Just In
- 8 hrs ago
కారులో ఉన్న పాడిల్ షిఫ్ట్ ఫీచర్ యొక్క ప్రయోజనాలు
- 20 hrs ago
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- 20 hrs ago
టాటా టిగోర్ ఈవి ఫేస్‌లిఫ్ట్ వివరాలు వెల్లడి; ఎక్స్ ప్రెస్-టి పేరుతో త్వరలోనే లాంచ్!
- 23 hrs ago
హైదరాబాద్‌లో విడుదల కానున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ - డీటేల్స్
Don't Miss
- Sports
IPL 2021: సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. స్టార్ పేసర్‌కు గాయం! ఆడేది అనుమానమే!
- News
కరోనా విలయం: ప్రధానికి చెక్ పెడుతూ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం -వంచన వద్దన్న ప్రియాంక -మోదీ ఇలా
- Finance
పదింటిలో 9 కంపెనీల్లో నియామకాల జోరు, ఐటీలో అదుర్స్
- Movies
మరోసారి నందమూరి హీరోతో బోయపాటి మూవీ: యాక్షన్ స్టోరీని రెడీ చేసిన మాస్ డైరెక్టర్
- Lifestyle
ఈ వారం 18వ తేదీ నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు మీ రాశిఫలాలు...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫోర్డ్ 'మిడ్‌నైట్ సర్‌ప్రైజ్' క్యాంపైన్; ఆర్థరాత్రి వరకూ ఆఫర్లే ఆఫర్లు..
అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ ఇండియా, దేశంలో ప్రతి ఏటా నిర్వహించే 'మిడ్‌నైట్ సర్‌ప్రైజ్' క్యాంపైన్‌ను ఈ ఏడాది కూడా ప్రారంభించింది. ఈ క్యాంపైన్ డిసెంబర్ 4, 2020వ తేదీ నుండి డిసెంబర్ 6, 2020వ తేదీ వరకూ మాత్రమే ఉంటుంది. ఈ క్యాంపైన్ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఫోర్డ్ ఇండియా షోరూమ్‌లను ఉదయం 09:00 నుండి అర్ధరాత్రి వరకు తెరచి ఉంచుతారు.

షోరూమ్ పనివేళలను పెంచడం ద్వారా రోజంతా బిజీగా ఉండే కస్టమర్లు రాత్రివేళల్లో తీరికగా షోరూమ్‌ను సందర్శించుకుని, కారు కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసుకుందు వీలుగా కంపెనీ ఈ క్యాంపైన్‌ను ప్రారంభించింది. ఈ సమయంలో షోరూమ్‌కి విచ్చేసే కస్టమర్లు వివిధ ఫోర్డ్ మోడళ్లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవటానికి మరియు కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయడానికి కావల్సిన మద్దతును పొందవచ్చు.

కస్టమర్లు ఇందుకు ప్రత్యామ్నాయంగా, డయల్-ఎ-ఫోర్డ్ సర్వీస్‌ను కానీ లేదా బ్రాండ్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి కానీ ఏదైనా ఫోర్డ్ వాహనాన్ని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. కొనుగోలు నిర్ణయం తీసుకోవటంలో కస్టమర్లకు సహకరించేందుకు కంపెనీ అనేక ఆఫర్లను కూడా అందిస్తోంది.
MOST READ:సైకిల్‌పై కాశ్మీర్ నుంచి 8 రోజుల్లో కన్యాకుమారి చేరుకున్న 17 ఏళ్ల యువకుడు, ఇతడే

ఫోర్డ్ మిడ్‌నైట్ సర్‌ప్రైజ్ క్యాంపైన్‌లో భాగంగా వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లకు కంపెనీ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లను కూడా అందించనుంది. ఈ సమయంలో ఫోర్డ్ కార్లను కొనుగోలు చేసే కొనుగోలుదారులకు డిజిటల్ స్క్రాచ్ కార్డు లభిస్తుంది. ఇందులో గృహోపకరణాలు, ఎల్‌ఈడీ టీవీలు, ఎయిర్ ప్యూరిఫైయర్, స్మార్ట్‌ఫోన్లు, బంగారు నాణేలు మరియు రూ.25,000 వరకూ అష్షూర్డ్ గిఫ్ట్ కార్డులు ఉంటాయి.

ఈ స్క్రాచ్ కార్డుతో పాటు, డిసెంబర్ 2020 నెలలోనే డెలివరీలు తీసుకునే వినియోగదారులు 5 లక్షల రూపాయల విలువైన లక్కీ డ్రా బహుమతులకు కూడా అర్హులు అవుతారు. ఈ మూడు రోజుల ప్రత్యేక అమ్మకాల ఆఫర్లతో ఫోర్డ్ ఇండియా ఈ ఏడాది ముగిసే లోపుగా తమ అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోవాలని ప్లాన్ చేస్తోంది.
MOST READ:కుండపోత వర్షంలో నిలబడి 4 గంటలు డ్యూటీ చేసిన పోలీస్.. ఎక్కడో తెలుసా ?

ఫోర్డ్ యజమానులకు ఇబ్బంది లేని యాజమాన్య అనుభవాన్ని అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఫోర్డ్ ఇండియా ఇటీవలే ‘సర్వీస్ ప్రైస్ కాలిక్యులేటర్' అనే కొత్త ఆఫ్టర్ సేల్స్ సర్వీస్‌ను కూడా ప్రవేశపెట్టింది. దీని సాయంతో వినియోగదారులు వర్క్‌షాప్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండానే వారి వాహనాల సర్వీస్ మరియు విడిభాగాలకు అయ్యే ఖర్చును కాలిక్యులేట్ చేసుకోవచ్చు.

ఫోర్డ్ ఇండియా ప్రస్తుతం భారత మార్కెట్లో ఫిగో, ఫ్రీస్టైల్, ఆస్పైర్, ఎకోస్పోర్ట్, ఎండీవర్ మరియు మస్తాంగ్ పెర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ కారును భారత మార్కెట్లో విక్రయిస్తుంది. కంపెనీ ప్రకటించిన ఈ మూడు రోజుల మిడ్‌నైట్ సర్‌ప్రైజ్ ఆఫర్లు బ్రాండ్ యొక్క మొత్తం ప్రోడక్ట్ లైనప్‌కు వర్తిస్తుంది.
MOST READ:పబ్‌జి ప్రేమికుల కోసం తయారైన కొత్త హెల్మెట్స్.. చూసారా !

ఈ విషయం గురించి ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్ వినయ్ రైనా మాట్లాడుతూ, భారతదేశంలో మిడ్‌నైట్ సర్‌ప్రైజ్ క్యాంపైన్‌ను తిరిగి తీసుకురావడం మరియు కస్టమర్లు వారు కొనుగోలు చేసే ప్రతి ఫోర్డ్‌తో మరింత ఆదా చేసుకోవటానికి అవకాశం కల్పించడం పట్ల తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు.

దేశంలో కొనసాగుతున్న మహమ్మారి కొత్త ఫోర్డ్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారి కలను చెరిపేయకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నామని చెప్పారు. ఈ క్యాంపైన్ సమయంలో కస్టమర్లు ఇప్పుడు డయల్-ఎ-ఫోర్డ్ ద్వారా 1800-419-3000 టోల్ ఫ్రీ నంబర్‌పై కాల్ చేసి కానీ ద్వారా అంకితమైన ఆన్‌లైన్ బుకింగ్ పోర్టల్ www.booking.india.ford.com ద్వారా కానీ తమకు నచ్చిన ఫోర్డ్ వాహనాన్ని బుక్ చేసుకోవచ్చని, ఇదొక సురక్షితమైన కొనుగోలు ప్రక్రియ అని రైనా తెలిపారు.
MOST READ:ఒకే వారంలో రెండుసార్లు జరిమానా చెల్లించిన డిప్యూటీ మేయర్.. ఎవరో తెలుసా ?

ఫోర్డ్ ఇండియా మిడ్‌నైట్ సర్‌ప్రైజ్ క్యాంపైన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
భారత మార్కెట్లో అమ్మకాలను పెంచుకోవడానికి మరియు 2020 అమ్మకాల లక్ష్యాలను చేరుకునేందుకు ఫోర్డ్ ఇండియా దేశంలో మిడ్‌నైట్ సర్‌ప్రైజ్ క్యాంపైన్‌ను ప్రారంభించింది. ఈ క్యాంపైన్ ప్రత్యేకించి నిత్యం బిజీగా ఉండే వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఫోర్డ్ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లకు కంపెనీ ఆకర్షణీయమైన సర్‌ప్రైజ్ కానుకలను కూడా అందిస్తోంది.