ఎలక్ట్రిక్ ఎక్స్‌యువి 300 ని ఆవిష్కరించిన మహీంద్రా

2020 ఆటో ఎక్స్‌పోలో మహీంద్రా ఎక్స్‌యువి 300 ని ఆవిష్కరించింది. ఇప్పుడు కొనసాగుతున్న ఆటో ఎక్స్‌పో 2020 లో మహీంద్రా తన బ్రాండ్ నుంచి ఎక్స్‌యువి 300 ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఎక్స్‌పోలో ప్రదర్శించిన మహీంద్రా ఎక్స్‌యువి 300, 2021 కల్లా ఇండియన్ మార్కెట్లో బహిరంగంగా ప్రవేశించనుంది.

ఎలక్ట్రిక్ ఎక్స్‌యువి 300 ని ఆవిష్కరించిన మహీంద్రా

కొత్తగా రిలీజ్ అయిన ఎలక్ట్రిక్ మహీంద్రా ఎక్స్‌యువి 300 భవిష్యత్ లో మహీంద్రా నుండి విడుదలయ్యే చాలా వాహనాలకు మార్గదర్శిగా ఉండబోతోంది. ఈ ఎలక్ట్రిక్ ఎక్స్‌యువి 350 వి పవర్‌ట్రెయిన్‌తో వస్తుందని. భవిష్యత్ లో మరింత శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారు వాహనాలను విడుదల చేయడానికి మహీంద్రా ఆలోచిస్తోంది.

ఎలక్ట్రిక్ ఎక్స్‌యువి 300 ని ఆవిష్కరించిన మహీంద్రా

మహీంద్రా ఎలక్ట్రిక్ ఎక్స్‌యువి చూడటానికి చాలా స్టైల్ గా ఉంటుంది. ఇందులో కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్, దీని చుట్టూ బ్లూ అక్సెంట్స్ ఉంటాయి. ఒక జత హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌లని కూడా కలిగి ఉంటుంది.

ఎలక్ట్రిక్ ఎక్స్‌యువి 300 ని ఆవిష్కరించిన మహీంద్రా

ఇండియన్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా బ్యాటరీలను ఉత్పత్తి చేస్తున్న LG నుండి మహీంద్రా ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్యాక్ లను పొందుతుంది. భవిష్యత్ లో తయారు చేసే ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కోసం లిథియం అయాన్ బ్యాటరీలను అభివృద్ధి చేయడానికి రెండు కంపెనీలు కలిసి పని చేసాయి.

ఎలక్ట్రిక్ ఎక్స్‌యువి 300 ని ఆవిష్కరించిన మహీంద్రా

మహీంద్రా ఇప్పటికే 2020 ఆటో ఎక్స్‌పోలో ఎలెక్ట్రిక్ కెయువి 100 ని అతి తక్కువ ధరలకే పరిచయం చేసింది. దీని ప్రారంభ ధర 8.25 లక్షలు. మహీంద్రా ఎక్స్‌యూవీ 300 ని కూడా ఆవిష్కరించడానికి ఆటో ఎక్స్‌పో పర్మిషన్ తీసుకుంది.

ఎలక్ట్రిక్ ఎక్స్‌యువి 300 ని ఆవిష్కరించిన మహీంద్రా

మహీంద్రా ఎలెక్ట్రిక్ కెయువి 300 మరియు కెయువి 100 లాంచ్ కాకుండా ఇప్పుడు ఫన్స్టర్ కాన్సెప్ట్‌ని కూడా ప్రదర్శించింది. ఇది మార్కెట్లో మహీంద్రా యొక్క రెండవ తరం ఎక్స్‌యూవీ 500 ని పరిదృశ్యం చేసే అవకాశం ఉంది.

ఎలక్ట్రిక్ ఎక్స్‌యువి 300 ని ఆవిష్కరించిన మహీంద్రా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:

మహీంద్రా ఇకెయువి 300 ఇండియాలో చాలా సందర్భాల్లో పరీక్షించడం జరిగింది. అయితే మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యువికి సమీపంలో ఉన్న వెర్షన్ ని ప్రదర్శించడం ఇదే మొదటి సారి అని చెప్పవచ్చు. మహీంద్రా ఇకెయువి 300 ఒకసారి మార్కెట్లోకి అడుగుపెట్టిన తరువాత టాటా నెక్సాన్ ఇవి కి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Auto Expo 2020: Mahindra eXUV300 Unveiled - Expected Launch Date, Specs, Key Features & More. Read in telugu.
Story first published: Thursday, February 6, 2020, 11:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X