మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్స్; రూ.2.65 లక్షల వరకూ తగ్గింపు

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా, భారత మార్కెట్లో ప్రస్తుత పండుగ సీజన్‌ను పురస్కరించుకొని తమ వాహనాలపై స్పెషల్ డిస్కౌంట్లు, ప్రయోజనాలు మరియు వివిధ రకాల ఆఫర్లను అందిస్తోంది. మహీంద్రా ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన కొత్త తరం థార్ ఎస్‌యూవీ మినహా మిగిలిన అన్ని మోడళ్లపై కంపెనీ గరిష్టంగా రూ.2.65 లక్షల వరకు విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.

మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్స్; రూ.2.65 లక్షల వరకూ తగ్గింపు

భారతదేశంలో కొనసాగుతున్న పండుగ సీజన్‌లో బలమైన మార్కెట్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు రాబోయే నెలల్లో ఎక్కువ మంది కస్టమర్లను తమ ఉత్పత్తుల వైపు ఆకర్షించేందుకు మరియు కంపెనీ అమ్మకాలను మెరుగుపరచేందుకు గాను మహీంద్రా ఈ ప్రత్యేక ప్రయోజనాలు మరియు ఆఫర్లను ప్రవేశపెట్టింది.

మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్స్; రూ.2.65 లక్షల వరకూ తగ్గింపు

మహీంద్రా అందిస్తున్న ఈ ప్రయోజనాలు మరియు ఆఫర్లు రూ.25,000 నుండి రూ.2.65 లక్షల మధ్యలో ఉన్నాయి. కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి ఇవి మారుతూ ఉంటాయి.

MOST READ:అమేజింగ్.. ఒకే బస్సుని 10 లక్షల కి.మీ డ్రైవ్ చేసిన డ్రైవర్

మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్స్; రూ.2.65 లక్షల వరకూ తగ్గింపు

మహీంద్రా అందిస్తున్న బొలెరో ఎస్‌యూవీపై కంపెనీ రూ.25,500 ఆఫర్లను అందిస్తోంది. ఇందులో రూ.12,000 ఎక్సేంజ్ బోనస్, రూ.10,000 నగదు తగ్గింపు మరియు రూ.3,500 విలువైన కార్పొరేట్ ఆఫర్లు ఉన్నాయి.

మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్స్; రూ.2.65 లక్షల వరకూ తగ్గింపు

మహీంద్రా కెయువి100 ఎన్‌ఎక్స్‌టి మరియు మహీంద్రా ఎక్స్‌యువి 300 మోడళ్లు కూడా ఇదే రకమైన ప్రయోజనాలతో లభిస్తుంది. ఇందులో 29,500 రూపాయల వరకూ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండు ఎస్‌యూవీలపై సుమారు 4,000 రూపాయల కార్పొరేట్ డిస్కౌంట్‌లు, ఎక్స్‌యూవీ 300పై రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు కెయువి 100 ఎన్‌ఎక్స్‌టిపై రూ.25,000 క్యాష్ డిస్కౌంట్స్ ఉన్నాయి.

MOST READ:ఫెస్టివల్ సీజన్లో హోండా సూపర్ 6 ఫెస్టివల్ ఆఫర్స్.. చూసారా

మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్స్; రూ.2.65 లక్షల వరకూ తగ్గింపు

అదేవిధంగా, ఎక్స్‌యువి500 మరియు మరాజోలపై కూడా వరుసగా రూ.34,000 మరియు రూ.38,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ 500పై రూ.25,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.9,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది.

మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్స్; రూ.2.65 లక్షల వరకూ తగ్గింపు

మరోవైపు మహీంద్రా మరాజ్జో ఎమ్‌పివిపై రూ.10,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.6,600 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. మరాజోలో మిగిలిన రూ.22,000 ప్రయోజనాలను నగదు తగ్గింపుగా అందిస్తున్నారు.

MOST READ:సెక్యూరిటీ గార్డు ప్రాణాలు తీసిన ఫెరారీ కార్.. ఎలాగో తెలుసా ?

మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్స్; రూ.2.65 లక్షల వరకూ తగ్గింపు

మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీపై గరిష్టంగా 80,000 రూపాయల వరకు భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఇందులో రూ.60,000 నగదు తగ్గింపులు, రూ.20,000 ఎక్స్ఛేంజ్ మరియు కార్పొరేట్ ఆఫర్లు లభిస్తాయి.

ఇకపోతే, మహీంద్రా అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ, అల్టురాస్ జి4 మోడల్‌పై అత్యధిక ప్రయోజనాలను అందిస్తున్నారు. ఈ మోడల్‌పై గరిష్టంగా రూ.2.65 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తాయి. ఈ సెవన్ సీటర్ ఎస్‌యూవీపై రూ.2 లక్షల నగదు తగ్గింపు మరియు రూ.50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.15,000 కార్పోరేట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

మహీంద్రా కార్లపై భారీ డిస్కౌంట్స్; రూ.2.65 లక్షల వరకూ తగ్గింపు

మహీంద్రా అక్టోబర్ నెల ఆఫర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఈ పండుగ సీజన్‌లో కొత్త మహీంద్రా కారును కొనాలనుకునే వారికి ఇదే చక్కటి అవకాశం. కరోనా మహమ్మారి కారణంగా 2020వ సంవత్సరం మొదటి సగం భారీగా దెబ్బతినడంతో, కార్ల తయారీదారులు ఇప్పుడు తమ అమ్మకాలను పెంచుకునేందుకు తమ వాహనాలపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. మహీంద్రా కూడా తమ వాహనాలపై మంచి ఆఫర్లను అందిస్తోంది.

MOST READ:భార్యని 90 కిమీ రిక్షా మీద తీసుకెళ్లిన భర్త.. ఎందుకో తెలుసా ?

Most Read Articles

English summary
Mahindra is offering a host of discounts, benefits and offers ahead of the upcoming festive season in India. The car manufacturer is offering benefits and offers worth up to Rs 2.65 lakh, across its entire model lineup, except the recently launched Thar SUV. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X