Just In
Don't Miss
- News
చంద్రబాబు పిల్లర్లు కదులుతున్నాయ్ ; దేవినేని ఉమ ఒక లోఫర్ : ధ్వజమెత్తిన వల్లభనేని వంశీ
- Movies
దీప్తి సునయన అలాంటిది కాదు.. నోయల్ సెన్సేషనల్ కామెంట్స్
- Lifestyle
ఈ హార్మోన్ల సమస్య ఉన్న మహిళలు బరువు తగ్గడం చాలా కష్టం...!
- Finance
Budget 2021: 10 ఏళ్లలో బడ్జెట్‌కు ముందు సూచీలు ఇలా, ఇన్వెస్టర్లకు హెచ్చరిక!
- Sports
చరిత్ర సృష్టించిన భారత్.. బ్రిస్బేన్ టెస్టులో ఘన విజయం!! టెస్ట్ సిరీస్ టీమిండియాదే!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త మహీంద్రా బొలెరో
మహీంద్రా & మహీంద్రా యొక్క ఎస్‌యువి సిరీస్‌లో అత్యధికంగా అమ్ముడైన వాహనాల్లో బొలెరో ఒకటి. బొలెరో ఎస్‌యువి చాలా కాలంగా దేశీయ మార్కెట్లో బాగా అమ్ముడవుతోంది.

భారత ప్రభుత్వం నిర్దేశించిన దాని ప్రకారం ఏప్రిల్ 1 కల్లా బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా వాహనాలను అప్డేట్ చేయాలి. ఈ కారణంగా అన్ని సంస్థలు ఇప్పటికి తమ బ్రాండ్ వాహనాలను బిఎస్-6 నిబంధనకు అనుకూలంగా తయారు చేయడం కూడా జరిగింది. ఈ నియమం ప్రకారం మహీంద్రా తన ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను అప్‌డేట్ చేయడంలో బిజీగా ఉంది.

ఇందులో భాగంగా కంపెనీ ప్రముఖ ఎస్‌యువి బొలెరో బిఎస్ 6 నిబంధనలకు అనుకూలంగా అప్‌గ్రేడ్ అవుతోంది. మహీంద్రా తన బొలెరో ఎస్‌యువిలో బిఎస్ 6 ఇంజిన్‌తో స్పాట్ టెస్ట్ నిర్వహించింది. కొత్త బొలెరో ఎస్‌యువి భారతీయ రోడ్లపై స్పాట్ టెస్ట్ నిర్వహించినట్లు ఆటోకార్ వెల్లడించింది.

దీనిని బిఎస్-6 నిబంధనలకు అనుకూలంగా మాత్రమే కాకుండా ఇంత మార్పులు కూడా జరిపింది. కొత్త డిజైన్ లతో మరియు మరింన్ని భద్రతా లక్షణాలతో దీనిని అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఈ విధానంగా మహీంద్రా బొలెరో నవీనీకరించడం ద్వారా వినియోగదారులను మరింత ఆకర్షించే అవకాశం వుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించైనా బొలెరో ముందు భాగంలో అప్‌గ్రేడ్ చేసిన బంపర్ మరియు అప్‌డేటెడ్ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. బొలెరో ముఖభాగం ఈ కొత్త నవీకరణతో ఆకర్షణీయమైన రూపాన్ని పొందబోతోంది.

కొత్త బొలెరో ఎస్‌యువి లోపలి భాగంలో కొన్ని అదనపు ఫీచర్లు జోడించబడే అవకాశం ఉంది. బొలెరో ఎస్‌యువి 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌కు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ 1.5 లీటర్ ఇంజన్ ఎస్‌యువి మోడల్‌లో 75 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

భద్రత కోసం కొత్త మహీంద్రా బొలెరో ఎస్‌యువిలో ఎయిర్‌బ్యాగులు, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటివి ఏర్పాటు చేస్తుంది. ఈ ఎస్‌యువి విభాగంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీలలో బొలెరో ఒకటి అని చెప్పడంలో సందేహం లేదు.

2020 బొలెరో ఎస్‌యువి ధర ప్రస్తుత మోడల్ కంటే 50 వేల ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కొత్త బొలెరో ఎస్‌యువిని త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు.
Source: Autocar India