హోండా కార్లపై ఆకర్షణీయమైన దీపావళి ఆఫర్స్.. మోడల్ వారీ డిస్కౌంట్ డీటేల్స్

హోండా కార్స్ ఇండియా ఈ ఏడాది దీపావళికి పండుగ సీజన్‌ను పురస్కరించుకొని 'ది గ్రేట్ హోండా ఫెస్ట్' పేరిట తమ వాహనాలపై నగదు తగ్గింపులు, వివిధ ప్రయోజనాలు మరియు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. హోండా జాజ్, ఐదవ తరం సిటీ, అమేజ్, అమేజ్ స్పెషల్ ఎడిషన్, డబ్ల్యూఆర్-వి మరియు సివిక్ మోడళ్లపై కంపెనీ ఆఫర్లను అందిస్తోంది.

హోండా కార్లపై ఆకర్షణీయమైన దీపావళి ఆఫర్స్.. మోడల్ వారీ డిస్కౌంట్ డీటేల్స్

హోండా ప్రారంభించిన ‘ది గ్రేట్ హోండా ఫెస్ట్' సేల్‌లో భాగంగా. నగదు తగ్గింపు, మార్పిడి ప్రయోజనాలు (ఎక్సేంజ్ బెనిఫిట్స్) మరియు ఇతర ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది. కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి రూ.2.5 లక్షల వరకు గరిష్ట ప్రయోజనాలను అందిస్తోంది.

హోండా కార్లపై ఆకర్షణీయమైన దీపావళి ఆఫర్స్.. మోడల్ వారీ డిస్కౌంట్ డీటేల్స్

ఈ దీపావళి పండుగ ఆఫర్లు నవంబర్ 1, 2020వ తేదీ నుండి ప్రారంభమైన నవంబర్ 30, 2020వ తేదీ వరకూ చెల్లుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. కాగా, ఇందులోని హోండా అమేజ్ స్పెషల్ ఎడిషన్ విషయంలో ఆఫర్లు స్టాక్స్ ఉన్నంత వరకు మాత్రమే చెల్లుతాయి. మోడల్ వారీగా కంపెనీ అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఇలాఉన్నాయి:

MOST READ:దేశీయ మార్కెట్లో టీవీఎస్ అపాచీ RTR 200 4V బైక్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

హోండా కార్లపై ఆకర్షణీయమైన దీపావళి ఆఫర్స్.. మోడల్ వారీ డిస్కౌంట్ డీటేల్స్

హోండా జాజ్:

భారత మార్కెట్లో హోండా విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ జాజ్‌పై ఈ నెలలో కంపెనీ గరిష్టంగా రూ.40,000 వరకూ ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.25,000 వరకు నగదు బోనస్, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలిసి ఉన్నాయి. మార్కెట్లో కొత్త 2020 హోండా జాజ్ ప్రారంభ ధర రూ.7.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

హోండా కార్లపై ఆకర్షణీయమైన దీపావళి ఆఫర్స్.. మోడల్ వారీ డిస్కౌంట్ డీటేల్స్

హోండా అమేజ్:

దేశీయ మార్కెట్లో హోండాకు ఎంట్రీ లెవల్ సెడాన్ అయిన అమేజ్‌పై కంపెనీ గరిష్టంగా రూ.47,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో పెట్రోల్ వేరియంట్‌లపై రూ.20,000 నగదు తగ్గింపు లభిస్తుండగా, డీజిల్ వేరియంట్‌లపై రూ.10,000 నగదు తగ్గింపు లభిస్తోంది.

MOST READ:టాటా మోటార్స్ అక్టోబర్ సేల్స్ రిపోర్ట్ ఎలా ఉందో చూసారా?

హోండా కార్లపై ఆకర్షణీయమైన దీపావళి ఆఫర్స్.. మోడల్ వారీ డిస్కౌంట్ డీటేల్స్

తమ పాత కారును కొత్త అమేజ్ కోసం మార్పిడి చేసుకోవాలనుకునే వినియోగదారులకు హోండా ఈ రెండు వేరియంట్లపై (పెట్రోల్ మరియు డీజిల్) రూ.15,000 ఎక్సేంజ్ బోనస్‌ను అందిస్తోంది. అదనంగా, వారికి నాల్గవ మరియు ఐదవ సంవత్సరానికి గాను రూ.12,000 విలువైన పొడిగించిన (ఎక్స్‌టెండెడ్) వారంటీ ప్యాకేజీని కూడా కంపెనీ ఉచితంగా అందిస్తోంది.

హోండా కార్లపై ఆకర్షణీయమైన దీపావళి ఆఫర్స్.. మోడల్ వారీ డిస్కౌంట్ డీటేల్స్

హోండా అమేజ్ స్పెషల్ ఎడిషన్:

హోండా కార్స్ ఇండియా ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన అమేజ్ స్పెషల్ ఎడిషన్ మోడల్‌పై కంపెనీ తగ్గింపులను అందిస్తోంది. స్టాండర్డ్ అమేజ్ మోడల్‌తో పోల్చుకుంటే ఈ స్పెషల్ ఎడిషన్ అమేజ్‌లో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా కొత్త ఫీచర్లు కూడా లభిస్తాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:నవంబర్ 7 న 6 నగరాల్లో లాంచ్ కానున్న ఏథర్ 450 ఎక్స్ ; ఆ నగరాలు ఇవే

హోండా కార్లపై ఆకర్షణీయమైన దీపావళి ఆఫర్స్.. మోడల్ వారీ డిస్కౌంట్ డీటేల్స్

హోండా అమేజ్ స్పెషల్ ఎడిషన్ మోడల్‌పై రూ.7,000 నగదు తగ్గింపును అందిస్తోంది. అలాగే, తమ పాత కారును కొత్త అమేజ్ స్పెషల్ ఎడిషన్ కోసం మార్పిడి చేసుకునే కస్టమర్ల కోసం రూ.15,000 ఎక్సేంజ్ బోనస్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.

హోండా కార్లపై ఆకర్షణీయమైన దీపావళి ఆఫర్స్.. మోడల్ వారీ డిస్కౌంట్ డీటేల్స్

హోండా డబ్ల్యూఆర్-వి:

హోండా అందిస్తున్న డబ్ల్యూఆర్-వి ఎస్‌యూవీ కంపెనీ నవంబర్ నెల ఆఫర్లలో భాగంగా మొత్తం రూ.40,000 వరకు నగదు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.25,000 నగదు తగ్గింపు, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కలిసి ఉన్నాయి. మార్కెట్లో ఈ ఎస్‌యూవీ ధరలు రూ.8.49 లక్షల నుంచి రూ.10.99 లక్షల (ఎక్స్‌షోరూమ్‌, ఢిల్లీ)లో ఉన్నాయి.

MOST READ:రూ. 30 వేల విలువైన స్కూటర్‌కి రూ. 42 వేలు ఫైన్.. చివరికి ఏమైందంటే ?

హోండా కార్లపై ఆకర్షణీయమైన దీపావళి ఆఫర్స్.. మోడల్ వారీ డిస్కౌంట్ డీటేల్స్

ఐదవ తరం హోండా సిటీ:

ఐదవ తరం హోండా సిటీ కారుపై కేవలం ఎక్సేంజ్ ఆఫర్‌ను మాత్రమే కంపెనీ అందిస్తోంది. కొత్త సిటీ సెడాన్ కోసం పాత కారును మార్పిడి చేసే కస్టమర్లకు కంపెనీ రూ.30,000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఆల్-న్యూ సిటీ ధరలు రూ.10.89 లక్షల నుండి రూ.14.69 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి.

హోండా కార్లపై ఆకర్షణీయమైన దీపావళి ఆఫర్స్.. మోడల్ వారీ డిస్కౌంట్ డీటేల్స్

హోండా సివిక్:

నవంబర్ నెల ఫెస్టివల్ ఆఫర్లలో భాగంగా, హోండా అందిస్తున్న ప్రీమియం సెడాన్ సివిక్‌పై కంపెనీ భారీగా రూ.2.5 లక్షల వరకు నగదు ప్రయోజనాలను అందిస్తోంది. హోండా సివిక్ డీజిల్ మోడల్‌పై అత్యధికంగా రూ.2.5 లక్షల నగదు తగ్గింపును కంపెనీ ఆఫర్ చేస్తోంది. కాగా, పెట్రోల్ మోడల్‌పై రూ.1 లక్ష నగదు తగ్గింపును ఆఫర్ చేస్తోంది.

హోండా కార్లపై ఆకర్షణీయమైన దీపావళి ఆఫర్స్.. మోడల్ వారీ డిస్కౌంట్ డీటేల్స్

పైన పేర్కొన్న ఆఫర్లతో పాటుగా, భారతదేశంలోని ప్రస్తుత హోండా కస్టమర్ల కోసం కూడా కంపెనీ అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. కొత్త హోండా కారుకు అప్‌గ్రేడ్ కావాలనుకునే ప్రస్తుత హోండా కస్టమర్లకు కంపెనీ రూ.6,000 అదనపు లాయల్టీ బోనస్ మరియు రూ.10,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌లను అందిస్తోంది.

హోండా కార్లపై ఆకర్షణీయమైన దీపావళి ఆఫర్స్.. మోడల్ వారీ డిస్కౌంట్ డీటేల్స్

హోండా ఫెస్టివల్ ఆఫర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారతదేశంలో కొనసాగుతున్న ప్రస్తుత పండుగ సీజన్‌లో కొత్త హోండా కారు కొనుగోలుదారును ప్రోత్సహించేలా కంపెనీ తమ అన్ని మోడళ్లపై ప్రత్యేకమైన తగ్గింపులను, రాయితీలను అందిస్తోంది. ఇవి కస్టమర్ల యొక్క కొనుగోలు నిర్ణయం తీసుకోవడానికి సహకరిస్తాయి. అంతేకాకుండా, కంపెనీ అమ్మకాలను పెంచడానికి కూడా సహాయపడుతాయి.

Most Read Articles

English summary
Honda Cars India has announced festive discounts, benefits and special offers called 'The Great Honda Fest' for Diwali this year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X