కొత్త ఎక్స్‌టెండెడ్ వారంటీ స్కీమ్స్‌ను ప్రకటించిన ఫోర్డ్ ఇండియా; ఫుల్ డీటేల్స్

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ ఇండియా, భారతదేశంలో విక్రయిస్తున్న తమ వాహనాల కోసం కొత్త ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీలను ప్రకటించింది. ఫోర్డ్ వాహనాలపై 6 సంవత్సరాలు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల వరకు కవర్ చేయదగిన ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీను కంపెనీ విడుదల చేసింది.

కొత్త ఎక్స్‌టెండెడ్ వారంటీ స్కీమ్స్‌ను ప్రకటించిన ఫోర్డ్ ఇండియా; ఫుల్ డీటేల్స్

ఈ కొత్త ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజ్ కంపెనీ విక్రయిస్తున్న ఫిగో, ఫ్రీస్టైల్, ఆస్పైర్, ఎకోస్పోర్ట్ మరియు ఎండీవర్ మోడళ్లపై అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. కొత్త ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీతో దేశంలోని వినియోగదారులకు మెరుగైన యాజమాన్య అనుభవాన్ని అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

కొత్త ఎక్స్‌టెండెడ్ వారంటీ స్కీమ్స్‌ను ప్రకటించిన ఫోర్డ్ ఇండియా; ఫుల్ డీటేల్స్

ఫోర్డ్ ఇండియా ప్రకటించిన ఎక్స్‌టెండెడ్ పొడిగించిన వారంటీలో రోడ్-సైడ్ అసిస్టెన్స్ కూడా కలిసి ఉంటుంది, ఇది ఎక్స్‌టెండెడ్ వారంటీ చెల్లుబాటులో ఉన్నంత కాలం అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు మూడు వేర్వేరు ప్యాకేజీల నుంచి తమకు నచ్చిన దానిని ఎంచుకోవచ్చు. ఇవన్నీ 1.5 లక్షల కిలోమీటర్ల వరకు ఉంటాయి. ఇందులో 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మరియు 6 సంవత్సరాలు ప్యాకేజీలు ఉన్నాయి.

MOST READ:దీపావళి ఆఫర్స్ ప్రకటించిన హీరో మోటోకార్ప్

కొత్త ఎక్స్‌టెండెడ్ వారంటీ స్కీమ్స్‌ను ప్రకటించిన ఫోర్డ్ ఇండియా; ఫుల్ డీటేల్స్

కస్టమర్ కలిగి ఉన్న మోడల్ మరియు ఇంజన్‌ను బట్టి ఎక్స్‌టెండెడ్ వారంటీ విత్ రోడ్-సైడ్ అసిస్టెన్స్ ధరలు మారుతూ ఉంటాయి. ఇందులో వాహనం యొక్క వయస్సును బట్టిన మూడు ప్రధాన టైమ్ ఫ్రేమ్‌లు నిర్ణయిస్తారు. వీటిలో వాహన కొనుగోలు చేసిన మొదటి 90 రోజులు, 91 నుండి 365 రోజులు మరియు చివరిది 1 నుండి 3 సంవత్సరాల మధ్యలో ఉంటుంది.

కొత్త ఎక్స్‌టెండెడ్ వారంటీ స్కీమ్స్‌ను ప్రకటించిన ఫోర్డ్ ఇండియా; ఫుల్ డీటేల్స్

అలాగే, ఎక్స్‌టెండెడ్ వారంటీ సమయంలో వాహన మరమ్మతులకు సంబంధించిన మెకానికల్, ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్స్ మరియు లేబర్ ఛార్జీలు కవర్ అవుతాయి. అయితే, ఇందులో యాక్సిడెంటల్ రిపేర్స్, జనరల్ వేర్ అండ్ టేర్ మరియు వెహికల్ పీరియాడిక్ మెటింటెన్స్ వంటివి కవర్ కావు. మోడల్ వారీగా ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీ మరియు ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

MOST READ:అక్టోబర్ సేల్స్ రిపోర్ట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్స్.. చూసారా ?

కొత్త ఎక్స్‌టెండెడ్ వారంటీ స్కీమ్స్‌ను ప్రకటించిన ఫోర్డ్ ఇండియా; ఫుల్ డీటేల్స్

ఫోర్డ్ ఫిగో, ఫోర్డ్ ఆస్పైర్, ఫోర్డ్ ఫ్రీస్టైల్

ఈ మూడు మోడళ్లను కంపెనీ ఓకే రకమైన ఎక్స్‌టెండెడ్ వారంటీ ధరతో అందిస్తోంది. ఇవన్నీ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తాయి. పెట్రోల్ వేరియంట్లలో 4 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీల ధరలు రూ.8,933 మరియు రూ.11,533 మధ్యలో ఉంటాయి. అదేవిధంగా, 5 సంవత్సరాల మరియు 6 సంవత్సరాల ప్యాకేజీల ధరలు వరుసగా రూ.11,341 నుండి రూ.14,441 మరియు రూ.17,289 నుండి రూ.22,289 మధ్యలో ఉంటాయి.

కొత్త ఎక్స్‌టెండెడ్ వారంటీ స్కీమ్స్‌ను ప్రకటించిన ఫోర్డ్ ఇండియా; ఫుల్ డీటేల్స్

పైన తెలిపిన మోడళ్లలో డీజిల్ వేరియంట్ల విషయానికి వస్తే, 4 సంవత్సరాల ప్యాకేజీల ధరలు రూ.10,033 నుంచి రూ.12,933 మధ్యలో ఉన్నాయి. అలాగే, 5 సంవత్సరాల ప్యాకేజీ ధర రూ.14,541 నుండి రూ.18,641 మధ్యలో ఉండగా 6 సంవత్సరాల ప్యాకేజీ ధర రూ.23,589 నుండి రూ.30,589 మధ్యలో ఉంది.

MOST READ:రూ. 30 వేల విలువైన స్కూటర్‌కి రూ. 42 వేలు ఫైన్.. చివరికి ఏమైందంటే ?

కొత్త ఎక్స్‌టెండెడ్ వారంటీ స్కీమ్స్‌ను ప్రకటించిన ఫోర్డ్ ఇండియా; ఫుల్ డీటేల్స్

ఫోర్డ్ ఎకోస్పోర్ట్

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ భారతదేశంలో విడుదలైన మొట్టమొదటి కాంపాక్ట్-ఎస్‌యూవీలలో ఒకటి. ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ ఇందులో బిఎస్6 వెర్షన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది.

కొత్త ఎక్స్‌టెండెడ్ వారంటీ స్కీమ్స్‌ను ప్రకటించిన ఫోర్డ్ ఇండియా; ఫుల్ డీటేల్స్

పెట్రోల్ వేరియంట్‌లలో 4 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ ధర రూ.10,524 మరియు 13,624 మధ్యలో ఉంటుంది. అదేవిధంగా, 5 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీల ధరలు రూ.16,066 నుండి రూ .20,766 మధ్యలో ఉండగా, 6 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ ధరలు రూ.30,089 నుండి రూ.39,189 మధ్యలో ఉన్నాయి.

MOST READ:ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ నుంచి మరో పోస్ట్.. అదేంటో చూసారా ?

కొత్త ఎక్స్‌టెండెడ్ వారంటీ స్కీమ్స్‌ను ప్రకటించిన ఫోర్డ్ ఇండియా; ఫుల్ డీటేల్స్

ఎకోస్పోర్ట్ యొక్క డీజిల్ వేరియంట్లను గమనిస్తే, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మరియు 6 సంవత్సరాల ప్యాకేజీల ధరలు వరుసగా రూ.13,524 - రూ.17,624, రూ.20,066 - రూ.26,066 మరియు రూ.33,089 - రూ.43,089 మధ్యలో ఉన్నాయి.

కొత్త ఎక్స్‌టెండెడ్ వారంటీ స్కీమ్స్‌ను ప్రకటించిన ఫోర్డ్ ఇండియా; ఫుల్ డీటేల్స్

ఫోర్డ్ ఎండీవర్

ఫోర్డ్ ఎండీవర్ దేశంలో విక్రయించే బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ ఫుల్-సైజ్ ప్రీమియం ఎస్‌యూవీ. ప్రస్తుతం ఫోర్డ్ ఎండీవర్ కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. దీనిపై 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మరియు 6 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజ్‌ల ధరలు రూ.30,133 - రూ.39,533, రూ.46,171 - రూ.60,771, రూ.96,690 - రూ.1,25,499 మధ్యలో ఉన్నాయి.

కొత్త ఎక్స్‌టెండెడ్ వారంటీ స్కీమ్స్‌ను ప్రకటించిన ఫోర్డ్ ఇండియా; ఫుల్ డీటేల్స్

భారత్‌లో ఫోర్డ్ ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజ్‌ల విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారత మార్కెట్లో ఫోర్డ్ ఇండియా కొత్తగా ప్రవేశపెట్టిన ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీలు, ఫోర్డ్ వినియోగదారులకు మెరుగైన యాజమాన్యాన్య సౌలభ్యాన్ని అందిస్తాయి. ఈ వారంటీలో ప్యాకేజ్‌లో రోడ్-సైడ్ అసిస్టెన్స్ చేర్చడం మంచి విషయం. రోడ్డుపై హఠాత్తుగా కారు నిలిచిపోయినప్పుడు లేదా రోడ్-సైడ్ అసిస్టెన్స్ అవసరమైనప్పుడు ఇది చక్కగా పనికొస్తుంది.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Ford India has announced a set of new extended warranty packages in India. The company is now offering its customers to secure their vehicles with an extended warranty package covering up to 6 years or 1.5 lakh kilometers. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X