సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ "హ్యుందాయ్ క్రెటా" మరో అరుదైన బెంచ్‌మార్క్‌ను సృష్టించింది. హ్యుందాయ్ ఈ మోడల్ గత 2015లో మార్కెట్లో విడుదల చేసినప్పటి నుండి ఇప్పటి వరకూ 5,00,000 లకు పైగా యూనిట్లను విక్రయించినట్లు పేర్కొంది.

సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ

మరోవైపు ఈ ఏడాది ఆరంభంలో సరికొత్త మార్పులతో విడుదైలన 2020 హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీకి కూడా మార్కెట్లో డిమాండ్ జోరందుకుంది. ప్రస్తుతం కోవిడ్-19 పరిస్థితుల్లో కూడా ఈ మోడల్ కస్టమర్లను ఆకర్షించడంలో విజయం సాధిస్తోంది. ఈ సెగ్మెంట్లో బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచిన 2020 క్రెటాకు ఇప్పటి వరకూ 65,000 లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది.

సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ

హ్యుందాయ్ పేర్కొన్న సమాచారం ప్రకారం, ప్రతి నెలా క్రెటా అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. గడచిన జులై 2020లో హ్యుందాయ్ మొత్తం 11,549 క్రెటా ఎస్‌యూవీలను విక్రయించింది. భారత మార్కెట్లో ఈ ఎస్‌యూవీ విజయం వెనుక అనేక కారణాలు ఉన్నాయి, ఇందులో ప్రధానంగా క్రెటాలో లభించే ఇంజన్ ఆప్షన్స్‌ను చెప్పుకోవచ్చు.

MOST READ:దుమ్మురేపుతున్న ఎంజి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఫస్ట్ టీజర్

సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ

దేశంలో బిఎస్6 ఉద్గార నిబంధనలు కఠినతరం చేశాక డీజిల్ ఇంజన్లకు గిరాకీ తగ్గింది. అయితే, అనూహ్యంగా హ్యుందాయ్ క్రెటా విషయంలో మాత్రం డీజిల్ వేరియంట్లకు గిరాకీ పెరుగుతూనే ఉంది. ఈ మోడల్ కోసం కంపెనీ అందుకున్న మొత్తం బుకింగ్‌లో 55 శాతం మంది వినియోగదారులు డీజిల్ ఇంజన్‌లను ఎంచుకున్నట్లు హ్యుందాయ్ ఇదివరకే ప్రకటించింది.

సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ

సరికొత్త 2020 హ్యుందాయ్ క్రెటా పూర్తిగా కొత్త ఇంజన్లతో లభిస్తుంది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లతో కలిపి ఇది మొత్తం 14 వేరియంట్లలో అందుబాటులో ఉంది. హ్యుందాయ్ తమ 1.4 లీటర్ మరియు 1.6 లీటర్ యూనిట్లను పాత మోడళ్ల నుండి పూర్తిగా నిలిపివేసింది. ఈ పాత ఇంజన్లను కొత్త 1.5 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ యూనిట్లతో భర్తీ చేసింది. కొత్త 2020 హ్యుందాయ్ క్రెటాలో 1.4 లీటర్ టిజిడిఐ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

MOST READ:వర్షంలో ఒకే చోట 8 గంటలు నిలబడిన వృద్ధ మహిళ, ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ

కొత్త 2020 హ్యుందాయ్ క్రెటాలో కొత్త 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు వరుసగా 115 బిహెచ్‌పిల శక్తిని మరియు 144 ఎన్ఎమ్ మరియు 250 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను అందిస్తాయి. హ్యుందాయ్ క్రెటా హై స్పెక్ వేరియంట్లలో 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ

ఈ మూడు ఇంజన్లు స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కావాలనుకునే వారికి ఇందులో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ సివిటి, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ టార్క్-కన్వర్టర్ మరియు 1.4-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

MOST READ:డీజిల్ కార్ అమ్మకాలకు శాపంగా మారిన బిఎస్ 6 రూల్స్, ఎందుకంటే ?

సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ

గడచిన మార్చ్ నెలలో రిఫ్రెష్ చేసిన ఈ సరికొత్త 2020 హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్లలో కంపెనీ అనేక మార్పులు చేర్పులు చేసింది. ముందు భాగంలో సరికొత్త క్యాస్కేడింగ్ గ్రిల్‌, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌ల చుట్టూ కొత్తగా రూపొందించిన ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్, కొత్త ఎల్‌ఈడి ఫాగ్ ల్యాంప్స్ మరియు క్రింది భాగంలో ఫాక్స్ సిల్వర్ స్కఫ్ ప్లేట్ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. కొత్త హ్యుందాయ్ క్రెటా బేసిక్ క్యాబిన్ డిజైన్‌ను యధావిధిగా ఉంచారు. స్టీరింగ్ వీల్‌పై కొన్ని రకాల కంట్రోల్స్ ఉంటాయి. ఇందులో డ్రైవర్ సమాచారం కోసం 7-ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇందులో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా జోడించారు. ఇది హ్యుందాయ్ అందిస్తున్న అఫీషియల్ బ్లూ-లింక్ కనెక్టివిటీ టెక్నాలజీతో పాటుగా యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

MOST READ:జూలై నెలలో కొత్త రికార్డు సృష్టించిన ఫాస్ట్ ట్యాగ్ ట్రాన్సక్షన్స్ , ఎంతో తెలుసా ?

సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ

కొత్త హ్యుందాయ్ క్రెటాలో వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, పానోరమిక్ సన్‌రూఫ్, ఆంబియెంట్ లైటింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్ విత్ ఇబిడి, ప్యాడల్ షిఫ్టర్స్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు సెన్సార్లు, హిల్-స్టార్ట్ అసిస్ట్, హిల్-డీసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అధునాతన సాంకేతిక మరియు సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ

హ్యుందాయ్ క్రెటా సేల్స్ రికార్డ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఈ ఏడాది ఆరంభంలో సరికొత్త 2020 హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ మార్కెట్లో విడుదలైంది. ప్రస్తుతం దీని ధరలు రూ.9.99 లక్షల నుండి రూ.17.2 లక్షల మధ్యలో (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా విజయానికి ఇందులో ఆఫర్ చేయబడుతున్న బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు మరియు విభిన్న ఇంజన్ అండ్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇందులో కస్టమర్ అవసరాలను బట్టి తమకు నచ్చిన వేరియంట్‌ను ఎంచుకునే సౌకర్యం ఉంటుంది.

Most Read Articles

English summary
The Hyundai Creta SUV cross 5,00,000 units sales mark in the country. The SUV has achieved a new milestone since it was first launched in India back in 2015. The Creta has set a new benchmark for sales in the segment. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X