ఇండియాలో మహీంద్రా మరాజో లాంచ్ ఎప్పుడంటే.. ?
ముంబైకి చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందిన కంపెనీ. ఇది ఈ సంవత్సరం మే నెలలో కొత్త వేరియంట్ ని మార్కెట్లోకి విడుదల చేయనుంది. మహీంద్రా విడుదల చేయనున్న కొత్త వేరియంట్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.. !

ముంబైకి చెందిన మహీంద్రా కంపెనీ ఇండియన్ మార్కెట్లో మహీంద్రా మరాజో యొక్క పెట్రోల్ వెర్షన్ని విడుదల చేయనుంది. కానీ ఈ పెట్రోల్ వెర్షన్ కంటే ముందు బిఎస్-6 డీజిల్ వెర్షన్ ని విడుదల చేయనుంది.

మహీంద్రా మరాజో పెట్రోల్ వెర్షన్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ని కలిగి ఉంటుంది. ఈ కొత్త టర్బోచార్జ్డ్ గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్ (టిజిడిఐ) 161 బ్రేక్ హార్స్‌పవర్ మరియు 280 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలను కలిగి ఉంటుంది.

మహీంద్రా మరాజో కొత్త ఇంజన్లలో ఇంటిగ్రేటెడ్ ఎగ్జాస్ట్ మానిఫోల్డ్స్, ఆఫ్-సెట్ క్రాంక్ షాఫ్ట్, 250 బార్ ఫ్యూయల్-ఇంజెక్షన్ రైల్ సిస్టమ్ మరియు డ్యూయల్-మాస్ ఫ్లైవీల్స్ వంటివి ఉన్నాయి.

మహీంద్రా మరాజో కొత్త mStallion జి 15 ఇంజిన్‌ను కలిగి ఉన్న వెహికల్ సంస్థ యొక్క మొట్టమొదటి మోడల్ అవుతుంది. జి 15 కూడా మహీంద్రా మరియు ఫోర్డ్ యొక్క ఇన్-డెవలప్‌మెంట్ మిడ్‌సైజ్ ఎస్‌యూవీలపై అమర్చబడుతుందని భావిస్తున్నారు. మహీంద్రా మరాజో ధర 7.59 లక్షల నుండి 11.21 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య ఉన్న మారుతి సుజుకి ఎర్టిగా పెట్రోల్ మోడళ్లతో పోటీ పడటానికి ధర నిర్ణయించబడుతుందని అంచనాలు ఉన్నాయి.

మహీంద్రా కంపెనీకి సంబంధించిన వార్తల ప్రకారం సంస్థ యొక్క ఎక్స్‌యువి 300 మోడల్ ఇటీవల గ్లోబల్ NCAP యొక్క మొట్టమొదటి ‘సేఫ్ ఛాయిస్' అవార్డును గెలుచుకుంది. అంతే కాకుండా మహీంద్రా ఎక్స్‌యువి 300 మంచి భద్రతా లక్షణాలను కలిగి ఉండటం వల్ల ఈ అవార్డుని గెలుచుకుంది.

సేఫ్ ఛాయిస్ అవార్డును పొందాలంటే వాహనాలు చాలా కఠినమైన భద్రతా ప్రమాణాలను కలిగి ఉండాలి. అంతే కాకుండా కార్లు ఐక్యరాజ్యసమితి రెగ్యులేషన్ యుఎన్ 127 లేదా జిటిఆర్ 9 నిర్దేశించిన పాదచారుల రక్షణ ప్రమాణాలకు కూడా అనుగుణంగా ఉండాలి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:
మహీంద్రా మరాజో పెట్రోల్ మోడల్స్ ఈ ఏడాది మేలో ప్రారంభించబడుతున్నాయి. ఆఫర్‌పై పెట్రోల్ ఇంజన్ కలిగి ఉండటం వల్ల ఇది ఎక్కువ అమ్మకాలను కలిగి ఉంటుందని ఆశిస్తున్నారు. మరాజో యొక్క ప్రత్యర్థులు అయిన ఎర్టిగా 49:51 పెట్రోల్ మరియు డీజిల్ మోడల్ అమ్మకాలను నమోదు చేయగా, ఇన్నోవా క్రిస్టా 2:98 నిష్పత్తి అమ్మకాలను నమోదు చేసింది. మే నెలలో ఈ వెర్షన్ లాంచ్ అయిన తర్వాత దీని గురించి మరింత సమాచారం తెలుస్తుంది.


Click it and Unblock the Notifications








