Just In
Don't Miss
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌లో ఇసుజు బిఎస్ 6 డి-మాక్స్ & ఎస్-క్యాబ్ విడుదల : ధర & ఇతర వివరాలు
ఇసుజు తన మొదటి బిఎస్ 6 మోడల్స్ డి-మాక్స్ మరియు ఎస్-క్యాబ్లను ఎట్టకేలకు భారతదేశంలో విడుదల చేసింది. వీటి ధర వరుసగా రూ .8.38 లక్షలు మరియు రూ .9.24 లక్షలు. కొత్త ఇసుజు డి-మాక్స్ మరియు ఎస్-క్యాబ్ అనేక మార్పులు మరియు అదనపు ఫీచర్లు కలిగి ఉండటమే కాకుండా మరియు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలను అనుకూలంగా తయారుచేయబడింది.

ఇసుజు డి-మాక్స్ మరియు ఎస్-క్యాబ్ బిఎస్ 6 మోడళ్ల బుకింగ్స్ సంస్థ యొక్క అన్ని డీలర్‌షిప్‌లు మరియు వెబ్‌సైట్‌లోని ఆన్‌లైన్ లో బుక్ చేసుకోవచ్చు. సంస్థ తన మొదటి బిఎస్ 6 మోడళ్ల డెలివరీని త్వరలో ప్రారంభమవుతాయి. ఇసుజు డి-మాక్స్ మొత్తం మూడు వేరియంట్లలో విడుదలైంది. అవి సూపర్ స్ట్రాంగ్, స్టాండర్డ్ (రూ .8.28 లక్షలు) మరియు క్యాబ్ చాసిస్ (రూ .7.84 లక్షలు) వేరియంట్స్.

బిఎస్ 6 సూపర్ స్ట్రాంగ్ మోడల్ 1710 కిలోల మోసే సామర్థ్యం కలిగి ఉంది. దీని ప్రామాణిక మోడల్ 1240 కిలోల లోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇసుజు ఎస్-క్యాబ్ బిఎస్ 6 రెండు వేరియంట్స్ లో వచ్చింది. అవి స్టాండర్డ్ (రూ. 9.82 లక్షలు) మరియు హై రైడ్ (రూ. 10.07 లక్షలు) లో తీసుకువచ్చారు. అన్ని ధరలు [ఎక్స్-షోరూమ్, ముంబై].
D-MAX | Price Ex-Showroom (Mumbai) |
Super Strong 1710 kg | ₹8,38,929 |
1240 kg | ₹8,28,911 |
Cab Chassis | ₹7,84,239 |
S-Cab Standard | ₹9,82,150 |
S-Cab Hi-Ride | ₹10,07,139 |
MOST READ:ముంబై వీధుల్లో సైకిల్ పై కనిపించిన రణబీర్ కపూర్.. ఎందుకో తెలుసా?

ఇసుజు డి-మాక్స్ లో చాలా మార్పులు జరిగాయి. ఇది ఇప్పుడు చాలా ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంది. దీనికి కొత్త గ్రిల్ మరియు కొత్త బోనెట్ ఇవ్వబడింది.
కొత్త ఇసుజు డి-మాక్స్ ఫీచర్స్ గమనించినట్లయితే ఇందులో రూఫ్ రైల్స్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, సైడ్ స్టెప్, డ్రాప్ డౌన్ టెయిల్ గేట్, ఎక్స్‌టర్నల్ రియర్ వ్యూ మిర్రర్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్, ఫ్రంట్ స్క్విఫ్ ప్లేట్, రేడియేటర్ గ్రిల్ మొదలైనవి ఉన్నాయి.

దీని లోపలి భాగం పియానో బ్లాక్ యాసెంట్‌లో డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌తో ఉంది, తక్కువ శబ్దం కోసం ఇన్సులేట్ క్యాబిన్ ఇవ్వబడింది. ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్‌కు మద్దతు ఇచ్చే పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను కలిగి ఉంది. దాని సీట్ అప్హోల్స్టరీ మరియు స్టీరింగ్ వీల్‌లో కూడా మార్పులు చేయబడ్డాయి.
MOST READ:సెక్యూరిటీ గార్డు ప్రాణాలు తీసిన ఫెరారీ కార్.. ఎలాగో తెలుసా ?

భద్రత పరంగా, ఇసుజు డి-మాక్స్ బిఎస్ 6 లో సెన్సార్ క్లైమేట్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లేతో సెక్యూరిటీ కెమెరా అందించారు. దీని ముందు ప్యాసింజర్ సీటు కూడా ఉంటుంది. ఇది మునుపటికంటే సురక్షితంగా ఉండటమే కాకూండా, సుదీర్ఘ ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

ఇసుజు డి-మాక్స్ మరియు ఎస్ క్యాబ్ 2.5-లీటర్, 4-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 78 బిహెచ్‌పి పవర్ మరియు 176 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. ఇసుజు డి-మాక్స్ 220 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది.
MOST READ:జరభద్రం గురూ.. కారులో ఇలా చేసారంటే ప్రాణాలే పోవచ్చు.. కావాలంటే ఇది చూడండి

ఇసుజు డి-మాక్స్ మరియు ఎస్-క్యాబ్ బిఎస్ 6 యొక్క బుకింగ్ సంస్థ ప్రారంభించింది, ఈ పండుగ సీజన్లో అనేక లిమిటెడ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంచవచ్చు. ఆఫర్లకి సంబంధించి మరింత సమాచారం కంపెనీ వెబ్‌సైట్ నుండి పొందవచ్చు.