ఎంజీ మోటార్ నుండి తీవ్ర పోటీని ఎదుర్కుంటోంది. దీంతో సేల్స్ టయోటా సేల్స్ నానాటికీ పడిపోతున్నాయి. దీనికి తోడు టయోటా నుండి ఎంతో కాలంగా ఎలాంటి కొత్త మోడళ్లు రాకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.

Most Read Articles

English summary
toyota 2019 november car-sales report-Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X