దుబాయ్ లోని సూపర్ కార్లను ఎప్పుడైనా చూసారా.. అయితే ఇప్పుడే చూడండి

భారతదేశంలో సూపర్ కార్లను చూడటం చాలా అరుదుగా జరుగుతుంది. మన రోడ్లపైన సూపర్ కార్లను చూసిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి సూపర్ కార్లను ఒకటి రెండు చూడటమే అరుదైన విషయం అలాంటిది ఎక్కువ సూపర్ కార్లను ఒకే దగ్గర చూడటం అనేది తరచుగా కూడా జరగదు.

దుబాయ్ లోని సూపర్ కార్లను ఎప్పుడైనా చూసారా.. అయితే ఇప్పుడే చూడండి

బాగా సంపన్నమైన అరబ్ దేశాలలో ఇలాంటివి చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. సాధారణంగా దుబాయ్ లో సూపర్ కార్ల ఈవెంట్లే జరుగుతుంటాయి. ఇలాంటి సూపర్ కార్లు ఒకే దగ్గర ఉన్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

దుబాయ్ లోని సూపర్ కార్లను ఎప్పుడైనా చూసారా.. అయితే ఇప్పుడే చూడండి

ఈ వీడియో మో వ్లాగ్స్ వారి యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియోలో రోల్స్ రాయిస్ వంటి విలాసవంతమైన కార్లతో తన సొంత గ్యారేజీని వ్లాగర్ చూపించడంతో వీడియో మొదలవుతుంది. వ్లాగర్ బ్లాక్ కస్టమ్ పెయింట్ అవెంటడార్ను ఎంచుకొని, వారి ముందు ఉన్న సూపర్ కార్ సమూహాన్ని వెంబడించడం ప్రారంభించాడు.

దుబాయ్ లోని సూపర్ కార్లను ఎప్పుడైనా చూసారా.. అయితే ఇప్పుడే చూడండి

వారు చివరకు ఒక సూపర్ కార్ల సమూహం ఉన్న చోటుకి చేరుకున్నారు. ఇక్కడ లంబోర్ఘిని కార్లు చాలానే ఉన్నాయి. సూపర్ కార్ల సమూహంలో ప్రధానంగా అవెంటడార్ మరియు కొన్ని గల్లార్డోస్ కార్లతో పాటు పోర్స్చే 911, మెక్లారెన్ 720, మెక్లారెన్ 570 లు, ఫెరారీ, లంబోర్ఘిని ఉరుస్, మెర్సిడెస్-ఎఎమ్‌జి జిటి మరియు మొదలైన విలువైన సూపర్ కార్లు మనం చూడవచ్చు.

దుబాయ్ లోని సూపర్ కార్లను ఎప్పుడైనా చూసారా.. అయితే ఇప్పుడే చూడండి

ఈ సూపర్ కార్ల సమూహంలో దుబాయ్ కి చెందిన రెండు పోలీస్ కార్లను కూడా మనం వీడియోలో చూడవచ్చు. పోలీస్ శాఖకు చెందిన కార్లలో బుగిట్టి వేరాన్ వంటి సూపర్ కార్లు ఉన్నాయి. ఇక్కడ మనం మెర్సిడెస్-ఎఎమ్‌జి జిటి మరియు డ్యూటీలో ఉన్న మసెరటి గ్రాన్‌టురిస్మోను చూస్తాము. పోలీసు కార్లు సూపర్ కార్ల సమూహానికి ఎస్కార్ట్ అందిస్తున్నాయి.

దుబాయ్ లోని సూపర్ కార్లను ఎప్పుడైనా చూసారా.. అయితే ఇప్పుడే చూడండి

దుబాయ్ లోని స్కైడైవ్ విమానాల రన్వేని పోలీసులు క్లియర్ చేసిన తరువాత సూపర్ కార్లన్నీ రన్వే మీదికి ప్రవేశిస్తాయి. ఇందులో దుబాయ్ రాజకుంటుంబానికి చెందిన ఒక వ్యక్తి తన కారుని చూపిస్తాడు. అతడు తనతో తెచ్చిన కారు మెక్లారెన్ సెన్నా. ఇది 4.0 లీటర్ వి8 ఇంజిన్‌తో 800 పిఎస్ మరియు 800 ఎన్‌ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

దుబాయ్ లోని సూపర్ కార్లను ఎప్పుడైనా చూసారా.. అయితే ఇప్పుడే చూడండి

మెక్లారెన్ సెన్నాకారు గంటకు 335 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇది 0 నుంచి 100 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2.8 సెకన్లలో చేసారుకోగలదు. దీని ధర 1 మిల్లియన్ కంటే ఎక్కువ ఉండవచ్చు. ఇప్పటిదాకా ఇండియాలో ఈ కార్ ప్రారంభించలేదు.

భారతదేశంలో ప్రజాదరణపొందిన సూపర్ కార్లు రెండు అవి ఒకటి ఫెరారీ రెండు లంబోర్ఘిని. ఈ రెండు వాహనాలకు సవాలు విసరడానికి బ్రిటిష్ సూపర్ కార్ అయిన మార్క్ భవిష్యత్ లో ఇండియాలోకి ప్రవేశించడానికి ఆలోచిస్తోంది.

Image Courtesy: Mo Vlogs/YouTube

Most Read Articles

English summary
Dubai’s royal family supercars on video: Check it out. Read in Telugu.
Story first published: Thursday, January 30, 2020, 15:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X