జీప్ కంపాస్ డెలివరీలు షురూ, ఎలా చేస్తున్నారో మీరే చూడండి

కరోనా వైరస్ కట్టడి కోసం దేశవ్యాప్తంగా దాదాపు రెండు నెలల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను ప్రకటించిన నేపథ్యంలో, అనేక ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశాయి. ఇందులో భాగంగానే, ప్రముఖ అమెరికన్ బ్రాండ్ జీప్ ఇండియా కూడా తమ కస్టమర్లకు ఇవ్వాల్సిన వాహనాల డెలివరీలను నిలిపివేసింది.

జీప్ కంపాస్ డెలివరీలు షురూ, ఎలా చేస్తున్నారో మీరే చూడండి

ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్ 5.0లో కేంద్ర ప్రభుత్వం అనేక సడలింపులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో, భారత్‌లో జీప్ ఇండియా తిరిగి తమ వాహనాల డెలివరీలను పునఃప్రారంభించింది. దేశంలోని దాదాపు అన్ని డీలర్‌షిప్ కేంద్రాలలో జీప్ ఇండియా డెలివరీలు రీస్టార్ట్ అయ్యాయి.

జీప్ కంపాస్ డెలివరీలు షురూ, ఎలా చేస్తున్నారో మీరే చూడండి

కంటైన్మెంట్ జోన్లు మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో జీప్ ఇండియా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. రెండు నెలల సుధీర్ఘ లాక్‌డౌన్ అనంతరం జీప్ తిరిగి తమ కస్టమర్లకు తొలి బ్యాచ్ వాహనాలను డెలివరీ చేయటం స్టార్ట్ చేసింది.

MOST READ: అప్‌డేట్ ఫీచర్స్ తో లాంచ్ కానున్న 2020 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్

జీప్ కంపాస్ డెలివరీలు షురూ, ఎలా చేస్తున్నారో మీరే చూడండి

కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో, వాహనాలను డెలివరీ చేసేటప్పుడు జీప్ ఇండియా తమ కస్టమర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. సామాజిక దూరంతో పాటుగా అన్ని రకాలుగా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టింది. డీలర్‌షిప్ కేంద్రాలను మరియు కస్టమర్లకు అందించే వాహనాలను పూర్తిగా శానిటైజ్ చేసింది.

జీప్ కంపాస్ డెలివరీలు షురూ, ఎలా చేస్తున్నారో మీరే చూడండి

షోరూమ్ సందర్శనకు వచ్చే కస్టమర్ల విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంది. కస్టమర్ల కోసం డిస్‌ప్లే ఉంచిన వాహనాలను లోపల, బయట ప్రతిసారి వ్యక్తిగతంగా శానిటైజ్ చేస్తున్నారు. షోరూమ్‌లలో పనిచేసే సిబ్బంది మాస్కులు, గ్లౌజ్‌లు ధరించి కస్టమర్లకు సేవలందిస్తున్నారు. కస్టమర్లకు కూడా శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజ్‌లను అందుబాటులో ఉంచారు.

MOST READ: 2021 లో విడుదలకానున్న నాలుగు 7 సీటర్ ఎస్‌యువి జీప్స్

జీప్ కంపాస్ డెలివరీలు షురూ, ఎలా చేస్తున్నారో మీరే చూడండి

ఇదిలా ఉంటే.. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బయటకు రావటం ఇష్టం లేని కస్టమర్ల కోసం కూడా జీప్ ఇండియా ఓ కొత్త తరహా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆప్షన్‌తో కస్టమర్లు తమ ఇంటి నుండే ఆన్‌లైన్ ద్వారా తమకు నచ్చిన జీప్ వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు. జీప్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు ఇదొక మంచి విర్చ్యువల్ ఎక్స్‌పీరియెన్స్.

జీప్ కంపాస్ డెలివరీలు షురూ, ఎలా చేస్తున్నారో మీరే చూడండి

ఇటీవలి కాలంలో ఇండియన్ మార్కెట్లో ఎస్‌యూవీలకు గిరాకీ బాగా పెరిగింది. లాక్‌డౌన్ తర్వాత కార్ కంపెనీలు అన్నీ కూడా అమ్మకాలను పెంచుకునేందుకు కొత్త స్కీమ్‌లను ప్రవేశపెడుతున్నాయి. ఇందులో భాగంగానే, జీప్ ఇండియా కూడా తమ వినియోగదారుల కోసం విస్తృత శ్రేణి ఫైనాన్షియల్ స్కీమ్‌లను మరియు ఈఎమ్ఐ అష్షూరెన్స్ ప్రోగ్రామ్స్‌ను ప్రవేశపెట్టింది.

MOST READ: భారత్‌లో విదుదల కానున్న కొత్త జీప్ కాంపాక్ట్ ఎస్‌యువి

జీప్ కంపాస్ డెలివరీలు షురూ, ఎలా చేస్తున్నారో మీరే చూడండి

జీప్ భారత మార్కెట్లో విడుదల చేసిన 'జీప్ కంపాస్' ఎస్‌యూవీ బాగా పాపులర్ అయింది. ఈ మోడల్‌కు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఈ ప్రీమియం ఎస్‌యూవీలో త్వరలోనే ఓ కొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జీప్ కంపాస్ డెలివరీలు షురూ, ఎలా చేస్తున్నారో మీరే చూడండి

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ జీప్ కంపాస్ విషయాన్ని అటుంచితే, ఈ మోడల్‌లో కొత్తగా ఓ 7-సీటర్ వెర్షన్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు గతంలో ఓ సందర్భంలో ప్రకటించింది. ప్రత్యేకించి భారత మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని అధిక సీటింగ్ సామర్థ్యం కోసం ఓ కొత్త వేరియంట్ జీప్ కంపాస్‌ను కంపెనీ డెవలప్ చేస్తోంది. కాకపోతే లాక్‌డౌన్ కారణంగా ఈ వేరియంట్ విడుదల మరింత జాప్యం కానుంది. వచ్చే ఏడాది నాటికి ఇది విడుదల కావచ్చని అంచనా.

జీప్ కంపాస్ డెలివరీలు షురూ, ఎలా చేస్తున్నారో మీరే చూడండి

జీప్ కంపాస్ డెలివరీల పునఃప్రారంభంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

అమెరికాలో అత్యంత పాపులర్ అయిన జీప్ బ్రాండ్‍‌కు ఇండియా చాలా కొత్త మార్కెట్. జీప్ ఇండియా అతి తక్కువ సమయంలోనే భారత్‌‍లో మంచి పాపులారీటిని సంపాధించుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, జీప్ ఇండియా తమ కస్టమర్ల విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు ప్రశంసనీయం. నానాటికీ వృద్ధి చెందుతున్న భారత్ ఎస్‌యూవీ మార్కెట్లో జీప్ నిలదొక్కుకోవాలంటే ఇక్కడి మార్కెట్లో మరిన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ వాహనాలను విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
Jeep India has resumed deliveries across most of its dealerships in India. The company announced the reopening of all its dealerships out of the containment zones late last month amidst the lockdown relaxations offered by the government. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X