తిరుమల కొండపై తిరగనున్న ఎలక్ట్రిక్ బస్సులు.. ఎప్పటినుంచో తెలుసా?

ఇల వైకుంఠపురంగా విలసిల్లుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల వేంకటేశ్వరుని సన్నిధిలో ఎలక్ట్రిక్ బస్సులు తిరగనున్నాయి. తిరుమల కొండలకు సందర్శించే యాత్రికులకు అనుకూలమైన రవాణా కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ త్వరలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతుందని తిరుమటి తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.

తిరుమల కొండపై తిరగనున్న ఎలక్ట్రిక్ బస్సులు.. ఎప్పటినుంచో తెలుసా?

పరమ పావనమైన తిరుమల కొండను 'జీరో కార్బన్ ఎమిషన్ జోన్'గా నిచేయాలనే లక్ష్యంతో డీజిల్ వాహనాలను నిలిపివేసి వాటి స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుందని టిటిడి బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విలేకరులతో అన్నారు.

తిరుమల కొండపై తిరగనున్న ఎలక్ట్రిక్ బస్సులు.. ఎప్పటినుంచో తెలుసా?

తిరుమల కొండపై ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని టిటిడి చేసిన అభ్యర్థనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారని టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

MOST READ:బెంగళూరు నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో డైరెక్ట్ ప్లైట్ సర్వీస్.. ఎప్పటినుంచే తెలుసా ?

తిరుమల కొండపై తిరగనున్న ఎలక్ట్రిక్ బస్సులు.. ఎప్పటినుంచో తెలుసా?

ప్రస్తుతం ప్రారంభ దశలో సుమారు 100 నుండి 150 బస్సులను ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సర్వీసులోకి తీసుకువస్తుందని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం రోజురోజు ఎక్కువవుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా మద్దతు ఇస్తున్నాయి.

తిరుమల కొండపై తిరగనున్న ఎలక్ట్రిక్ బస్సులు.. ఎప్పటినుంచో తెలుసా?

ప్రభుత్వాలు ఇస్తున్న మద్దతు కారణంగా వాహన తయారీదారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. డీజిల్ వాహనాల వాళ్ళ రోజు రోజుకి వాతావరణం కాలుష్యం అవుతోంది. ఈ కాలుష్యాన్ని తగ్గించాలనే నెపంతో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ బస్సులను వినియోగిస్తుంది. తిరుమల కొండపై కూడా త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు తిరగనున్నాయి.

MOST READ:జోరందుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 బుకింగ్స్, ఇప్పటికి ఎన్నో తెలుసా?

తిరుమల కొండపై తిరగనున్న ఎలక్ట్రిక్ బస్సులు.. ఎప్పటినుంచో తెలుసా?

అనేక దశాబ్దాల చరిత్ర ఉన్న హిందూ ధార్మిక దేవాలయం తిరుమల. తిరుమలలో కూడా అప్పుడుడప్పుడూ కొన్ని మార్పులు చేర్పులు అవసరం, ఇప్పుడు అనేక దశాబ్దాల తరువాత దేవాలయంలోని మహా ద్వారాలు, పవిత్రమైన బలిపీఠం మరియు ద్వజస్థంభం వంటి వాటికి బంగారు పూత విస్తరించాలని టిటిడి బోర్డు నిర్ణయించింది.

తిరుమల కొండపై తిరగనున్న ఎలక్ట్రిక్ బస్సులు.. ఎప్పటినుంచో తెలుసా?

త్వరలో రానున్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ సారి పవిత్రమైన 'వైకుంఠ ద్వారాలు' ను వైకుంఠ ఏకాదశి రోజు నుండి సాధారణ రెండు రోజులకు బదులుగా పది రోజులు తెరిచి ఉంచాలని బోర్డు నిర్ణయించిందని కూడా చైర్మన్ తెలిపారు. పేదల కోసం ఉద్దేశించిన ఉచిత సామూహిక వివాహాల పథకాన్ని కొద తిరిగి ప్రవేశపెట్టాలని టిటిడి బోర్డు యోచిస్తోందని కూడా వారు తెలిపారు.

MOST READ:మీకు తెలుసా.. అక్కడ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌కే పూజలు, నైవేద్యాలు.. ఎక్కడో తెలుసా ?

Note: Images are representative purpose only

Most Read Articles

English summary
AP State Electric Buses To Ply On Tirumala Hills Soon. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X