ఆటో ఎక్స్‌పో 2020 లో ఆవిష్కరించిన కియా యొక్క కొత్త బ్రాండ్ ఇదే

ఆటో ఎక్స్‌పో 2020 లో కియా సెల్టోస్ ఎక్స్-లైన్ మోడల్ ని ఆవిష్కరించింది. కియా మోటార్స్ లో ఇప్పుడు అత్యధికంగా అమ్ముడవవుతున్న వెర్షన్ "కియా సెల్టోస్". ఇప్పుడు కొనసాగుతున్న ఆటో ఎక్స్‌పోలో కియా బ్రాండ్ నుంచి మరొక కొత్త వెర్షన్ ని ఆవిష్కరించింది. ఇదే కియా సెల్టోస్ ఎక్స్-లైన్ మోడల్. ఇది చూడటానికి అద్భుతంగా ఉంటుంది.

ఆటో ఎక్స్‌పో 2020 లో ఆవిష్కరించిన కియా యొక్క కొత్త బ్రాండ్ ఇదే

కియా సెల్టోస్ ఎక్స్-లైన్ సాధారణమైన వాటికంటే కూడా ఎక్కువ నవీనీకరణలు చేయబడ్డాయి. ఇందులో రివైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, స్కిడ్ ప్లేట్స్ వంటివి ఉన్నాయి. ఇది చూడటానికి గన్-మెటల్ గ్రే కలర్ లో ఉంటుంది.

ఆటో ఎక్స్‌పో 2020 లో ఆవిష్కరించిన కియా యొక్క కొత్త బ్రాండ్ ఇదే

కియా సెల్టోస్ ఎక్స్-లైన్ కూడా బ్లాక్-అవుట్ ఎలిమెంట్స్‌ని కలిగి ఉంటుంది. ఇందులో ఎక్కడా క్రోమ్ ఉండదు. ఇది డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌తో పాటు ముందు మరియు వెనుక ఫాక్స్ ఎయిర్ వెంట్స్‌ కాపర్ కలర్ కాంట్రాస్టింగ్ హైలైట్‌లతో వస్తుంది.

ఆటో ఎక్స్‌పో 2020 లో ఆవిష్కరించిన కియా యొక్క కొత్త బ్రాండ్ ఇదే

కియా సెల్టోస్ ఎక్స్-లైన్ లో బాహ్య సౌందర్య నవీనీకరణలతో పాటు ఇంటీరియర్ లో కూడా కొన్ని మార్పులు చేయబడ్డాయి. ఇందులో 1.4 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 140 బిహెచ్‌పి శక్తి వద్ద 242 ఎన్ఎమ్ పీక్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

ఆటో ఎక్స్‌పో 2020 లో ఆవిష్కరించిన కియా యొక్క కొత్త బ్రాండ్ ఇదే

కియా సెల్టోస్ ఎక్స్-లైన్ తొలిసారిగా 2019 లో ప్రారంభమైంది. ఇది అప్పుడు ఇంటర్నేషనల్-స్పెక్ కాన్సెప్ట్ వెర్షన్ లో రూపొందించిన అల్లాయ్ వీల్స్, ఫ్రంట్-మౌంటెడ్ వించ్ మరియు ఆఫ్-రోడ్ టైర్లతో వచ్చింది.

ఆటో ఎక్స్‌పో 2020 లో ఆవిష్కరించిన కియా యొక్క కొత్త బ్రాండ్ ఇదే

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:

కియా సెల్టోస్ ఎక్స్-లైన్ భారత మార్కెట్లో టాప్ స్పెక్ జిటి లైన్ ఆధారంగా రూపొందించబడింది. కియా సంస్థకి ఇప్పుడు ఎక్స్-లైన్‌ను ప్రవేశపెట్టే ఉద్దేశం లేదు కానీ భవిష్యత్ లో రాబోయే ఈ వెహికల్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ ఆవిష్కరణ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న వాటిలో కియా సెల్టోస్ ముందంజలో ఉంది.

Most Read Articles

English summary
Auto Expo 2020: Kia Seltos X-Line Unveiled - A More Rugged Version Of India’s Best-Selling SUV. Read in Telugu.
Story first published: Thursday, February 6, 2020, 12:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X