భారత్‌లో ఆడి కస్టమర్ల కోసం 'రెడీ టూ డ్రైవ్' క్యాంపైన్ - వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి, భారత్‌లో '#ReadyToDrive' (రెడీ టూ డ్రైవ్) పేరిట ఓ కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్యాంపైన్ ద్వారా ఆడి ఇండియా తమ కస్టమర్లకు అనేక కొత్త సేవా కార్యక్రమాలు మరియు ఆఫ్టర్ సేల్స్ ప్రయోజనాలను అందించనుంది. ఈ క్యాంపైన్ సెప్టెంబర్ 30, 2020 వరకు కొనసాగుతుందని కంపెనీ పేర్కొంది.

భారత్‌లో ఆడి కస్టమర్ల కోసం 'రెడీ టూ డ్రైవ్' క్యాంపైన్ - వివరాలు

ఈ క్యాంపైన్‌లో భాగంగా, ఆడి సర్వీస్ సెంటర్లకు తమ కార్లను తీసుకువచ్చే కస్టమర్లు బ్రేక్ ప్యాడ్లు, బ్రేక్ డిస్క్‌లు మరియు బ్రేక్ ప్యాడ్ సెన్సార్లు, ఆడి అసలైన ఉపకరణాలు మరియు వస్తువులు, మై ఆడి కనెక్ట్ (డాంగిల్), పొడిగించిన వారంటీ, సర్వీస్ ప్లాన్స్, కాంపర్హెన్సివ్ సర్వీస్ వ్యాల్యూ ప్యాకేజ్ వంటి వస్తువులపై ప్రయోజనాలు మరియు రాయితీలను పొందవచ్చు.

భారత్‌లో ఆడి కస్టమర్ల కోసం 'రెడీ టూ డ్రైవ్' క్యాంపైన్ - వివరాలు

పైన పేర్కొన్న కొన్ని వస్తువులపై కస్టమర్లు 20 శాతం నుండి 50 శాతం వరకు మినహాయింపు పొందవచ్చు. అలాగే, ఈ క్యాంపైన్ ప్రారంభంలో ఐదేళ్ల కంటే పాత కార్లపై కాంప్లిమెంటరీ ల్యూబ్ సర్వీస్ చేయనున్నట్లు ఆడి ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.

ఆడి ఇండియా ఇటీవలే దేశవ్యాప్తంగా తమ కస్టమర్ల కోసం దాని 'మై ఆడి కనెక్ట్' యాప్ యొక్క అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసింది. అప్‌డేట్ చేయబడిన కొత్త 'myAudi Connect' యాప్ ఇప్పుడు కస్టమర్లు మరియు ఆడి అభిమానుల యొక్క అన్ని అవసరాలను కూడా తీరుస్తుంది. ఈ లేటెస్ట్ వెర్షన్ యాప్‌లో అనేక కొత్త అదనపు ఫంక్షన్లను కలిగి ఉంటుంది.

MOST READ:ఇప్పుడు పియుసిసి లేని వాహనాలకు భారీ జరిమానా : ఎంతో తెలుసా ?

భారత్‌లో ఆడి కస్టమర్ల కోసం 'రెడీ టూ డ్రైవ్' క్యాంపైన్ - వివరాలు

ఈ యాప్‌లో కొత్తగా చేర్చిన ఫంక్షన్లలో సభ్యుల కోసం ఆడి క్లబ్ ఇండియా లాగిన్, ఆన్‌లైన్ చెల్లింపుల సౌకర్యాలు, ఆడి కాన్సీర్జ్, అవకాశాలు లేదా కస్టమర్-కాని ప్రయోజనాలు, కస్టమర్ కేర్ సపోర్ట్ మొదలైనవి ఉన్నాయి.

ఈ లేటెస్ట్ వెర్షన్ యాప్‌లో కస్టమర్ సేఫ్టీ మరియు సెక్యూరిటీ, డ్రైవర్ ప్రవర్తన సమాచారం, జియో-లొకేషన్ మరియు సర్వీస్ బుకింగ్స్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

భారత్‌లో ఆడి కస్టమర్ల కోసం 'రెడీ టూ డ్రైవ్' క్యాంపైన్ - వివరాలు

ఆడి ఇండియా ప్రారంభించిన రెడీ టూ డ్రైవ్ క్యాంపైన్ గురించి కంపెనీ హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ, "ఆడి వద్ద, మేము చేసే ప్రతి పనిలో కస్టమరే కేంద్రంగా ఉంటారు. మా మొత్తం వ్యాపార వ్యూహానికి అనుగుణంగా, సర్వీస్ స్పెసిఫిక్ క్యాంపైన్‌ను ప్రకటించడంపై మాకు సంతోషంగా ఉంది. ఈ క్యాంపైన్‌లో అనేక రాయితీలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మా వర్క్‌షాప్‌లన్నీ పూర్తిగా పరిశుభ్రపరచబడి ఉంటాయి మరియు గరిష్ట పరిశుభ్రత కోసం మా సిబ్బంది వాటిని ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉంటారు. గత కొంత కాలంగా పెరిగిన ఆఫ్టర్ సేల్స్ యాక్టివిటీ నేపథ్యంలో, మా సేవా కేంద్రాలకు మా కస్టమర్లను తిరిగి స్వాగతించడానికి మేము ఎదురుచూస్తున్నాము. అన్ని ఆడి కార్లు ఎల్లప్పుడూ ఉత్తమంగా నడుస్తున్నాయని నిర్ధారించడమే మా ప్రధాన లక్ష్యం" అని అన్నారు.

MOST READ:భారత్‌లో అడుగుపెట్టిన ట్రయంఫ్ స్ట్రీట్ ట్విన్ బైక్ రేటెంతో తెలుసా ?

భారత్‌లో ఆడి కస్టమర్ల కోసం 'రెడీ టూ డ్రైవ్' క్యాంపైన్ - వివరాలు

ఆడి ఇండియా రెడీ టూ డ్రైవ్ సర్వీస్ క్యాంపైన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఇటీవలి కాలంలో, తయారీదారులు తమ కస్టమర్లతో ఎంగేజ్ కావటానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఆడి కస్టమర్లు రెడీ టూ డ్రైవ్ క్యాంపైన్‌కు వెళితే, వారు ఖచ్చితంగా ఆడి ఇండియా అందిస్తున్న ఆఫర్ల నుండి లబ్ది పొందే అవకాశం ఉంటుంది.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
Audi launches the '#ReadyToDrive' Campaign in India. This campaign will comprise many new service initiatives and aftersales benefits for the customers and they can avail offers till September 30, 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X