హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలో 7-సీటర్ వెర్షన్!? - స్పై చిత్రాలు

హ్యుందాయ్ మోటార్ ఇండియా, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ క్రెటా ఎస్‌యూవీలో కంపెనీ ఓ కొత్త వెర్షన్‌ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. హ్యుందాయ్ క్రెటాకి ఎక్స్‌టెండెడ్ వెర్షన్‌గా రానున్న ఓ కొత్త మోడల్‌ను కంపెనీ భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది.

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలో 7-సీటర్ వెర్షన్!? - స్పై చిత్రాలు

హ్యుందాయ్ నుండి రానున్న ఈ కొత్త క్రెటా ఎస్‌యూవీ ఏడు సీట్ల (7 సీటర్) కాన్ఫిగరేషన్‌లో లభ్యమయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలో ఎప్పుడైనా ఇది భారత మార్కెట్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా, టీమ్-బిహెచ్‌పి నుండి లీకైన స్పై చిత్రాల ప్రకారం, ఏడు సీట్ల హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని తాత్కాలిక నెంబరు ప్లేట్‌తో టెస్టింగ్ చేస్తుండటాన్ని చూడొచ్చు.

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలో 7-సీటర్ వెర్షన్!? - స్పై చిత్రాలు

హ్యుందాయ్ క్రెటాలో మూడవ వరుస సీటింగ్ కోసం ఈ ఎస్‌యూవీ పొడవును కాస్తంత పెంచినట్లుగా అనిపిస్తుంది. దీని ఫలితంగా, ఎస్‌యూవీలో విశాలమైన క్యాబిన్ స్పేస్ లభిస్తుంది. హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్, హారియర్ మరియు గ్రావిటాస్ వంటి మోడళ్ల మాదిరిగానే ఈ కొత్త క్రెటా 7-సీటర్ ఎస్‌యూవీ కూడా తన స్మాల్ బ్రదర్ ప్లాట్‌ఫామ్‌ను పంచుకోనుంది.

MOST READ:ఈ-రిక్షాలు ఇవ్వ‌నున్న‌ సోనూసూద్.. కానీ ఇవి వారికి మాత్రమే

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలో 7-సీటర్ వెర్షన్!? - స్పై చిత్రాలు

స్టాండర్డ్ వెర్షన్ క్రెటాకి మరియు 7-సీటర్ క్రెటాకి డిజైన్ పరంగా కాస్తంత వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ఈ రెండు మోడళ్ల మధ్య తేడాను ఉంచేందుకు కంపెనీ ఇందులో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది.

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలో 7-సీటర్ వెర్షన్!? - స్పై చిత్రాలు

కొత్త 7-సీటర్ హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ డిజైన్‌లో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, పెద్ద రియర్ క్వార్టర్ ప్యానెల్, కొత్తగా రూపొందించిన రియర్ ఎండ్, అప్‌డేట్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, బూట్ లిడ్ మరియు ఎల్‌ఈడి టెయిల్ లైట్స్ వంటి మార్పులు ఉండొచ్చని అంచనా. ఇకపోతే, ఈ కొత్త 7-సీటర్ క్రెటాలోని అనేక ఇతర అంశాలు మరియు పరికరాలు స్టాండర్డ్ 5-సీటర్ క్రెటా మాదిరిగానే ఉండనున్నాయి.

MOST READ:మీకు తెలుసా.. అమెరికాలో 2021 రోల్స్ రాయిస్ ఘోస్ట్ కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి ఒక టీవీ షో హోస్ట్

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలో 7-సీటర్ వెర్షన్!? - స్పై చిత్రాలు

ఇంటీరియర్స్‌లో కూడా కొత్త 7-సీటర్ క్రెటాలో కొన్ని కీలకమైన మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇందులో ప్రధాన మార్పు అదనపు మూడవ-వరుస సీటింగ్ రూపంలో వస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే, ఏడు సీట్ల క్రెటాను దాని స్టాండర్డ్ ఎస్‌యూవీ మోడల్ మాదిరిగానే అదే పరికరాలు మరియు యాక్ససరీలతో ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది.

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలో 7-సీటర్ వెర్షన్!? - స్పై చిత్రాలు

ఇక ఇంజన్ విషయానికి వస్తే, స్టాండర్డ్ క్రెటాకి మరియు ఏడు సీట్ల హ్యుందాయ్ క్రెటాకి ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం. ప్రస్తుతం క్రెటాలో లభిస్తున్న ఇంజన్ ఆప్షన్లనే కొత్త క్రెటాలోనూ కొనసాగించనున్నారు. అయితే, కొత్త 7-సీటర్ క్రెటా దాని పొడగించిన బాడీ కారణంగా పవర్, టార్క్ గణాంకాల్లో స్వల్ప తేడా ఉండే అవకాశం ఉంది.

MOST READ:తల్లిని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నప్పుడు ట్రాఫిక్‌లో చిక్కుకున్న కొడుకు.. తర్వాత ఏం జరిగిందంటే ?

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలో 7-సీటర్ వెర్షన్!? - స్పై చిత్రాలు

ప్రస్తుతం మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా మూడు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో రెండు పెట్రోల్ (ఒకటి న్యాచురల్ మరొకటి టర్బో యూనిట్) మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తోంది. ఈ మూడు ఇంజన్లలో కొన్ని మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలో 7-సీటర్ వెర్షన్!? - స్పై చిత్రాలు

ఇందులో1.5-లీటర్ పెట్రోల్, 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు లభిస్తాయి. వీటిలో 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ యూనిట్లు వరుసగా 115 బిహెచ్‌పి పవర్‌తో 142 ఎన్ఎమ్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌లను ఉత్పత్తి చేస్తాయి.

MOST READ:కుక్క వల్ల అరెస్ట్ అయిన కార్ డ్రైవర్.. ఎందుకు, ఎలాగో మీరే చూడండి ?

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలో 7-సీటర్ వెర్షన్!? - స్పై చిత్రాలు

ఇకపోతే, ఇందులోని 1.4-లీటర్ టి-జిడిఐ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్‌పి పవర్‌ను మరియు 242 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మూడు ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్, ఐవిటి మరియు 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి.

హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలో 7-సీటర్ వెర్షన్!? - స్పై చిత్రాలు

కొత్తగా రానున్న 7-సీటర్ హ్యుందాయ్ క్రెటాలో పైన పేర్కొన్న మార్పులతో పాటుగా, ఇది కొత్త నేమ్‌ప్లేట్‌ను కూడా క్యారీ చేసే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలో లాంచ్ కానున్న ఈ మోడల్ మార్కెట్లో ఎమ్‌జి హెక్టర్ ప్లస్, టాటా గ్రావిటాస్, 7 సీటర్ జీప్ కంపాస్ మరియు న్యూ-జెన్ మహీంద్రా ఎక్స్‌యువి500 వంటి మోడళ్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంది.

Source:Autocar India

Most Read Articles

English summary
Hyundai Testing Seven Seater Creta SUV India, Spy Pics And Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X