హాట్ కేకులా సేల్ అవుతున్న కొత్త 2020 క్రెటా; ఆరు నెలల్లో అరుదైన రికార్డ్!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ "హ్యుందాయ్ క్రెటా" మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. హ్యుందాయ్ ఈ ఏడాది ఆరంభంలో దేశీయ విపణిలో విడుదల చేసిన సరికొత్త 2020 హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ కేవలం ఆరు నెలల వ్యవధిలోనే 1,15,000 యూనిట్లు అమ్ముడుపోయినట్లు కంపెనీ తెలిపింది.

హాట్ కేకులా సేల్ అవుతున్న కొత్త 2020 క్రెటా; ఆరు నెలల్లో అరుదైన రికార్డ్!

ఈ విభాగంలో కొత్త 2020 హ్యుందాయ్ క్రెటా బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా ఉంది. కోవిడ్-19 వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ మోడల్ కస్టమర్లను ఆకర్షించడంలో విజయం సాధిస్తోంది. హ్యుందాయ్ పేర్కొన్న సమాచారం ప్రకారం, ప్రతి నెలా క్రెటా అమ్మకాలు పెరుగుతూనే వస్తున్నాయి. భారత మార్కెట్లో ఈ ఎస్‌యూవీ విజయం వెనుక అనేక కారణాలు ఉన్నాయి, ఇందులో ప్రధానంగా క్రెటాలో లభించే ఇంజన్ ఆప్షన్స్‌ను చెప్పుకోవచ్చు.

హాట్ కేకులా సేల్ అవుతున్న కొత్త 2020 క్రెటా; ఆరు నెలల్లో అరుదైన రికార్డ్!

దేశంలో బిఎస్6 ఉద్గార నిబంధనలు కఠినతరం చేశాక డీజిల్ ఇంజన్లకు గిరాకీ తగ్గింది. అయితే, అనూహ్యంగా హ్యుందాయ్ క్రెటా విషయంలో మాత్రం డీజిల్ వేరియంట్లకు గిరాకీ పెరుగుతూనే ఉంది. సరికొత్త 2020 హ్యుందాయ్ క్రెటా పూర్తిగా కొత్త ఇంజన్లతో లభిస్తుంది. పెట్రోల్, డీజిల్ వెర్షన్లతో కలిపి ఇది మొత్తం 15 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

MOST READ:ఆర్టిస్ట్ చేసిన బస్ నమూనాకు KSRTC ఫిదా, తర్వాత ఏం జరిగిందో తెలుసా?

హాట్ కేకులా సేల్ అవుతున్న కొత్త 2020 క్రెటా; ఆరు నెలల్లో అరుదైన రికార్డ్!

కొత్త 2020 హ్యుందాయ్ క్రెటాలో కొత్త 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు వరుసగా 115 బిహెచ్‌పిల శక్తిని మరియు 144 ఎన్ఎమ్ మరియు 250 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను అందిస్తాయి. హ్యుందాయ్ క్రెటా హై స్పెక్ వేరియంట్లలో 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

హాట్ కేకులా సేల్ అవుతున్న కొత్త 2020 క్రెటా; ఆరు నెలల్లో అరుదైన రికార్డ్!

ఈ మూడు ఇంజన్లు స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కావాలనుకునే వారికి కూడా ఇందులో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ సివిటి, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ టార్క్-కన్వర్టర్ మరియు 1.4-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

MOST READ:బ్యాంకింగ్ కుంభకోణంలో చిక్కుకున్న బిఆర్ శెట్టి లగ్జరీ కార్స్.. చూసారా !

హాట్ కేకులా సేల్ అవుతున్న కొత్త 2020 క్రెటా; ఆరు నెలల్లో అరుదైన రికార్డ్!

ఈ ఏడాది మార్చ్ నెలలో రిఫ్రెష్ చేసిన ఈ సరికొత్త 2020 హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్లలో కంపెనీ అనేక మార్పులు చేర్పులు చేసింది. ముందు భాగంలో సరికొత్త క్యాస్కేడింగ్ గ్రిల్‌, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌ల చుట్టూ కొత్తగా రూపొందించిన ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్, కొత్త ఎల్‌ఈడి ఫాగ్ ల్యాంప్స్ మరియు క్రింది భాగంలో ఫాక్స్ సిల్వర్ స్కఫ్ ప్లేట్ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

హాట్ కేకులా సేల్ అవుతున్న కొత్త 2020 క్రెటా; ఆరు నెలల్లో అరుదైన రికార్డ్!

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. కొత్త హ్యుందాయ్ క్రెటా బేసిక్ క్యాబిన్ డిజైన్‌ను యధావిధిగా ఉంచారు. స్టీరింగ్ వీల్‌పై కొన్ని రకాల కంట్రోల్స్ ఉంటాయి. ఇందులో డ్రైవర్ సమాచారం కోసం 7-ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇందులో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా జోడించారు. ఇది హ్యుందాయ్ అందిస్తున్న అఫీషియల్ బ్లూ-లింక్ కనెక్టివిటీ టెక్నాలజీతో పాటుగా యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

MOST READ:20 ఏళ్ళ బి.టెక్ అమ్మాయి ప్రాణం తీసిన గో-కార్టింగ్‌ సరదా.. ఎలాగో తెలుసా ?

హాట్ కేకులా సేల్ అవుతున్న కొత్త 2020 క్రెటా; ఆరు నెలల్లో అరుదైన రికార్డ్!

కొత్త హ్యుందాయ్ క్రెటాలో వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, పానోరమిక్ సన్‌రూఫ్, ఆంబియెంట్ లైటింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్ విత్ ఇబిడి, ప్యాడల్ షిఫ్టర్స్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు సెన్సార్లు, హిల్-స్టార్ట్ అసిస్ట్, హిల్-డీసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అధునాతన సాంకేతిక మరియు సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

హాట్ కేకులా సేల్ అవుతున్న కొత్త 2020 క్రెటా; ఆరు నెలల్లో అరుదైన రికార్డ్!

హ్యుందాయ్ క్రెటా సాధించిన మైలురాయిపై హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సేల్స్, మార్కెటింగ్ అండ్ సర్వీస్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, "ఎస్‌యూవీలను పరిగణనలోకి తీసుకునేటప్పుడు ఆల్ న్యూ క్రెటా కస్టమర్ల బ్రాండ్ ఆఫ్ ఛాయిస్‌గా అవతరించడం నిజంగా హ్యుందాయ్‌కు గర్వకారణం. క్రెటాకు లభిస్తున్న అనూహ్య స్పందన, ఈ బ్రాండ్ పేరుపై భారతీయ కస్టమర్ల నమ్మకాన్ని మరియు ప్రేమను పునరుద్ఘాటిస్తుంది. ఎస్‌యూవీ విభాగంలో నాయకత్వ వారసత్వాన్ని పునరుద్ఘాటిస్తూ, హ్యుందాయ్ క్రెటా 2015లో ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకూ 5,20,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయి పరిశ్రమలో మరో కొత్త బెంచ్ మార్కును నెలకొల్పింది" అని చెప్పారు.

MOST READ:20 ఏళ్ళ బి.టెక్ అమ్మాయి ప్రాణం తీసిన గో-కార్టింగ్‌ సరదా.. ఎలాగో తెలుసా ?

హాట్ కేకులా సేల్ అవుతున్న కొత్త 2020 క్రెటా; ఆరు నెలల్లో అరుదైన రికార్డ్!

"మా సూపర్ పెర్ఫార్మింగ్ బ్రాండ్ల బ్లాక్ బస్టర్ విజయాల కారణంగా, 2020 జనవరి నుండి హ్యుందాయ్ యొక్క ప్యాసింజర్ వెహికల్ మార్కెట్ వాటా 17.6 శాతంగా ఉంది. అంతేకాకుండా, ఆల్-న్యూ క్రెటా 2020 సెప్టెంబరులో 12,325 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది, దాని అమ్మకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది" అని తరుణ్ గార్గ్ చెప్పారు.

హాట్ కేకులా సేల్ అవుతున్న కొత్త 2020 క్రెటా; ఆరు నెలల్లో అరుదైన రికార్డ్!

హ్యుందాయ్ క్రెటా సేల్స్ రికార్డ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

హ్యుందాయ్ క్రెటా ఈ విభాగంలో చాలా సౌకర్యవంతమైన మరియు స్టైలిష్‌గా కనిపించే బెస్ట్ మిడ్-సైజ్ ఎస్‌యూవీగా ఉంది. ఈ ఫీచర్ లోడెడ్ హ్యుందాయ్ క్రెటా భారత మార్కెట్లో కియా సెల్టోస్, ఎమ్‌జి హెక్టర్, టాటా హారియర్, జీప్ కంపాస్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టి-రాక్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Hyundai Motor India Ltd. (HMIL) launched the Creta mid-size SUV back in 2015. Since its inception, the Creta has received a great response as far as the sales go. Hyundai has recently announced that the all-new 2020 Creta has crossed the 1,15,000 sales unit mark in the last six months. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X