కియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన సోనెట్; ఆగస్ట్ 7న విడుదల!

భారత కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో పోటీ నానాటికీ పెరుగుతోంది. ఈ సెగ్మెంట్లో నిత్యం కొత్త మోడళ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ కూడా ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఓ సరికొత్త ఉత్పత్తిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కియా సోనెట్ పేరుతో రానున్న ఈ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ ఆగస్ట్ 7వ తేదీన ఆవిష్కరించనుంది.

కియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన సోనెట్; ఆగస్ట్ 7న విడుదల!

సబ్ 4-మీటర్ (ఎస్‌యూవీ మొత్తం పొడవు నాలుగు మీటర్ల కన్నా తక్కువగా ఉండే) విభాగంలో విడుదల కానున్న కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని కంపెనీ మార్కెట్లో విడుదల చేయటానికి ముందే తమ అధికారిక ఇండియన్ వెబ్‌సైట్ ప్రోడక్ట్ జాబితాలో చేర్చింది. కియా సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ మాదిరిగానే కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి కూడా భారతదేశం వేదికగా కియా మోటార్స్ ఆగస్టు 7, 2020వ తేదీన గ్లోబల్ ప్రీమియర్ నిర్వహించనుంది.

కియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన సోనెట్; ఆగస్ట్ 7న విడుదల!

కియా సోనెట్ ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి భారత మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేయడానికి ముందే, కంపెనీ ఈ కారులోని కొన్ని కీలక ఫీచర్లను వెల్లడించే ఇప్పటికే కొన్ని టీజర్లను కూడా విడుదల చేసింది.

MOST READ:శ్రామిక్ ట్రైన్స్ వల్ల ఇండియన్ రైల్వే ఎంత వసూలు చేసిందో తెలుసా ?

కియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన సోనెట్; ఆగస్ట్ 7న విడుదల!

కియా సోనెట్ డిజైన్ విషయానికి వస్తే, ఇందులో కియా సిగ్నేచర్ టైగర్-నోస్ గ్రిల్ కారుకి బోల్డ్ అండ్ అగ్రెసివ్ లుక్‌నిస్తుంది. వీటితో పాటు, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, రెండు చివర్లలో ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు, స్ప్లిట్ టెయిల్ ల్యాంప్స్, బూట్ లిడ్‌పై ఎల్ఈడి లైట్ బార్, ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ మరియు ఎల్ఈడి స్టాప్ లైట్ వంటి ఫీచర్లు ఉంటాయి.

కియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన సోనెట్; ఆగస్ట్ 7న విడుదల!

సైడ్ డిజైన్‌ను గమనిస్తే, ఇందులో డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, చంకీ బాడీ క్లాడింగ్, రూఫ్ రైల్స్ ఉంటాయి. అగ్రెసివ్‌గా కనిపించే ఫ్రంట్ ఫాసియాతో కియా సోనెట్ గంభీరమైన ఎస్‌యూవీ వైఖరిని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

MOST READ:కొత్త యమహా XSR 155 బైక్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

కియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన సోనెట్; ఆగస్ట్ 7న విడుదల!

కారు లోపలి భాగంలోని ఫీచర్లను గమనిస్తే, కియా ఎస్‌యూవీని బెస్ట్-ఇన్-క్లాస్ 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఆఫర్ చేయనున్నట్లు సమాచారం. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు యూవీఓ కనెక్టింగ్ టెక్నాలజీ ఫీచర్లను సపోర్ట్ చేయనుంది. ఇంకా ఇందులో వెంటిలేటెడ్ సీట్లు, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉండొచ్చని సమాచారం.

కియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన సోనెట్; ఆగస్ట్ 7న విడుదల!

ఈ ఎస్‌యూవీలో జోడించబోయే ఇతర ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో వెనుక వైపు ప్యాసింజర్ల కోసం రియర్ ఏసి వెంట్స్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. అలాగే, ఇందులో బ్లైండ్ స్పాట్ మోనిటర్, బహుళ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ వంటి ఇతర స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా లభించనున్నాయి.

MOST READ:చివరకు పట్టుబడ్డ దేశంలోనే అతిపెద్ద దొంగల ముఠా

కియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన సోనెట్; ఆగస్ట్ 7న విడుదల!

ఇంజన్, గేర్‌బాక్స్ విషయానికి వస్తే, కియా భాగస్వామి హ్యుందాయ్ తమ వెన్యూ మోడల్‌లో ఉపయోగిస్తున్న వాటిని ఈ కొత్త సోనెట్‌లోనూ ఉపయోగించవచ్చని సమాచారం. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5 డీజిల్ ఇంజన్ మరియు 1.0 టర్బో-పెట్రోల్ ఇంజన్‌లు ఉండొచ్చని అంచనా.

కియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన సోనెట్; ఆగస్ట్ 7న విడుదల!

ఈ మూడు ఇంజన్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ఆప్షన్లతో లభ్యం కానున్నాయి. ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఐవిటి ఆటోమేటిక్‌తో జతచేయబడి ఉంటుంది. ఇకపోతే, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షనల్ టార్క్ కన్వర్టర్‌తో 6-స్పీడ్ మాన్యువల్‌కు జతచేయబడి ఉంటుంది. టాప్-స్పెక్ వేరియంట్‌లో 1.0-లీటర్ టర్బో ఇంజన్‌ను ఐఎమ్‌టి లేదా 7-స్పీడ్ డిసిటితో ఆఫర్ చేసే అవకాశం ఉంది.

MOST READ:బైకర్‌పై పోలీసులకు పిర్యాదు చేసిన జయ బచ్చన్ : ఎందుకంటే ?

కియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైన సోనెట్; ఆగస్ట్ 7న విడుదల!

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రస్తుతం ఈ బ్రాండ్ అందిస్తున్న లైనప్‌లోని ఇతర మోడళ్ల మాదిరిగానే ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో లభిస్తుందని అంచనా. ఇది ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టాటా నెక్సాన్ మరియు మహీంద్రా ఎక్స్‌యువీ300 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. సెల్టోస్, కార్నివాల్ మోడళ్లతో వరుస విజయాలను దక్కించుకున్న కియాకు సోనెట్ కూడా మంచి అమ్మకాలను తెచ్చిపెట్టగలదని కంపెనీ భావిస్తోంది.

Most Read Articles

English summary
The demand for SUVs has seen a substantial increase across the world, mostly because of the practicality it offers. The compact-SUV segment is one among the most competitive space in the Indian market and is getting added with new models soon. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X