Just In
- 17 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 1 day ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 1 day ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 1 day ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
మాజీ రాష్ట్రపతి కలాం సోదరుడు మహమ్మద్ ముత్తుమీర కన్నుమూత
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Movies
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టెస్లా కార్ కంపెనీని భారత్‌కు ఆహ్వానించిన టెస్లా; ప్లాంట్ కూడా అక్కడేనా?
ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' వచ్చే ఏడాది భారత్‌లోకి ప్రవేశించినున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, తాజాగా ఇందుకు సంబంధించి మరో కొత్త అప్‌డేట్ వచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం టెస్లాను భారత్‌కు రావల్సిందిగా ఆహ్వానించింది.

దేశంలో పెట్టుబడులు పెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం టెస్లా అధికారులను కోరింది. ఈ మేరకు టెస్లా అధికార ప్రతినిధులతో కంపెనీ ఓ సమావేశాన్ని కూడా నిర్వహించింది. మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే ఈ విషయాన్ని ధృవీకరించారు.

ఆయన చేసిన ట్వీట్ ప్రకారం, రాష్ట్రంలో పెట్టుబడుల గురించి చర్చించడానికి ఆయన, రాష్ట్ర పరిశ్రమల మంత్రి సుభాష్ దేశాయ్ గురువారం టెస్లా బృందంతో వీడియో కాల్ ద్వారా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.
MOST READ:68 ఏళ్ల వయసులో అందరిని ఆశ్చర్యపరిచిన వృద్ధ మహిళ.. ఇంతకీ ఏం చేసిందో తెలుసా?

భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలదే పైచేయిగా మారుతుందని, ఇందుకు సంబంధించిన మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు, పర్యావరణానికి హాని చేయని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

మరోవైపు టెస్లా పరిశ్రమను దేశానికి రప్పించేందుకు ఇతర రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నాయి. ఇటీవలి కథనాల ప్రకారం, టెస్లా భారతదేశంలో తమ పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాన్ని (ఆర్ అండ్ డి) ఏర్పాటు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వంతో కూడా చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం.
MOST READ:అశోక్ లేలాండ్ నుంచి రెండు కొత్త వెహికల్స్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

దేశంలో అంకితమైన ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని ప్రకటించిన తొలి భారత రాష్ట్రం కర్ణాటక. ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలకు ప్రభుత్వం నుండి రాయితీలను ఇవ్వడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మరియు యాజమాన్య వ్యయాన్ని తగ్గించడమే ఈ రాష్ట్రం యొక్క ప్రధాన లక్ష్యం. బెంగుళూరు కేంద్రంగా ఇప్పటికే అనేక ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

తమిళనాడు రాష్ట్రం కోసం టెస్లా కంపెనీ భారత్‌కు ఆహ్వానించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి, టెస్లా సిఇఒ ఎలన్ మస్క్‌తో సహా 11 మంది గ్లోబల్ ఆటోమోటివ్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లను తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు.
MOST READ:సైకిల్ రిపేర్ షాప్ ఓనర్ తయారుచేసిన ఎలక్ట్రిక్ బైక్.. ఎలా ఉందో చూసారా ?

కాగా, టెస్లా సంస్థ సీఈఓ ఎలన్ మస్క్ భారత్‌లోకి ప్రవేశించడాన్ని పరోక్షంగా ధృవీకరించారు. ఎలన్ మస్క్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా, వచ్చే ఏడాది భారత మార్కెట్లో టెస్లా కార్లను విడుదల చేస్తామని సమాధానమిచ్చారు.

టెస్లా క్లబ్స్ ఇండియాలో ఓ టీ-షర్టు ఫొటోను పోస్టు చేశారు, ఆ టీ-షర్టుపై ‘ఇండియా వాంట్స్ టెస్లా' అని ప్రింట్ చేయబడి ఉంది. దీనిని గుర్తించిన ఓ అభిమాని, అంటే దీనర్థం భారత్‌కు టెస్లా వస్తుందనా? అయితే ఎప్పుడు? అని ప్రశ్నించ ఎలోన్ మస్క్ ‘వచ్చే ఏడాది ఖచ్చితంగా' అంటూ సమాధానం ఇచ్చారు.
MOST READ:హ్యుందాయ్ ట్యుసాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ ; ఫీచర్స్ & ఇతర వివరాలు

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టాప్ ఎలక్ట్రిక్ ఆటోమోటివ్ తయారీదారుల్లో టెస్లా మార్కెట్ లీడర్‌గా ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అటానమస్ డ్రైవింగ్, సుధీర్ఘ బ్యాటరీ రేంజ్, విలాసవంతమైన ఫీచర్లు, ధృడమైన నిర్మాణం వంటి ఎన్నో విశిష్టలతో టెస్లా ఎలక్ట్రిక్ కార్లు తయారవుతాయి.

మహారాష్ట్ర ప్రభుత్వం టెస్లా ఎలక్ట్రిక్ కార్ కంపెనీని భారత్‌కు ఆహ్వానించడంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
టెస్లా కార్ కంపెనీ భారత్‌కు రావటమే ఓ పెద్ద విశేషం. అలాంటి, ఈ కార్ కంపెనీ భారత్‌లో ఏ రాష్ట్రానికి వచ్చినా సంతోషమే. మహారాష్ట్రలో టెస్లా ఏర్పాటు కావల్సిన అన్ని మౌళిక సదుపాయాలు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కార్ కంపెనీతో మహారాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న చర్చలు సఫలమైతే, వచ్చే ఏడాది నాటికి భారత రోడ్లపై టెస్లా కార్లు పరుగులు పెట్టే ఆస్కారం ఉంది.